25, డిసెంబర్ 2011, ఆదివారం
క్రిస్‌మస్ శుభాకాంక్షలు..
15, నవంబర్ 2011, మంగళవారం
పెట్రో ధరలు తగ్గింపు.......!
ఇటీవల పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తగ్గిన పెట్రోల్ ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమలు లోకి రానున్నాయి. లీటరుకు రూ. 2.25లు తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణంగా తెలియవచ్చింది.
కాగా వారం రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. పెట్రో పెంపుపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ధరల తగ్గింపు కేవలం పార్లమెంట్ సమావేశాలు, యు.పి. ఏన్నికల ప్రచార కోసం మాత్రమే. గతంలో ఎన్నొ సార్లు అంతర్జాతీయంగా పెట్రో ఉత్త్పతులు తగ్గిన, ధరలు మాత్రము తగ్గలేదు. వారం రోజుల క్రితం దేశ ప్రధాని పెరిగిన ధరలు తగ్గించేది లేదని స్ఫష్టం చేసిన విషయం తెలిసిందే.
( ఆంధ్రజ్యోతి పత్రిక సౌజన్యం తో... )

10, నవంబర్ 2011, గురువారం
ఇది కుటుంబమా............... !
25, అక్టోబర్ 2011, మంగళవారం
జీవితాలలో క్రొత్త క్రాంతులని నింపాలని ఆశిస్తూ...
18, అక్టోబర్ 2011, మంగళవారం
55ఏళ్ల వ్యక్తితో 16ఏళ్ల యువతి పెళ్లి ....?
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని బివైనగర్‌కు చెందిన నడిమెట్ల శంకర్, రేఖ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురు (16), రజిని(8), రాణి(7) ఉన్నారు. శంకర్ ఓ దాబాలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. తన పెద్ద కూతురికి పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డాడు. తనకు కట్నం ఇచ్చే స్థోమత లేదని, కట్నం లేకుండా పెళ్లి చేసుకునే వారు ఎవరైనా ముందుకు వస్తే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని బంధువులకు తెలిపాడు.
హైదరాబాద్‌లోని పార్సిగుట్టకు చెందిన వడకొండ్ల యాదగిరి(55) ఆర్‌టిసిలో పార్ట్‌టైం స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు 26సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. ఇతనికి ఒక కుమారుడు (23), కూతురు (18) ఉన్నారు. యాదగిరిని వీరు 18సంవత్సరాల క్రితమే వదిలి వెళ్లారు. ఒంటరిగా జీవిస్తున్న యాదగిరి అమ్మాయి పేరు మీద 50వేల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి పెళ్లి చేసుకుంటానని ముందుకు రావడంతో పేద కుటుంబానికి చెందిన ఈ తల్లిదండ్రులు తలొగ్గారు. సోమవారం పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు మహిళా సంఘాల వారు పెళ్లిని అడ్డుకుని, ఇంటి ముందు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వరుడు యాదగిరి, అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ చేసి వదిలిపెట్టారు.
పేదరికం కారణంగానే తల్లిదండ్రులు ఈ పెళ్ళికి ఒప్పుకున్నారని సమాచారం.
పేదరికం కారణంగానే తల్లిదండ్రులు ఈ పెళ్ళికి ఒప్పుకున్నారని సమాచారం.
సామాన్య పేదల జీవనపరిస్థితులు ఏంత దీనంగా వుంటాయి అన్నది ఈలాంటి సంఘటనల సందర్భంగా స్ఫష్టంగా కనబడుతుంది. నేడు చాల మంది పేదలు తిండి తినాలాన్న, బ్రతుకు సాగించాలన్న చాలా దుర్భరంగా, కష్టంగా వుంది.
ప్రజాశక్తి సౌజన్యంతో.. 27, సెప్టెంబర్ 2011, మంగళవారం
ఆ పేరు వింటేనే హృదయాలు ఉత్తేజితమవుతాయి...
భగత్‌సింగ్ పేరు వినిపిస్తేనే భారతీయులందరికి హృదయాలు ఉత్తేజితమవుతాయి.
దేశంకోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలిన విప్లవవీరుడు భగత్‌సింగ్. ఆయన గురించి మాట్లాడుకుంటే తెలియకుండానే మనస్సు ఉద్వేగానికి లోనవుతుంది. భగత్‌సింగ్ ఒక విప్లవ స్ఫూర్తి, రగులుతున్న కాగడాల నుండి ఎగిసిపడే చైతన్యపు జ్వాల. ఆయన 1907 సెప్టెంబర్ 27 పంజాబ్‌లోని లాయల్‌పూర్ జిల్లా బంగా గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు విద్యావతి, కిషన్‌సింగ్.
తన చిన్ననాడే జరిగిన జలియన్‌వాలాబాగ్ దురంతం ఆయనను కలిచివేసింది. దానికి కారణమైన బ్రిటీష్ సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం నుండి తరిమికొట్టాలంటే విప్లవకారులందరు ఎవరికి వారు పని చేయడం కాదు అందరూ ఏకమై ఐక్యంగా పనిచేసినపుడే సాధ్యమని విప్లవకారులందరినీ ఏకంచేశారు.భారతీయుల కనీస హక్కులు కాలరాసే చట్టాలను నిరసిస్తూ పార్లమెంట్‌లో పొగబాంబు వేశారు.పార్లమెంట్‌లో పొగబాంబు వేస్తే ఖచ్చితంగా ఉరి తీస్తారని తెలిసి కూడా పారిపోని ధీశాలి. మన స్వాతంత్య్రం కేవలం తెల్లదొరలు పోయి నల్లదొరల పెత్తనం చేసేదిగా ఉండకూడదని, కూడు, గుడ్డ, విద్యా, వైద్యం, ఉపాధి అందరికి కల్పించే ''సమసమాజం'' కావాలని భగత్‌సింగ్ ఆకాంక్షించారు.
నేటి విద్యార్ధి, యువత భగత్‌సింగ్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్దులవటమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.
ఇంక్విలాబ్ జిందాబాద్.
నేడు భగత్‌సింగ్ 105 వ జయంతి

లేబుళ్లు:
మహా నేతల జన్మదినాలు... వర్ధంతులు...
18, సెప్టెంబర్ 2011, ఆదివారం
అరుణాక్షరాలతో లిఖించబడిన గొప్ప రోజు...
ప్రపంచ ప్రజల పోరాటాల చరిత్రలోనే అరుణాక్షరాలతో లిఖించబడిన గొప్ప రోజు...
సెప్టెంబరు 17న తెలంగాణా పోరాట వారసత్వాన్ని సంస్మరించుకొంటున్న రోజు...
నిజాం రాజు తరతరాల పరమ పైశాచిక పాలనకు, వెట్టిచాకిరీకి, దొరల చెరలకు మట్టిమనుషులు లిఖించిన మరణ శాసనం వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాం. పది లక్షల ఎకరాల భూమి పంపిణీ, 3000 గ్రామాలలో పంచాయితీ ప్రజారాజ్య స్థాపన ..... ఆ పోరాట విజయాలు. 1946 జులై 4న దొడ్డి కొమరయ్య వీర మరణం దానికి నాందీ వాచకం. వామపక్షాలు సెప్టెంబరు 17న తెలంగాణా పోరాట వారసత్వాన్ని సంస్మరించుకొంటున్నాయి.

వీరోచిత తెలంగాణ పోరాటంలో లక్షలాది ప్రజలు పోరా టంలో పాల్గొన్నారు. నాలుగువేల మంది అమ రులయ్యారు. వారి త్యాగాలు వృధా కాలేదు. దాని ప్రాధాన్యత, ఉత్తేజం వెలుగొందుతూనే వుంటాయి. ఆ మహత్తర పోరాటం నిజాం నిరంకుశత్వాన్ని అంతం చేయటానికి సాగింది. ఆ పోరాటం మొత్తం కమ్యూ నిస్టు పార్టీ ప్రతిష్టనే పెంచింది. తెలుగు ప్రజలలో విప్లవ సాంప్రదాయాలను ఆ పోరాటం నెలకొల్పింది. పీడనకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే శక్తులకు అది స్ఫూర్తి దాయకం. భారతదేశ ప్రజాస్వామిక విప్లవపథంలో తెలంగాణ పోరాటం ఒక ఉజ్జ్వల ఘట్టం.
వీర తెలంగాణా సాయుధ పోరాటం ద్వారా భూస్వామ్య వ్యవస్థను కుప్పకూలిస్తే నేటి పాలకులు అవలంబిస్తున్న విధానాల వల్ల నయా భూస్వాములు తయారవుతున్నారు. కార్పొరేట్ సంస్కృతి, రాజకీయ వ్యాపారీకరణ అనే ఈ రెండు శక్తులే ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్నాయి . ఫలితంగా దేశంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోతున్నది . ఈ అంశాలన్నింటికీ వ్యతిరేకంగా భవిష్యత్తులో జరిపే పోరాటాలకు తెలంగాణ సాయుధ పోరాటం ఒక పునాదిగా ఉంటుందని బావిద్దాం.

17, సెప్టెంబర్ 2011, శనివారం
సందిగ్ధంలో పరీక్షలు...
త్రైమాసిక పరీక్షలు ఉన్నయా లేవా ....
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19 నుంచి 26 వరకూ నిర్వహించబోయే త్రైమాసిక పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో త్రైమాసిక పరీక్షలు జరుగుతాయా? లేదా అన్న విషయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సకల జనుల సమ్మె ఒకవైపు, ఉపాధ్యాయుల నిరవధిక సమ్మె మరోవైపు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావడం లేదు. పరీక్షల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని భరోసా ఇవ్వడం లేదు. స్పష్టమైన ఆదేశాలను కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే విద్యార్థులు, తల్లిదండ్రుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోంది. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చకుండా విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు విద్యాశాఖ అధికారులనూ డైలమాలో పడేసింది.
ఇంతకుముందే ఈనెల 27 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకూ దసరా సెలువులూ ప్రకటించింది.
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలను ఇవ్వలి.
15, సెప్టెంబర్ 2011, గురువారం
అగ్రరాజంలో 4.6 కోట్ల మంది పేదలే...
ప్రపంచంలోని అన్ని దేశాల యువత కలల దేశం అమెరికా. అన్నింటికీ అవకాశాల గడ్డ. కానీ, ఇదంతా పైపైన చక్కెరపూత మాత్రమే. అమెరికాలోనూ పేదలున్నారు. అక్కడొకరు ఇక్కడొకరు కాదు.. అక్షరాలా నాలుగున్నర కోట్ల మంది తిండికి ముఖం వాచిపోతున్నారు. 'ఇన్‌కం, పావర్టీ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్: 2010' పేరిట అమెరికా సెన్సస్ బ్యూరో విడుదల చేసిన నివేదిక తేల్చిచెబుతున్న విషయమిది. దీని కన్నా 'పెద్దన్న'కు బాగా ఆందోళన కలిగించే అంశమేమిటంటే మూడేళ్లుగా పేదల సంఖ్య ఏటికేడాదీ పెరుగుతూ ఉండటం.
అమెరికా సర్కారు లెక్కల ప్ర కారం.. నలుగురు జీవించటానికి ఏడాదికి 22,314 డాలర్ల ( సుమారు రూ.10 లక్షలు) కన్నా తక్కువ సంపాదన ఉన్నా.. లేదా ఒక వ్యక్తి ఆదా యం ఏడాదికి 11,139 డాలర్ల (దాదాపు రూ.5 లక్షలు)కు తగ్గినా దారిద్య్ర రేఖ దిగువన ఉన్నట్టే. అమెరికాలో పేదల సంఖ్య పెరగడానికి రెండు ప్రధానమైన కారణాలున్నాయని నిపుణులు పే ర్కొంటున్నారు. 1 నిరుద్యోగం పెరగటం. 2 ప్రజల ఆదాయం తగ్గ టం.

28, ఆగస్టు 2011, ఆదివారం
ఇది ప్రజా విజయం...అన్నా దీక్ష విరమణ...
అన్నా దీక్ష విరమణ...
ఇది ప్రజా విజయం... అహింసా ఉద్యమ స్ఫూర్తి కొనసాగిద్దాం - అన్నా హజారే
పండుగ వాతావరణం నెలకొన్న రాంలీలా మైదానంలో, ఆనంద ఉత్సాహాలతో పరుగులు తీస్తూ వచ్చిన వేలాది ప్రజాస్వామిక ప్రేమికుల సమక్షంలో అన్నా హజారే ఆదివారం ఉదయం 12 రోజుల దీక్ష విరమించారు. ఐదేళ్ల చిన్నారులు సిమ్రన్, ఇక్రా కొబ్బరినీళ్లు ఇవ్వడంతో అన్నా దీక్ష విరమించారు. అనంతరం అహింసా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దామని అన్నా ప్రజలకు పిలుపునిచ్చారు.

పౌర సమాజం చేసిన డిమాండ్లలను ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదించడం ప్రజా ఘన విజయమని అన్నా వ్యాఖ్యానించారు. దీక్ష విరమించిన అనంతరం ఆయన అశేష జన సందోహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారత్ త్వరలోనే అవినీతి రహిత దేశంగా మారగలదని ఉత్సాహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సాధించినది సగం విజయమేనంటూ దేశ ఎన్నికల నిర్వహణ వ్యవస్థలోనూ, విద్యారంగ వ్యవస్థలోనూ ఎన్నో సంస్కరణలు రావల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. అన్నా ఉద్యమం ఇంతటితో ఆగిపోయేది కాదంటూ అవినీతిపరులైన ప్రజా ప్రతినిధులను చట్ట సభలనుంచి వెనుకకు తీసుకురావాలని అన్నారు. విద్యా రంగం ధనార్జనకు వేదికగా మారిపోయిందని అందువల్ల విద్యా వవస్థలో ఎన్నో సంస్కరణలు రావాల్సి ఉందని అన్నా పిలుపునిచ్చారు.
దీక్ష విరమించిన అనంతరం అన్నాను చికిత్స కోసం తిన్నగా మేధాంత మెడిసిటీకి తీసుకువెళ్లారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సంబరాలు చేసుకుందాం రమ్మని ప్రజలకు కేజ్రీ వాల్ పిలుపునిచ్చారు.
( ఆంధ్రజ్యోతి ,ఈనాడు పత్రిక సౌజన్యం తో... )
27, ఆగస్టు 2011, శనివారం
నేను గీసిన చిత్రం...
26, ఆగస్టు 2011, శుక్రవారం
మనిషి రూపంలోని దైవస్వరూపం...
మనిషి రూపంలోని దైవస్వరూపం
-మదర్ థెరిస్సా
ప్రేమ, కరుణ, జాలికి ప్రతిరూపం మదర్ థెరెస్సా. ఆమె నిరుపేదలను, గూడులేని అభాగ్యులను, అనాథలను, వికలాంగులను, వ్యాధిగ్రస్తులను, దిక్కులేని అనాథలను అక్కున చేర్చుకుంది. వారికి ఆశ్రయం కల్పించి, వారు తలదాచుకోవడానికో గూడును ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక అనాధాశ్రమాలను స్థాపించిన మదర్, ఎక్కువగా కలకత్తాలోని మురికివాడలలో పేదల కోసం పని చేసింది. తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేసిన మదర్ థెరెస్సా... ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు, కరుణకు, ఆత్మస్థైర్యానికి, నమ్మకానికి పర్యాయపదంగా నిలిచిపోయింది.
ఒంటరిగానే ఆశయసిద్ధి కోసం ప్రయత్నం ప్రారంభించి, వేలాదిమందిని తనతో కలుపుకుని, తన మార్గంలో నడిచేలా చేసింది ఆ మహనీయురాలు. మదర్ థెరెసా మొదటి పేరు ఆగెస్ గోన్‌జా బోజాషు. అందరు ప్రేమగా పిలుచుకునే 'మదర్ థెరిసా'!
ఒంటరిగానే ఆశయసిద్ధి కోసం ప్రయత్నం ప్రారంభించి, వేలాదిమందిని తనతో కలుపుకుని, తన మార్గంలో నడిచేలా చేసింది ఆ మహనీయురాలు. మదర్ థెరెసా మొదటి పేరు ఆగెస్ గోన్‌జా బోజాషు. అందరు ప్రేమగా పిలుచుకునే 'మదర్ థెరిసా'!
లేబుళ్లు:
మహా నేతల జన్మదినాలు... వర్ధంతులు...
24, ఆగస్టు 2011, బుధవారం
కరెంటు బల్బులతో ఇంటర్నెట్....
20, ఆగస్టు 2011, శనివారం
వర్షం వస్తే హైదరాబాదు ఇంతేనా ....
హైదరాబాదులో భారీ వర్షం కురిసితే పరిస్తితి ఇంతేనా.... ఇంకా బాగుపడదా... ఇంకా ఎంతా కాలం... ప్రజలు నరకం అనుభవించల్సిదేనా... విముక్తి లేదా...
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాదులోని రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. చాలా చోట్ల మోకాళ్ల లోతు నీరు చేరుకుంది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కిలొమీటర్ల కొద్ది వాహనాలు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించింది. బస్టాప్ ప్రాంతంలో రోడ్డు పై నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని ప్రాంతాలలో నీరు ఎక్కవ మొత్తంలో రోడ్లపై నిలవడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు వర్షపు నీటిలో మునిగి ముందుకు సాగకుండా మెరాయించాయి. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. కొన్ని రోడ్ల పై గంటల సేపు నీరు ఎక్కువ మొత్తంలో నిలిచింది. దానితో రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. అనేక ప్రాంతాలలో భారీ వర్షానికి పలు ఇళ్ళల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాష్ట్రంలోని తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల వరకు భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

19, ఆగస్టు 2011, శుక్రవారం
ప్రపంచ ఫోటోగ్రఫీ దీనోత్సవ శుభాకాంక్షలు...
17, ఆగస్టు 2011, బుధవారం
అన్నాకు మద్దతుగా భారత్ భగ్గుమన్నది...
అన్నా హజారే అరెస్టుతో మంగళవారం భగ్గుమన్న భారతావని ఈరోజు కూడా నిరసనలకు దిగింది . దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగిన్నాయి. బుధవారం సాయంత్రం ఇండియా గేట్ నుంచి పార్లమెంటు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. తాను దీక్ష చేయడానికి బేషరతుగా అనుమతి ఇస్తేనేగానీ జైలు నుంచి కదలనని తేల్చి చెప్పిన హజారే తన పట్టు వీడడం లేదు. హజారే ఇంకా తీహార్ జైలులోనే ఉన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్‌పాల్ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న అన్నా హజారే, ఆయన అనుచరులను అరెస్టు చేయడాన్ని అందరు ఖండించాలి. అవినీతిపై విపక్షాలు, వివిధ సంస్థలు చేస్తున్న ఆందోళనలపై కేంద్రం దాడి చేయడంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరేమిటో స్పష్టమవుతోంది . ఇప్పటికైనా ప్రతిపక్షాల, ప్రజల విజ్ఞప్తుల మేరకు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన జన్ లోక్‌పాల్ బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.

8, ఆగస్టు 2011, సోమవారం
తెలంగాణను తొందరగా తేల్చండి...
29, జులై 2011, శుక్రవారం
అమెరికాలో మరో బూటకపు యూనివర్శిటీ...!
వాషింగ్టన్ నగర శివార్లలో వున్న ఒక బూటకపు యూనివర్శిటీపై అమెరికా అధికారులు గురువారం దాడి చేశారు. ఈ యూనివర్శిటీ విద్యార్ధుల్లో 90 శాతం మంది భారత్‌కు చెందిన వారే కావటం విశేషం. కాగా అందులో అధిక సంఖ్యాకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని తెలుస్తోంది.
వాషింగ్టన్ నగర శివార్లలో వర్జీనియా రాష్ట్రంలోని అన్నాడేల్‌లో వున్న ఈ యూనివర్శిటీలో దాదాపు 2,400 మంది విద్యార్ధులున్నారు. అయితే ఈ దాడిపై స్పందించేందుకు నిరాకరించిన యూనివర్శిటీ పాలక వర్గం తమ విద్యార్ధులు ఇతర యూనివర్శిటీలకు బదిలీ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రవేశద్వారం ముందు ఒక నోటీసు అంటించింది. తాము తాత్కాలికంగా విదేశీ విద్యార్ధులెరినీ చేర్చుకోవటం లేదంటూ మరో నోటీసును అంటించింది. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధికారులు కేలిఫోర్నియాలోని ట్రైవ్యాలీ యూనివర్శిటీపై దాడులు చేసి దానిని మూసివేయించిన విషయం తెలిసిందే. ఇమిగ్రేషన్ అవకతవకలకు పాల్పడిందంటూ ఈ యూనివర్శిటీని మూసివేసిన ఫలితంగా దాదాపు వెయ్యికి పైగా భారత విద్యార్ధుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది. ఈ వరుసలో ఇది రెండో యూనివర్శిటీ కావటం విశేషం. ట్రైవాలీ యూనివర్శిటీలో భారత విద్యార్ధులను అమెరికా అధికారులు పరిగణించిన తీరును దృష్టిలో వుంచుకున్న భారత ప్రభుత్వం ఈసారి విద్యార్ధులకు ఎటువంటి వెసులుబాటూ కల్పించని ఫెడరల్ అధికారుల వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అయితే విద్యార్ధులను అరెస్ట్ చేయటం లేదా నిర్బంధించటం లేదా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ పరికరాలను ఏర్పాటు చేయటం వంటి చర్యలేవీ తీసుకోబోమని అమెరికా అధికారులు ఇక్కడి రాయబార కార్యాలయానికి హామీ ఇచ్చారు. విద్యార్ధులను ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చూసేందుకు ఇక్కడి భారత రాయబార కార్యాలయం అమెరికా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

( ప్రజాశక్తి ,ఈనాడు పత్రిక సౌజన్యం తో... )
22, జులై 2011, శుక్రవారం
మన హైదరాబాదిలకి ఖేల్ రత్న, అర్జున్ అవార్డులు ...
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు గగన్ నారంగ్‌కు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాజీవ్ ఖేల్‌రత్న అవార్డును ప్రకటించింది. బీజింగ్ ఒలంపిక్స్ లో మన దేశం తరుపున స్వర్ణం సాధించినారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో గగన్ నాలుగు స్వర్ణాలు సాధించినారు. దేశ క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. అలాగే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు అర్జున్ అవార్డుకు ఎంపికయ్యారు.
అర్జున్ అవార్డుకు ఎంపికైనవారు : జహీర్ ఖాన్ (క్రికెట్), రాహుల్ బెనర్జీ (విలువిద్య), ప్రీజా శ్రీధరన్ (అథ్లెటిక్స్), జ్వాలా గుత్తా (బ్యాడ్‌మింటన్), సురంజయ్ సింగ్ (బాక్సింగ్), సునీల్ శెట్టి (ఫుట్‌బాల్), రాజ్‌పాల్ సింగ్ ( హాకీ), రాకేష్ కుమార్ (కబాడీ), తేజశ్వనీ సావంత్ (షూటింగ్), విర్ధవల్ ఖాడే ( స్విమ్మింగ్), ఆసిష్ కుమార్ (జిమ్నాస్టిక్స్), సోమ్‌దేవ్ (టెన్నీస్), రవీందర్ సింగ్ (కుస్తీ), వికాస్ గౌడ (అథ్లెటిక్స్), సంధ్యారాణి ( ఉషు), ప్రశాంత కర్మాకర్ (స్విమ్మింగ్), సంజయ్ కుమార్ (వాలీబాల్), తేజశ్వనీ (కబాడీ) తదితరులు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.
( పత్రికలు , గూగ్ల్స్ సహకారంతో ...)
21, జులై 2011, గురువారం
వేలెత్తి చూపకుండా వేలు పట్టుకుని నడిపించండి....
పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు వేలెత్తి చూపకుండా వారిని వేలు పట్టుకుని నడిపించటం ద్వారా సరైన దిశానిర్దేశం చేయాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ సూచిం చారు. పిల్లలు వివిధ అంశాల్లో రాణించినప్పుడు మెచ్చుకోవటం, మంచి పనులు చేసినప్పుడు వారిని ప్రశంసించటం ద్వారా వారి భవిష్యత్తుకు పునాది వేయాలని కోరారు. ఎదుగుతున్న పిల్లల శారీరక, మానసిక సమస్యల్ని అర్థం చేసుకోవటం, పరిష్కార మార్గాల్ని చూపటం ద్వారా వారిలోని మానసిక ఒత్తిడిని దూరం చేయాలన్నారు. 'పిల్లల భవిష్యత్తు- తల్లిదండ్రుల బాధ్యత' అనే అంశంపై హైదరా బాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం శాసనమండలి సభ్యులు చుక్కా రామయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో బివి పట్టాభిరామ్ ప్రధాన వక్తగా ప్రసంగిస్తూ గతంలో సైకియాట్రిస్టుల వద్దకు ప్రేమలో వైఫల్యాలు, భార్యాభర్తల విడాకుల కేసులు, వరకట్న వేధింపుల్లాంటి కేసులు ఎక్కువగా వచ్చేవని, అయితే ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య బాగా తగ్గిందని చెప్పారు. ఇదే సమయంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య మనస్పర్థలు పెరగటం, వారి మధ్య సంబం ధాలు దెబ్బతిని అగాధం పెరిగిపోవటంలాంటి కేసులు 70 శాతం వరకూ వస్తున్నాయని చెప్పారు. అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ పిల్లల్ని సహజంగా పెరగనీయకపోవటం వల్ల వారిలో సున్నితత్వం దెబ్బ తింటోందని పట్టాభిరామ్ ఆందోళన వ్యక్తం చేశారు.
19, జులై 2011, మంగళవారం
పేదల నెత్తిన పిడుగు...ఆధార్?
పౌరులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇచ్చే ఆధార్ కార్డులు కేంద్రం, ప్రణాళికా సంఘం చేపడుతున్న చర్యలు భవిష్యత్తులో పేదలను నిరాధారులుగా మార్చనున్నాయి. సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలన్న నిర్ణయం వెనుక సబ్సిడీలను కుదించే కుట్ర దాగుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జారీ చేస్తున్న ఆధార్ కార్డు ప్రజలకు ముఖ్యంగా పేదలకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగ పడుతుందని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ అధినేత నందన్ నిలేకని చెపుతున్నారు. సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్ అన్నట్లు ప్రభుత్వ పథకాల్లో లీకేజీలు, అవినీతి, అక్రమాల నిరోధం అన్నింటికీ ఆధార్ కార్డే ఏకైక అస్త్రమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. నిలేకని చెప్పినట్లు పేదలకు ఆధార్ కార్డులు ఉపయోగ పడతాయన్న గ్యారంటీ అయితే లేదు. కాని వారికి అందుతున్న సబ్సిడీలను కోయడానికి సర్కార్‌కు ఆధార్ కార్డు కత్తెరలా పనికొస్తుంది. బ్యాంక్ అక్కౌంట్, రేషన్ పొందడానికి సైతం గుర్తింపు పత్రాల్లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు, వారి సమస్యలను తీర్చడానికే ఆధార్ కార్డులిస్తున్నాం అని గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ప్రధాని మన్మోహన్ వక్కాణించారు. ప్రభుత్వ పథకాలను అనర్హులు అనుభవిస్తున్నారని, సబ్సిడీలను అర్హులకు చేర్చడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. సబ్సిడీలు అర్హులకు అందాలన్న విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండదు. అనర్హులను ఏరివేసే పేరుతో అర్హులను పథకాలకు దూరం చేస్తేనే సమస్య. నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్న మన్మోహన్ సర్కార్ ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలకు ఏ విధంగా కోత పెట్టాలా అన్న రంధిలో ఉంది. నగదు బదిలీ వంటి వాటిని తెరమీదికి తెచ్చింది. ఎప్పుడు ఏ మార్గంలో సబ్సిడీలకు కోత పెడుతుందో తెలీక ప్రజలు ఆందోళన చెందుతున్నరు. వారి నెత్తిన పడటానికి ఆధార్ పిడుగు సిద్ధంగా ఉంది.
15, జులై 2011, శుక్రవారం
నింగిలోకి దోసుకెళ్లినా పీఎస్‌ఎల్‌వీ సీ-17
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌దావన్ అంతరిక్ష ప్రయోగం షార్ నుంచి ఈరోజు సాయంత్రం పీఎస్‌ఎల్‌వీ-సీ17 రాకెట్‌ను ప్రయోగించారు. 1410 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహం జీ శాట్ -12 ఈది నింగిలొకి మొసుకెల్లింది. విజయవంతగా జీ శాట్ -12 కక్ష్యలోకి ప్రవేశించడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు.
ఈ రాకెట్ 295 టన్నుల బరువు, 44 మీటర్ల ఎత్తు ఉంటుంది. నాలుగు దశల్లో ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దోసుకెళ్లింది. భూమికి 26వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర మధ్యంతర కక్ష్యలోకి అంతరిక్షంలోకి దూసుకెళుతుంది. గ్రామీణ సమాచార వ్యవస్థ మరింత పటిష్టతను చేసే జీశాట్-12 ఉపగ్రహం నింగిలోకి మోసుకెళ్లింది. 200 కోట్ల రూపాయల వ్యయంతో జీ-12ను రూపొందించారు. జీశాట్-12 ఎనిమిదేళ్లపాటు సేవలు అందించనుంది. ఇది చారిత్రాక విజయం అని ఇస్రోవర్గాలు అంటున్నాయి. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 19వ ప్రయోగం. భారత జాతికే ఈ ప్రయోగం గర్వకారణమని శాస్తవేత్తలు అన్నారు. ఈది పూర్తిగా స్వదేసి పరిజఞనంతో రూపొందించారు.
9, జులై 2011, శనివారం
నేటి యువతను అలోచింపచేశారు....
7, జులై 2011, గురువారం
నాడు చెలమని...నేడు చెల్లని కాని....
1, జులై 2011, శుక్రవారం
హై స్పీడ్ తో దుసుకుపొతున్న చైనా...
గత కొన్ని సంవత్సరాల కాలంలో చైనాలో సోషలిస్టు ఆధునికీకరణ కొనసాగుతున్నది. ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచటం ద్వారా ఉత్పాదక శక్తుల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. బలమైన చైనా నేడు అవతరించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం అన్ని దేశాలను ఆవహించింది. చైనా దానిని తట్టు కున్నది. చైనా కమ్యూనిస్టుపార్టీ ఒక పరిపక్వత చెందిన మార్క్సిస్టు పాలకపార్టీగా నేడు నిలబడింది.
90 సంవత్సరాలుగా పార్టీ ప్రజలతో మమేకమై చేసిన కృషి సత్ఫ లితాలనిచ్చింది. అత్యధిక ప్రజల ప్రయోజనాలను కాపాడింది. పార్టీ సరైన పంథాని రూపొందించుకుని, సూత్రా లకు కట్టుబడి ప్రజలతో కలిసి వుంటే మరిన్ని ఐన సవాళ్ళను ఎదుర్కోగలదు.
29, జూన్ 2011, బుధవారం
ఇకపై చేతులు ఊపుకుంటూ మార్కెట్‌కు వెళ్లడం కుదరదు....
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుడా ఇకపై చేతులు ఊపుకుంటూ మార్కెట్‌కు వెళ్లడం కుదరదు. పాల ప్యా కెట్ కోసమో, వంట సరుకుల కోసమో కిరాణా దుకాణాలకు బయలుదేరడం ఇకముందు సాధ్యం కాకపోవచ్చు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం అమల్లోకి రానుండటమే దీనికి కారణం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీహెచ్ఎంసీ..ప్లాస్టిక్ సంచుల వాడకంపై పాక్షిక నిషేధం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి మనం మద్దతు పలుకుద్దాం.
40 మైక్రాన్ కన్నా తక్కువ మందం ఉండే సంచులపై వేటుకు పరిమితమయింది. జూలై 1 నుంచి గట్టిగా నిషేధం అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతోంది. ఈ వివరాలను కార్పొరేషన్ కమిషనర్ కృష్ణబాబు మీడియాకు వెల్లడించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులతో పాటు ప్లాస్టిక్‌కప్పులు, కవర్లను నిషేధిస్తున్నట్టు తెలిపారు. పూర్తి నిషేధం అంశంపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్నారు. పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖతో పాటు న్యాయనిపుణులతో చర్చించి.. 40 మైక్రాన్లలోపు పరిమితిని విధించామన్నారు. బవిష్యత్ లొ ఐన పూర్తి నిషేధం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాం ,జీహెచ్ఎంసీ చర్యలు తిసుకొవాలి
మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. వాతావరణ సమతుల్యం కోల్పోయి ఓజోన్‌పొర దెబ్బతినడం వల్ల పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో క్యాన్సర్, చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రతి ఒక్కరూ విధిగా ఇంటి ఆవరణలో చెట్లను నాటాలి, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలి, వాహన కాలుష్యం తగ్గించాలి. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం మనందరి మీద ఉంది.
ఒకరికి ఒకరు తోడైతే మన పర్యావరణాన్ని ఈ కాలుష్య భూతానికి బలికాకుండా కాపాడగలుగుతాం. మన కాలనీలలో, మనం వుండే గృహ సముదాయాలలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులతో పాటు ప్లాస్టిక్‌కప్పులు, కవర్లను నిషేద్దన్ని అమలు పై అవగాహన కల్పించి ఈ సత్కార్యానికి చేయూతనిస్తే మన భూమిని మరుభూమి కాకుండా చూడగలుగుతాం.
అందుకే రండి.. ఆ ఆనందం లో మనమూ పాలుపంచుకొని, మనవంతు పని మనం చేసి మన తరువాతి తరాలకు పచ్చని పర్యావరణాన్ని శోభాయమానంగా అందిద్దాం..!
( పత్రికల సహకారంతో ...)

18, జూన్ 2011, శనివారం
నువ్వు నేను స్నేహం...
16, జూన్ 2011, గురువారం
మొబైల్ తో బ్రెయిన్ ట్యూమర్ ... !
ఇంట్లో టీవీ, చేతిలో మొబైల్ ! ఎక్కడ చూసినా ఇదే దృశ్యం ! కనబడుతుంది.
'టీవీ' ప్రేక్షకులకు, సెల్లు ప్రియులకు శాస్త్రవేత్తలు మరో హెచ్చరిక చేశారు. టీవీ అతిగా చూస్తే త్వరగా మరణిస్తారని ఒకరు పేర్కొనగా... మొబైల్ ఎక్కువగా వాడితే తమ సహజప్రవర్తన మరచిపోయి మూర్ఖులుగా మారే ప్రమాదముందని మరో అధ్యయనంలో తేలింది. రోజుకు 2 గంటలు టీవీ చూసేవారికి టైప్ 2 ధుమేహం, గుండెజబ్బులు వస్తాయని హార్వ ర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (హెచ్ఎస్‌పీహెచ్) కు చెందిన నిపుణులు తెలిపారు. రోజుకు మూడుగంటలపాటు చూస్తే... 'ముందస్తు మరణం' తథ్యమన్నారు. శారీరక శ్రమను ప్రోత్సహించడంతోపాటు... టీవీ చూడటంలాంటి 'నిశ్చేష్ట' పనులను త్యజించాలని సూచించారు.

ఇక సెల్‌ఫోన్ల వాడకంవల్ల నానారకాల సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి. మొబైల్‌ను అతిగా ఉపయోగించడంవల్ల మన ధోరణిలోనూ మార్పు వస్తుంద ని ఆస్ట్రేలియాకు చెందిన టెల్‌స్ట్రా సంస్థ జరిపిన ఆన్‌లైన్ సర్వేలో తేలింది. కొందరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వారి ప్రవర్తన, ధోరణిల్లో మార్పు కన్పిస్తుందని, కొందరు మూర్ఖంగా తయారవుతారని ఇందులో స్పష్టమైంది.
15, జూన్ 2011, బుధవారం
నిండు పున్నమి... పండువెన్నెల... అంతలోనే మహాద్భుతం.
నిండు పున్నమి... పండువెన్నెల... అంతలోనే మహాద్భుతం. వెన్నెల మటుమాయం అవుతుంది. ఆకాశమంతటా గాఢాంధకారం అలముకుంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణం చేసే తమాషా ఇది. ఆకాశంలో అద్భుతాలను ఆసక్తిగా తిలకించే ఖగోళప్రియులకు నేడే ( బుధవారం) పండగే. ఈ శతాబ్దిలోనే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఖగోళప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతటి అరుదైన, సుదీర్ఘ సమయం ఉండే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మళ్లీ చూడాలంటే 130 ఏళ్లు ఆగాల్సిందే!
చంద్రగ్రహణం పట్టినప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాకూడదన్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని బిర్లా సైన్స్ ఆడిటోరియం(హైదరాబాద్) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలాంటి అనుమానాలూ లేకుండా... చంద్ర గ్రహణాన్ని ప్రతిఒక్కరూ చూడొచ్చని అంటున్నారు.
భారత స్థానిక కాలమానం ప్రకారం జూన్ 15 రాత్రి 11:52:26 గంటలకు గ్రహణం మొదలవుతుంది. చంద్రుడు పూర్తిగా అదృశ్యమయ్యేది: అర్ధరాత్రి 12:52:30 నుంచి 02:32:42గంటల నడుమ చంద్రుడు భూమి నీడలో పూర్తిగా అదృశ్యమవుతాడు. జూన్ 16 తెల్లవారుజామున 02:32:42 గంటల నుంచి మళ్లీ పాక్షికంగా కనిపించడం మొదలై 03:32:15గంటలకు గ్రహణం ముగుస్తుంది. మనదేశం అంతటా కనిపిస్తుంది.
నాసా లెక్కల ప్రకారం 2011లో నాలుగు పాక్షిక సూర్య గ్రహణాలు, రెండు సంపూర్ణ చంద్రగ్రహణాలు సంభవిస్తున్నాయి. ఇలా జరగడం చాలా అరుదు. 21 శతాబ్దం మొత్తమ్మీదా ఈ ఏడాది కాకుండా మరో ఐదు సార్లు మాత్రమే ఇలా జరగనుంది. ఆ సంవత్సరాలు... 2029, 2047, 2065, 2076, 2094. ఇంతటి అరుదైన, సుదీర్ఘ సమయం ఉండే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మళ్లీ చూడాలంటే 130 ఏళ్లు ఆగాల్సిందే!
గ్రహణం నేపథ్యంలో... ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించేందుకు మన వంతు కృషి చేద్దాం.
( పత్రికల సహకారంతో ...)
వేసవిలో కూల్ కూల్ గా ఆహ్లాదకరంగా ఎంజయ్ ...
మేము మరియు ఈద్దరు స్నేహితుల కుటుంబ సభ్యులతో ఈ మధ్య (మే చివర ) వేసవి సెలవులలో కూల్ కూల్ గా ఆహ్లాదకరంగా ఎంజయ్ ... చేశాం. ఊటి , కొచిన్ , అలాప్పి, తిరువనంతపురం, కన్యాకుమారి , మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం ( మదురై ), రామేశ్వరము, కొడైకెనాల్, చెన్నై, కాంచీపురం లో పర్యటించాం. చెన్నై, కాంచీపురం ఎండల్లోనే పర్యటన కొంత ఇబ్బందికి గురి చేసినప్పటికీ మిగిత ప్రాంతాలు కూల్ కూల్ గా ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు, బీచ్చిలు ఆహ్లాదకరంగా అనిపించింది. పిల్లలకైనా, పెద్దలకైనా పర్యటనలు అనేవి వినోదం, ఆనందం కలిగించడంతోపాటు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. మేము 9 రోజులలొ 14 ప్రదేశాలను దాదాపు 4300 కీ.మీ. తిరిగినాము. ఖర్చు కుడా ఒకొకరికి రూ.4000 ఐంది. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతొ ఎక్కువ చూశాం.
విశేషాలేంటో చూద్దాము.
1.ఊటీ : తమిళనాడులో నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ది గాంచిన పర్యాటక కేంద్రం. నీలగిరి జిల్లాకు ప్రధాన పట్టణం. ఉదకమండలం అనేది దీని అధికారిక నామం. వాతావరణం చల్లగా ఉంటుంది . ఇది మంచి వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఈ పట్టణం సముద్ర మట్టం నుంచి 2,240 మీటర్ల ఎత్తులో ఉంది. దీని అద్భుత సౌదర్యం, ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు మొదలైన వాటికి చుస్తె ఏవరైన ముగ్ధులై పోతారు. ఈక్కడ నీరు త్రాగటానికి వేడి చేస్తారు. అంత కూల్ గా వుంది. చూడవలసిన ప్రదేశాలు : బొటానికల్ గార్డెన్స్ ( అద్భుత సౌదర్యం ), బోట్‌హౌస్, కాఫీ తోటలు
2. కోయంబత్తూరు : తమిళనాడు రాష్ట్రములోని రెండవ అతిపెద్ద నగరం. కోయంబత్తూరు జిల్లా యొక్క ముఖ్యస్థానమైన ఈ నగరం దక్షిణ భారత మాంచెస్టర్ గా పేరుగాంచినది. కోయంబత్తూరు నగరం, వస్త్ర పరిశ్రమలకు, ఇంజనీరింగు కర్మాగారాలకు, వాహన విడిభాగాల నిర్మాణకేంద్రాలకు, వైద్య సౌకర్యాలకు, విద్యాసంస్థలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆతిధ్యానికి మరియు ప్రత్యేకత కలిగిన కొంగు తమిళ మాండలికానికి ప్రసిద్ధి చెందినది.
కేరళ సరిహద్దులలో మేము ప్రవేసించగనే వర్షలు ప్రారంభం. రైలులొనే చల్లచల్లగా జల్లులు.

4. ఏర్నకులం పట్టణం లో కూల్ కూల్ గా సాయంకాలం వర్షం.
5 .అల్లాప్పి : బ్యక్ వాటర్ లో బోట్ లో 4 గంటలు ప్రయానం చేశాం. చాల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని , అనుభుతిని చూశాం. వాటర్ లో బోట్ స్టాపులు , గ్రామాలు వసుతునే వుంటాయి. ఎటూ చూసిన వాటర్.
6. అల్లాప్పి బీచ్చి : పిల్లలు మరి ఎక్కువ ఎంజయ్ చేశారు . స్నానాలు చేశాం , ఎంజయ్ చేశాం
లేబుళ్లు:
కొన్ని మా జ్ఞాపకాలు,
యాత్రలు..పర్యాటక ప్రదేశాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)