13, ఫిబ్రవరి 2019, బుధవారం

బస్తీ బీమార్...

ప్రపంచంలోనే మందుల ఉత్పత్తిలో భారత్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.ప్రపంచంలో అనేక దేశాలకు మందులను ఎగుమతి చేస్తున్నది. కానీ మనదేశంలో కోట్లాది మంది ప్రజలు రోగాల బారినపడి మందులు కొనలేక చనిపోతున్నారు... మరణాలలో జీవనశైలి వ్యాధుల బారిన పడి 63 శాతం , గుండెపోటు కారణంగా 27 శాతం మంది చనిపోతున్నారు...


1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

రాష్ట్రంలో పంచాయతీ పంచాయతీ ఎన్నికలు...2019

రాష్ట్రంలో పంచాయతీ పోరు ముగిసింది. గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగిరింది. మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పల్లె ప్రజలు అధికార పార్టీకే పట్టం కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 12,730 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. వివిధ కారణాలతో 47 పంచాయతీల్లో పోలింగ్‌ నిలిచిపోయింది. రిజర్వేషన్ల కారణంగా 24 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 23 పంచాయతీల్లో ఎన్నికలు కోర్టు కేసులతో వాయిదా పడ్డాయి.
           ఫలితంగా 12,683 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్య స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 8,264 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు విజయం సాధించారు. 2,688 చోట్ల కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలుపొందారు. ఇక భారతీయ జనతాపార్టీ 170, తెలుగుదేశం పార్టీ 77,  సీపీఎం 74, సీపీఐ 39 పంచాయతీలు కైవసం చేసుకోగా.. 1,371 పంచాయతీల్లో స్వతంత్రులు పాగా వేశారు.