19, సెప్టెంబర్ 2018, బుధవారం

హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరొ ఘటన...

మిర్యాలగూడ ‍ప్రణయ్‌ హత్య ఘటన మరవక ముందే, 
హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరొ ఘటన...
కులాంతర వివాహం చేసుకున్నారని నవదంపతులపై పట్టపగలే అమ్మాయి తండ్రి హత్యాయత్నం చేయడం నగరంలో కలకలం సృష్టించింది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్‌ ఈ నెల 12న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ రోజు (19.09.2018) కొత్త బట్టలు కొనిస్తానని అమ్మాయి తండ్రి ఫోన్‌ చేసి, ఇద్దరిని హోండా షో రూం దగ్గరకు రమ్మన్నాడు. ఆ తర్వాత ప్లాన్‌ ప్రకారం వెంట తెచ్చుకున్నకత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి పెళ్లిని జీర్ణించుకొని మాధవి తండ్రి మనోహర చారి కక్షతో వారిపై పట్టపగలే కత్తితో దాడి చేశాడు. సందీప్‌ పరిస్థితి పరవాలేదు కానీ.. అమ్మాయి పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఇక మిర్యాలగూడ ‍ప్రణయ్‌ హత్య ఘటన (14.09.2018) మరవక ముందే నగరం నడిబొడ్డున ఈ ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
మనిషిని మనిషిలా చూద్దాం...
కులం, మతం కన్నా మానవత్వం గొప్పదని చాటుదాం...


18, సెప్టెంబర్ 2018, మంగళవారం

17, సెప్టెంబర్ 2018, సోమవారం

కులం.. ప్రళయమై విరుచుకుపడినవేళ...

                     చూసినవాళ్లంతా ‘ఎంత ముచ్చటైన జంటో’నని అసూయపడితే.. ఆమె గర్వంగా ఫీలయింది! ‘మన మధ్య కులమే కదా అడ్డుగోడ? దాన్ని చెరిపేసి.. మీ తల్లిదండ్రులకు దగ్గరవుదాం’ అన్న భర్త మాటలకు ఎంతగానో మురిసిపోయింది. అతడితో అందమైన జీవితాన్ని ఊహించుకుంది. అతడిప్పుడు లేడు! ఏదో ఒకరోజు తాను చెరిపివేస్తానని అనుకున్న కులగీతే అతడికి మరణశాసనమైంది. ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చింది.
                       కులం.. ప్రళయమై విరుచుకుపడినవేళ ‘ప్రణయ’ం ఓడింది!! ప్రణయ్‌తో నూరేళ్ల జీవితాన్ని ఊహించుకున్న అమృతకు అతడి జ్ఞాపకాలే మిగిలాయి.

                    ‘‘కులమే మా ప్రేమకు అడ్డుపడింది. చివరికి ఆ కులమే నా ప్రణయ్‌ని చంపేసింది. కుల నిర్మూలన జరగాలని ప్రణయ్‌ అంటుండేవాడు. అందుకోసం నేను పోరాడతా! ప్రణయ్‌ ఆశయాన్ని నెరవేర్చుతా!! నేను పుట్టింటికి వెళ్లనే వెళ్లను. డాడీ, బాబాయిలకు శిక్ష పడేవరకు పోరాడుతాను’’. -అమృత వర్షిణి

16, సెప్టెంబర్ 2018, ఆదివారం

'' మట్టి గణేష్‌ల విగ్రహాల ఉచిత పంపిణి ''...

వినాయక చవితి రోజు (13.09.2018) సుందరయ్య పార్క్‌లో హైదరాబాద్‌ జిందాబాద్‌ మరియు వాకర్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ ఆధ్వర్యంలో '' మట్టి గణేష్‌ల విగ్రహాల ఉచిత పంపిణి '' కార్యక్రమాన్ని శ్రీమతి శైలాజ మోహన్‌ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ ప్రదాన కార్యదర్శి ఎం.ఎన్‌.రావు, మాజీ అధ్యక్షులు మూరళి కృష్ణ గారు, నాయకులు రమేష్‌, రత్నకర్‌రెడ్డి, మురళి, ఎం.ఎన్‌.యాదగిరి హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు కె. వీరయ్య, సహాయ కార్యదర్శి వి.విజరుకుమార్‌, నాగేశ్వర్‌, జెకె. శ్రీనివాస్‌, నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.
 
12, సెప్టెంబర్ 2018, బుధవారం

"మట్టి గణేష్ ల ఉచిత పంపిణి"

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో నేడు (12.09.2018) పాత నల్లకుంటలో జరిగిన '' మట్టి గణేష్‌ల విగ్రహాల ఉచిత పంపిణి '' కార్యక్రమంలో స్థానిక నాయకులు డా|| బాలరాజ్‌ గారు, ఆర్యభట్‌ హైస్కూల్‌ ప్రిన్సిపల్‌ శ్రీ చంద్రశేఖర్‌ గారు , సీనియర్‌ అడ్వకేట్‌ బాలకృష్ణరెడ్డి గారు, రామకృష్ణరావు గారు, సీనియర్‌ నాయకులు లక్ష్మయ్యగారు,అజయ్ కుమార్ రెడ్డి,ప్రసాద్, హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు కె. వీరయ్య, నాయకులు పి. శ్రీనివాస్‌, మోహన్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.


10, సెప్టెంబర్ 2018, సోమవారం

మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం... పర్యావరణాన్ని కాపాడదాం...

"మట్టి గణేష్ ల ఉచిత పంపిణి" హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో
మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం... పర్యావరణాన్ని కాపాడదాం...