25, డిసెంబర్ 2018, మంగళవారం

24, డిసెంబర్ 2018, సోమవారం

పార్కును కాపాడుదాం...పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
పార్కును కాపాడుదాం
బంజారాహిల్స్‌లోని కేబిఆర్‌ పార్క్‌ను పరిరక్షించాలని కోరుతూ పర్యావరణ ప్రేమికులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. సేవ్‌ కేబీఆర్‌, ప్లై ఓవర్‌ వద్దు - కేబీఆర్‌ ముద్దు...అని ప్లకార్డులతో పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాలుపంచుకున్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యతను మరిచిన ప్రభుత్వం, ప్రకృతి వనరులను ధ్వంసం చేసే విధంగా వ్యవహరిస్తోందని వక్తలు అన్నారు. చెట్లను నరికివేసిన చోట సంతాపం తెలిపారు. 
కార్యక్రమంలో పర్యావరణ వెత్తలు డా. పురోషత్తం రోడి, నర్సింహారెడ్డి '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' అధ్యక్షులు పాశం యాదగిరి, శ్రీనివాసరావు, కె.వీరయ్య, రమణ, జి. క్రాంతి, ఎం. శ్రీనివాస్‌ ... అనేక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.





23, డిసెంబర్ 2018, ఆదివారం

నీటిని సంరక్షించుకోకపోతే...

నిద్ర లేచిన దగ్గర నుండి మళ్లీ రాత్రి నిద్ర పోయే వరకు మనషికి గాలి ఎంత ముఖ్యమో, నీరు కూడా అంతే ముఖ్యం. ఆ నీటిని అపురూపంగా పొదివి పట్టుకుని జాగ్రతగా సంరక్షించుకోకపోతే 2020 నాటికల్లా... 
హైదరాబాద్‌తో సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో జన జీవనం దుర్భరమవుతుందని నీతి ఆయోగ్‌ హెచ్చరిస్తోంది.
ఈ ప్రకృతి యావత్తునూ నడిపించేది నీరే - లియోనార్డో డావిన్సీ
బావి ఎండిపోయిన రోజు తెలుస్తుంది, నీళ్ల విలువ ఏమిటో ! - బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌

18, డిసెంబర్ 2018, మంగళవారం

రోడుపై మట్టికుప్పలు...

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో జి.హెచ్‌.ఎం.సి డిప్యూటి కమీషనర్‌ గారికి నిన్న కంప్లాయింట్‌ చేయడంతో చాల రోజుల నుండి పెండింగ్‌లో ఉన్న
పాత నల్లకుంట, క్షత్రియా టవర్స్‌ ప్రక్క వీధిలో...రోడుపై మట్టికుప్పలు ఈ రోజు తీసివేశారు. ఈ కార్యక్రమంలో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఉపాధ్యక్షులు కె. వీరయ్య, నాయకులు పి. శ్రీనివాస్‌, డి. మోహన్‌, విలస్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

16, డిసెంబర్ 2018, ఆదివారం

2018 ఎన్నికలలో తెలంగాణలో పార్టీలు... వాటి ఓట్లు, సీట్లు...

2018 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో విజయఢంకా మోగించి వరుసగా రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
టీఆర్‌ఎస్‌ -88, కాంగ్రెస్ - 19, ఎంఐఎం- 7, టీడీపీ - 2 , బీజేపీ - 1
రామగుండంలో ‘ఫార్వర్డ్‌ బ్లాక్‌’, వైరాలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు
ఖాతా తెరవని టీజేఎస్, సీపీఐ, సీపీఎం, బీఎల్‌ఎఫ్‌.
..బొక్కబోర్లా పడిన ప్రజాకూటమి, కాంగ్రెస్‌ హేమాహేమీల పరాజయం
..స్పీకర్‌ సహా నలుగురు మంత్రుల ఓటమి.






9, డిసెంబర్ 2018, ఆదివారం

శాసనసభ ఎన్నికల్లో 73.20% పోలింగ్‌....

          2018 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 73.20% పోలింగ్‌ నమోదైంది.
2014తో పోల్చితే 3.7% ఎక్కువ ఓటింగ్‌
అత్యధికంగా మధిర నియోజకవర్గంలో 91.65% నమోదు కాగా, 
ఆ తర్వాతి స్థానాల్లో ఆలేరు (91.33%), మునుగోడు (91.07%), నర్సాపూర్, భువనగిరి (చెరో 90.53%), నర్సంపేట (90.06%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 
               చార్మినార్‌లో అత్యల్పంగా 40.18% పోలింగ్‌ జరగ్గా ఆ తర్వాతి స్థానాల్లో 41.24 శాతంతో యాకుత్‌పురా, 42.74 శాతంతో మలక్‌పేట, 44.02 శాతంతో నాంపల్లి, 45.61 శాతంతో జూబ్లీహిల్స్, 46.11 శాతంతో చాంద్రాయణగుట్ట, 49.05 శాతంతో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 
                 జిల్లాల వారీగా పరిశీలిస్తే 90.95% పోలింగ్‌తో యాదాద్రి–భువనగిరి జిల్లా తొలిస్థానంలో నిలవగా 48.89% ఓటింగ్‌తో హైదరాబాద్‌ జిల్లా చివరన నిలిచింది. గ్రేటర్‌లో 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం 51.73 నమోదైంది. 2014 ఎన్నికలతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. (2014 గ్రేటర్‌లో కేవలం 53 శాతం) .  మేడ్చల్ జిల్లాలో 55.85 శాతం పోలింగ్ నమోదైంది. 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే జిల్లాలో 4.96 శాతం పోలింగ్ పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో 61.29 శాతం పోలింగ్ నమోదైంది.









5, డిసెంబర్ 2018, బుధవారం

ప్రధాన పార్టీలలోనే 83 శాతం కోటీశ్వరులు...

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆస్తి అక్షరాల 314కోట్లు. ఆ తరువాత నిజామాబాద్‌ అభ్యర్థి ముత్యాల సునీల్‌కుమార్‌(బీఎస్పీ) 182 కోట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. 
నాగర్‌కర్నూల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన మర్రి జనా ర్దన్‌రెడ్డి తృతీయ స్థానంలో నిలిచారు.

మొత్తం 1,821 మంది అభ్యర్థులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవగా వారిలో 1,777 మంది తమ ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చారు. వీరిలో 438 (25%) మంది కోటీశ్వరులు.
రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి కలిగిన అభ్యర్థులు 192 (11%) మంది ఉన్నారు. 
 120 (7%) మందికి రూ.2 కోట్ల నుంచి 5 కోట్లు, 
275 (15%) మందికి రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్లు, 
453 (26%) మందికి రూ.10 లక్షల నుంచి 50 లక్షలు, 
737 (41%) మంది 10 లక్షల కంటే తక్కువగా ఆస్తి కలిగి ఉన్నారు.

పార్టీల వారీగా చూస్తే టీఆర్‌ఎస్‌ నుంచి 119 అభ్యర్థుల్లో 107 (90%) మంది కోటీశ్వరులు. 
బీజేపీది ద్వితీయ స్థానం. ఆ పార్టీ నుంచి 118 మంది బరిలో ఉంటే వారిలో 86 (73%) మంది కోటీశ్వరులు. 
 ఆతరువాత స్థానాల్లో కాంగ్రెస్‌ 99 మందికి గాను 79 (80%), 
బీఎస్పీ 100 మందికిగాను 26 (26%), 
టీడీపీ నుంచి 13 మంది అభ్యర్థుల్లో 12 (92%) మంది ఉన్నారు. 
119 అభ్యర్థుల్లో 58 మందికి అసలు ఆస్తులు లేవని ప్రకటించారు.
ఈనాడు...04.12.2018

ఓటు హక్కును వినియోగించుకోవాలి...

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్‌బిఐ కాలనీ రిసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు శ్రీ రాజగోపాల్‌ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ రోజు (05.12.2018) బాగ్‌ అంబర్‌పేట్‌లోని ఎస్‌బిఐ కాలనీ పార్క్‌లో ''హైదరాబాద్‌ జిందాబాద్‌'' మరియు ఎస్‌బిఐ కాలనీ రిసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఓటుపై అవగహన పోస్టర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా గురువు సురేంద్ర గారు, లైన్స్‌ క్లబ్‌ నాయకులు విద్య భూషన్‌, డా|| గూలబ్‌ రాణి, కాలనీ నాయకులు రవీంద్రనాథ్‌, హేమలత, డా|| ఆశలత, నారాయణ, కేశవరావు, శ్రీనివాసరాజు, హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు మల్లం రమేష్‌ , కె.వీరయ్య నాయకులు సురేష్‌, రవిప్రసాద్‌, రాంచందర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ రోజు (05.12.2018) ముసారంబాగ్ లోని జ్ఙాన్ దిప్ టవర్స్ లో ''హైదరాబాద్‌ జిందాబాద్‌'' ఆధ్వర్యంలో ఓటుపై అవగహన పోస్టర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. అసోషియేషన్‌ అధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి కె భరత్, అసోషియేషన్‌ నాయకులు జగనాథరెడ్డి, కుమార్ , హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు కె.వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


4, డిసెంబర్ 2018, మంగళవారం

ఓటరు చైతన్యం పై హైదరాబాద్ జిందాబాద్ ...

హైదరాబాద్ నగరం లో ఓటరు చైతన్యం పై హైదరాబాద్ జిందాబాద్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించిన జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిషోర్, అడిషనల్‌ ఎలక్షన్‌ చిఫ్‌ కమీషనర్‌ శ్రీ జ్యోతి బుద్ద ప్రకాష్‌ గారు...


3, డిసెంబర్ 2018, సోమవారం

ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి ఒక్కరూ కోసం ఓటు...

ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి ఒక్కరూ కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని 
కెసిసిసి, హైదరాబాద్‌ జిందాబాద్‌ రూపొందించిన పోస్టర్‌ ఆవిష్కరణ కాప్రా చౌరస్తాలో జరిగింది. 
కార్యక్రమంలో నాయకులు సంజీవరెడ్డి, సోమయ్య చారి, ఎం. శ్రీనివాస్‌రావు, రమణ, కె.వీరయ్య,  వి. విజరుకుమార్‌, పి.మోహన్‌ తదితరులు పాల్గొంన్నారు. కాప్రాలోని అన్ని కాలనీల నాయకులు పాల్గొంన్నారు.


30, నవంబర్ 2018, శుక్రవారం

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి...

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిహెచ్‌ఎంసి డిప్యూటి కమీషనర్‌ శ్రీమతి ఉమా ప్రకాష్‌ గారు పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం (30.11.2018) సుందరయ్య పార్క్‌లో హైదరాబాద్‌ జిందాబాద్‌ మరియు వాకర్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ ఆధ్వర్యంలో ఓటుపై అవగహన సదస్సు జరిగింది. భారత రాజ్యాంగము కల్పించిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ జిందాబాద్‌ సంస్థ ముందుకు రావడం, వారు చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు. డిసెంబర్‌ 7న పౌరలందరం ఓటేయాలని కోరారు.
                          కార్యక్రమంలో వాకర్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ (సుందరయ్య పార్క్‌) అధ్యక్షులు శ్రీమతి శైలాజ మోహన్‌ గారు, ఎఎంహెచ్‌వో డా|| హేమలత గారు, హైదరాబాద్‌ జిందాబాద్‌ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌రావు గారు, ఉపాధ్యక్షులు కె.వీరయ్య, సహయ కార్యదర్శులు రమణ, వి. విజరుకుమార్‌, జెకె శ్రీనివాస్‌, పి. నాగేశ్వర్‌రావు, పి.శ్రీనివాస్‌, రమేష్‌, జి.రాములు తదితరులు పాల్గొంన్నారు.






28, నవంబర్ 2018, బుధవారం

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు...

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిహెచ్‌ఎంసి కమీషనర్‌ శ్రీ దాన కిషోర్‌ గారు పిలుపునిచ్చారు. 27.11.2018  జిహెచ్‌ఎంసి హెడ్‌ ఆఫీసులో ఓటు హక్కు పై '' హైదరాబాద్‌ జిందాబాద్‌'' సంస్థ రూపొందించిన పోస్టర్‌, కరపత్రాలను ను కమీషనర్‌ శ్రీ దానకిషోర్‌గారు, అడిషనల్‌ ఎలక్షన్‌ చిఫ్‌ కమీషనర్‌ శ్రీ జ్యోతి బుద్ద ప్రకాష్‌ గారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షులు కె.వీరయ్య, సహయ కార్యదర్శులు వి. విజరుకుమార్‌, జెకె శ్రీనివాస్‌, పి.మోహన్‌ తదితరులు పాల్గొంన్నారు.



21, నవంబర్ 2018, బుధవారం

శక్తి నీవే..అధికారం ఎండమావే!

మాటల్లోనే మహిళల గురించి ఊకదంపుడు, 
పోటీకి అవకాశమివ్వని రాజకీయ పార్టీలు 
ఏళ్లుగా సాధికారత  అందనంత దూరంలోనే..
67 ఏళ్లూ..అదే తీరు.. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంతే.........

               మహిళలు.. ఆకాశంలో సగం సంగతేమో కానీ, రాజకీయాల్లో వారి పాత్ర నానాటికీ తగ్గిపోతోంది. ప్రభుత్వాలను ఎన్నుకునే నిర్ణయాధికారంలో సగం వాటా కలిగిన మహిళలకు చట్టసభలకు పోటీచేసే అకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు. ఈ విషయంలో కొద్ది హెచ్చుతగ్గులతో అన్ని రాజకీయ పార్టీలదీ ఒకటే తీరు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలు కలిపి 44 మంది మహిళలకు మాత్రమే టికెట్లు కేటాయించాయి.
- 2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో కలిపి 317 మంది మహిళలు పోటీ చేస్తే.. 27 మంది (తెలంగాణ– 9, ఆంధ్రప్రదేశ్‌– 18) గెలిచారు
2009లో 300 మంది మహిళలు పోటీకి దిగగా, 33 మంది (కాంగ్రెస్‌– 21, టీడీపీ– 9, సీపీఐ– 1, ప్రజారాజ్యం–2) గెలుపొందారు
2004లో 161 మంది పోటీచేస్తే 25 మంది విజయం సాధించారు (కాంగ్రెస్‌– 17, సమాజ్‌వాదీ పార్టీ– 1 (డీకే అరుణ), టీడీపీ– 5, టీఆర్‌ఎస్‌– 2)
1999లో 157 మంది బరిలో నిలిస్తే 28 మంది గెలిచారు (టీడీపీ– 22, కాంగ్రెస్‌– 5, ఇండిపెండెంట్‌– 1)
1994లో 127 మంది పోటీచేస్తే 8 మంది గెలుపొందారు (టీడీపీ– 6, కాంగ్రెస్‌– 1, సీపీఎం– 1)
1989లో 70 మందికి టికెట్లు దక్కగా, 17 మంది పోటీలో నెగ్గారు (కాంగ్రెస్‌– 11, టీడీపీ– 6)
1985లో 66 మంది బరిలో నిలబడితే పది మంది గెలుపొందారు (కాంగ్రెస్‌– 1, టీడీపీ– 9)
1983లో 66 మంది పోటీకి నిలవగా, గెలిచింది పదకొండు మంది (టీడీపీ– 9, కాంగ్రెస్‌– 1, సీపీఎం– 1)
1978లో 54 మందికి టికెట్లు ఇవ్వగా పదిమంది గెలిచారు (కాంగ్రెస్‌– 6, జనతా పార్టీ– 3, సీపీఎం– 1)
1972లో ఒక్క మహిళ కూడా గెలవలేదు. 287 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 49 మంది మహిళలు పోటీ పడ్డారు
1967లో 21 మంది నిలబడితే 11 మంది గెలిచారు (కాంగ్రెస్‌– 10, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా– 1)
1962లో 24 మంది పోటీచేస్తే పది మంది విజయం సాధించారు (కాంగ్రెస్‌– 8, సీపీఐ– 2)
1952లో హైదరాబాద్‌ స్టేట్‌ తొలి శాసనసభ ఎన్నికల్లో 8 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు 
    (కాంగ్రెస్‌– 5, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌– 1, ఇండిపెండెంట్‌– 1,  ఆల్‌ఇండియా షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్‌– 1)
      (ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలూ కలిపి 44 మంది మహిళలకు అవకాశం ఇచ్చాయి)
సాక్షి 21.11.2018


20, నవంబర్ 2018, మంగళవారం

పాలసీ ఆర్థిక రక్ష...

సరైన సలహా, ఆవగాహనతో పాలసీని ఎంచుకున్నప్పుడు కష్టకాలంలో ఆదుకోవడంతో పాటు, దీర్ఘ కాలంలో సంపదను సృష్టించేందుకూ ఇది పనికొస్తుంది. మీపై ఆధారపడిన వారికి కూడా ఆర్థిక రక్షణ కల్పించడమే ధ్యేయం కావాలి. ఆర్జించే కుటుంబ పెద్ద అనుకోని పరిస్థితుల్లో దూరం అయినా...ఆ పాలసీ ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆ వ్యక్తి లేని లోటు తీర్చాలి....
ఈనాడు...18.11.2018 

వందల కోట్లున్న శ్రీమంతులు వస్తూన్నారు...

వందల కోట్లున్న శ్రీమంతులు వస్తూన్నారు...
ధన స్వామ్యానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలివి. 
బూర్జువా పార్టీలు డబ్బును వరదలా పారిస్తున్నాయి. 
నీతి, నిజాయితీలను నమ్ముకున్న అభ్యర్థులను ఆదరిస్తారా.?
ప్రజలు విజ్ఞతతో నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్న మైంది...
ఈనాడు...20.11.2018

16, నవంబర్ 2018, శుక్రవారం

బడి కోసం ఊరు కదిలింది...

ఊరి బడి ...ప్రైవేటు స్కూలు...భవిష్యత్ పరిణామాలు...
ఒక సారి ఆలోచించండి... బడి కోసం ఎందుకు ఊరు కదిలింది...
ఈనాడు...4.11.2018

15, నవంబర్ 2018, గురువారం

తెలంగాణ ఎం.ఎల్.ఏ.లకే జీతాలు ఎక్కువ...

మన దేశంలోని రాష్ర్టాలలో  తెలంగాణ ఎం.ఎల్.ఏ.లకే జీతాలు ఎక్కువ...
 ఈనాడు...15.11.2018

14, నవంబర్ 2018, బుధవారం

2014 సంవత్సరం ఎన్నికలలో పార్టీలు...

తెలంగాణలో 2014 సంవత్సరం ఎన్నికలలో పార్టీలు...
వాటి ఓట్ల శాతాలు, సీట్లు...

8, నవంబర్ 2018, గురువారం

దీపాల పండుగ దీపావళి ...

నరకాసురుడు అనే రాక్షసుడిని హతమార్చి, చీకట్లను పారదోలినందుకు దీపావళి చేసుకుంటారని కథలో చెప్తారు. చీకటి చెడును పారదోలి, వెలుగును ఆహ్వానించడము. మన జీవితాలలో చూపించే చెడును దూరం చేయటమే దీపావళి. కానీ మనం పటాకుల రూపంలో కాలుష్యాన్ని కొనితెచ్చుకొంటున్నాము. చెడును నాశనం చేయడం కాకుండా, చెడును ఆహ్వానిస్తూ పండుగ చేసుకుంటున్నాము. వాయుకాలుష్యం, శబ్ధకాలుష్యం, ధూళికాలుష్యం...అన్ని కలిపి దీపావళి పండుగ. పండుగ ఒక రోజు కానీ పర్యావరణంపై, మన ఆరోగ్యం దాని ప్రభావం సంవత్సరం రోజులు పడుతుంది. సాధారణ రోజుల్లోనే కాలుష్యం సమస్య మనల్ని త్రీవంగా వెంటాడుతున్నది. పండుగ సమయంలో ఈ సమస్య రెండు, మూడు రేట్లు ఎక్కువగా అవుతున్నది.
ప్రపంచంలో వాయుకాలుష్యంలో మన దేశం నాలుగో స్థానం...
ప్రపంచంలో వాయుకాలుష్యంలో మన దేశం నాలుగో స్థానంలో ఉన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యధికంగా కాలుష్యం ఉన్న 20 నగరాలలో, 13 నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. ఇది పెను ప్రమాద హెచ్చరికే. దేశంలో అన్ని రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజు ఏర్పడుతున్న కాలుష్యాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తిస్తుంది. దేశంలో ఢిల్లీ అత్యంత కాలుష్యంతో చాలా దారుణంగా ప్రథమ స్థానంలో ఉంది. ఢిల్లీలో దీపావళి ఒక్క రోజే 4 వేల టన్నుల చెత్త అదనంగా పెరుగుతుంది.
ఒకటి 464 సిగరెట్లతో సమానం ....
ధూమపానం ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సిగరెట్‌ కాల్చేవారికే కాదు, ఆ పొగను పీల్చేవారికీ నష్టమే. ఒక సిగరెట్‌కే కొందరు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. అలాంది ఒకేసారి 464 సిగరెట్ల పొగను తట్టుకోగలామా..? ఒక్క పాము గోళిని కాలిస్తే చాలు, అంత పొగ వెలువడుతుంది. పుణె చెస్ట్‌ రీసెర్చ్‌ పౌండేషన్‌, పుణె విశ్వవిద్యాలయం హెల్త్‌ సైన్సెస్‌ విద్యార్థులు అధ్యయనం చేసి, ఏ బాణసంచాను కాల్చితే ఎంత నష్టమో తేల్చారు. ఆ లెక్కల్ని చేస్తే ఉక్కిరి, బిక్కిరి కావలసిందే...
బాణసంచా గాల్లోకి విడుదలయ్యే పిఎం 2.5 (మైక్రోగ్రాముల్లో) ఎన్ని సిగరెట్లకు సమానం
పాముగోళి                                        64,500                                   464
థౌజండ్‌ వాలా                                   38,540                                  277
ఫూల్‌-ఫూల్‌                                       28,950                                 208
పూల్‌ జడీ                                          10,390                                   74
భూచక్రం                                              9,490                                   68
అనార్‌                                                  4,860                                  34
అణువణువు విష పూరితమే... ప్రమాదకర రసాయనాలతో పటాకులు....
. సీసం : నాడీ వ్యవస్థను దెబ్బ తీస్తుంది. మెదడు సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది.
. పొటాషియం : ఊపిరితిత్తులు చెడిపోతాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
. క్యాడ్మియం : ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ఎముకలపై ప్రభావం అనేక రోగాలకు కారణమవుతుంది.
. క్రోమియం : చర్మవ్యాధులతో పాటు, హైపర్‌ సెన్సిటివిటీ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీస్తుంది.
. సల్ఫర్‌ డై ఆక్సెడ్‌ : శ్వాసకోశ నాళాలు దెబ్బతిని, బ్రాంకైటీస్‌కు కారణమవుతుంది.
. నైట్రోజన్‌ డై ఆక్సెడ్‌ : కండ్లు, ముక్క మండుతాయి. శ్వాసకోశంపై ప్రభావం చూపుతుంది.
. కార్భన్‌ మోనాక్సైడ్‌ : దీని వల్ల జీవకణాలకు ఆక్సిజన్‌ ఆందదు. 100 పిపిఎం కు ఇది చేరితే మరణానికి దారితీస్తుంది.
. మోగ్నీషియం : ఈ సూక్ష్మ కణాలు శరీరంలోకి చేరి నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతాయి.
హైదరాబాద్‌ నగరంలో ఏటా పెరుగుతున్న శబ్ద, వాయు కాలుష్యం...
హైదరాబాద్‌ నగరం కూడా దేశంలోని ప్రమాదకర కాలుష్య నగరాలలో ఒకటి. కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్‌ కూడా మొత్తం 17 ప్రాంతాల్లో విష రసాయనల వాయువులు వాతావరణంలో కలువడాన్ని గుర్తించింది. పిఎం 10(ధూళి కణాలు) స్థాయి సాధారణ రోజుల్లో ఒక క్యూబిక్‌ మీటర్‌కు 100 మైక్రోగ్రామ్‌లు ఉంటే 2016 దీపావళి రోజున సరాసరి 160 కి పెరిగింది. వరంగల్‌లో 60 నుండి 110, నల్లగొండలో 85 నుండి 113, రామగుండంలో 50 నుండి 90, ఖమ్మంలో 40 నుండి 70...నమోదైంది.
గత సంవత్సరం సిపిసిబి శబ్దకాలుష్య గణాంకాల ఆధారంగా అత్యధికంగా నమోదవుతున్న ఏడు నగరాలకు ర్యాంకులను ప్రకటించింది. శబ్ధకాలుష్యంలో హైదరాబాద్‌ మొదటి స్థానం నిలిచింది. తరువాత ఢిల్లీ, ముంబాయి, చెన్నై, కోల్‌కతా, లఖ్‌నవూ, బెంగళూరు ఉన్నాయి. గతంలో మనం మూడో స్థానంలో ఉన్నాం.
సిపిసిబీ గణాంకాల ప్రకారం వాణిజ్య విభాగం పగలు 65 డెసిబుల్స్‌, రాత్రి 55 డెసిబుల్స్‌ ; పారిశ్రామిక ప్రాంతం పగలు 75, రాత్రి 70; సున్నిత ప్రాంతంలో పగలు 50, రాత్రి 40; నివాస ప్రాంతంలో పగలు 55, రాత్రి 45 డెసిబుల్స్‌ ఉండాలి. పగలు అంటే ఉ.6 నుండి రా 10 వరకు, రాత్రి అంటే రా.10 నుండి ఉ.6 వరకు నమోదుచేస్తారు.
గ్రీన్‌ దీపావళి....
అభివృద్ది చెందిన దేశాలలో ఏ సంబరమైనా పటాకులు లేకుండా జరుగదు. అయినా అక్కడ కాలుష్యం పెరుగకపోవటానికి కారణం జీరో పొల్యూషన్‌ పటాకుల వినియోగమే. అన్నింటికి మించి సామూహికంగా క్రాకర్‌ షో ఏర్పాటు చేసుకుని, అందరు సమిష్టిగా పాలుపంచుకొంటారు. దీనితో కాలుష్యం ఒక్క చోటికే పరిమితం అవుతుంది. అమెరికాకు చెందిన కొన్ని కెమికల్‌ , ఇంజనీరింగ్‌ కంపెనీలు జీరో పొల్యూషన్‌ క్రాకర్స్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి వల్ల తక్కువ పొగ రావడంతో పాటు పర్యావరణహితంగా పటాకులు కాల్చుకొనే అవకాశం కలుగుతున్నది. చైనా 710 నగరాల్లో కొత్త సంవత్సర వేడుకలలో బాణసంచాను పూర్తిగా నిషేదించింది. కాలుష్యానికి కారణమైన 17,600 పరిశ్రమలను మూడేళ్ళ క్రితమే మూసివేశారు. కొన్ని దేశాలలో కర్భన పదార్ధాలకు బదులుగా నైట్రోజన్‌ సంబంధిత పదార్ధాలతో తయారు చేస్తున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు అభినందనీయం...
బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు అక్టోబర్‌ 23, 2018 వెలువరించిన తీర్పు హర్షణీయం, అభినందనీయం. పర్యావరణ ప్రేమికులందరు సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నారు. కాలుష్యం మానవ మనుగడకు ముప్పు కలిగిస్తున్న తరుణంలో పండుగలన్నీ పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరుకుందాం. దేశవ్యాప్తంగా దీపావళి, ఇతర పండుగలలో రెండు గంటల వరకే బాణాసంచా కాల్చాలనీ, నూతన సంవత్సరం, క్రిస్మస్‌లలో రాత్రి 11.55 నుండి 12.30 వరకు కాల్చాలనీ, ఆన్‌లైన్‌- వెబ్‌సైట్లలో టపాసులు అమ్మడానికి వీల్లేదని, తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసులకే అనుమతి ఇవ్వాలని అనేక ఆంక్షలతో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అభినందనీయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ప్రజలలో, పిల్లలో అవగహన పెంపోందించడానికి తగు చర్యలు తీసుకోవాలి.
వెలుగు నింపాలి, కాలుష్యం కాదు ....
దీపావళి అంటే అందరి ఇండ్లలో వెలుగు నిండాలి. అంతేగాని కాలుష్యం కాదు. కెమికల్స్‌తో కూడిన పటాకులు కాల్చడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకొంటున్నాం. పర్యావరణానికి హితమైన జీవానాన్ని అలవరుచుకోవడం ఈ కాలానికి ఎంతో అవసరం. అందుకు తగిన అవగాహనను పెంపొందించుకుందాం. గతంతో పోలిస్తే పటాకుల ద్వారా వాయుకాలుష్యం, ధ్వని కాలుష్యం పెంచకూడదనే స్ప ృహ దేశమంతటా పెరుగుతున్నది. పర్యావరణంపై స్ప ృహ పెరగడం అభినందనీయం.
ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం లేని రీతిలో పండుగలను జరుపుకుందాం. దీపావళి పండుగనే కాదు, వినాయక చవితి, ఏ పండుగైనా కాలుష్య రహితంగా జరుపుకుందాం.
. దీపాలు వెలిగించడంతో ఇంటికి వెలుగుల శోభను తీసుకొనిరావాలి.
. కాలనీల్లో సామూహికంగా ఒకేచోట పటాకులు కాల్చే కార్యక్రమం చేపట్టాలి.
. దానితో కాలనీల్లో మనుషుల మధ్య అనుబంధం కూడా పెరుగుతుంది.
. తక్కువ శబ్ధం, పొగ తక్కువగా వచ్చే పటాకులకు ప్రధాన్యం ఇవ్వాలి.
కె. వీరయ్య
ఉపాధ్యక్షులు
'' హైదరాబాద్‌ జిందాబాద్‌ ''
99498 21177
veeraiahhyd@gmail.com

4, నవంబర్ 2018, ఆదివారం

ప్రజలు మౌనం వీడి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి...

ప్రపంచంలో కాలుష్య ప్రమాదం పొంచి ఉన్నదాని హెచ్చరిస్తూ, మనం ఇప్పటికైనా మౌనం వీడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రముఖ పర్యావరణవేత్త, రిటైర్డ్‌ సైంటిస్ట్‌ డా|| కలపాల బాబూరావు గారు పిలుపునిచ్చారు. ఈ రోజు (04.11.2018) సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో '' దీపావళి- కాలుష్యం'' పై సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిధిగా హజరై ప్రసంగించారు.
డా|| బాబూరావు గారు మాట్లాడుతూ భూతాపం 2 డీగ్రీల పెరుగుదల దగ్గర ఆపితే ప్రమాదం తప్పించవచ్చునీ పారీస్‌ ఓప్పందం చెప్పుతున్నా ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు 1.5 డీగ్రీలకే ప్రమాదం పొంచి ఉన్నదాని హెచ్చరిస్తున్నారని అన్నారు. మనం ఇప్పటికైనా కార్యచరణ చేపట్టాలని, మౌనంగా వుంటే మన మనగడే ఉండదని తెలియజేశారు. స్వీడన్‌ దేశంలో 11 ఏళ్ళ పాప మూడు వారాలు స్కూలుకు వెలకుండా, ఆ దేశ పార్లమెంటు ముందు నిరసనకు కూర్చునదని, స్కూలుకు వెళ్ళి చదువుకున్న భవిష్యత్‌ ప్రమాదంలో ఉన్నందున తను నిరసన తెలుపుతున్నదని తెలయజేశారు. ఇప్పుడు కూడా వారానికి ఒక రోజు నిరసన తెలుపుతున్నదని చెప్పారు. అమెరికాలో 9 ఏళ్ళ పిల్లలు 21 మంది దాదాపు 11 సంవత్సరాల నుండి కోర్టులో పర్యావరణ ప్రమాదం పై ప్రభుత్వం చర్చించాలని కేసు నడుపుతున్నారని, ఈ మధ్యకాలంలో కోర్టు ప్రభుత్వం చర్చ జరపాలని ఆదేశించిందని తెలయజేశారు. పర్యావరణ విద్వంసానికి ప్రజలె కారణమని కొందరు చెపుతున్నారు. పేదల వలన కాలుష్యం ఉండదని, పరిశ్రమల పెట్టిన పెట్టుబడిదారుల వలననే కాలుష్యం పెరుగుతున్నదని అన్నారు.
కార్యక్రమంలో డా|| దాసరి ప్రసాద్‌రావు గారు, డా|| రామ్‌కిషన్‌ గారు, సీనియర్‌ జర్నలిస్టు, హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు శ్రీ పాశం యాదగిరి గారు, ఉపాధ్యక్షులు కె.వీరయ్య, రమణ, పి. నాగేశ్వర్‌రావు, సహయ కార్యదర్శిలు విజరుకుమార్‌, పి.శ్రీనివాస్‌, నాయకులు పి. నాగేష్‌, దుర్గ, సంగీత, శ్రీలత, మణిక్యం, అజరు, మోహన్‌, ఈశ్వర్‌బాబు, రమేష్‌ తదితరులు పాల్గొంన్నారు.




24, అక్టోబర్ 2018, బుధవారం

పటాకులు రెండు గంటలే..

బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు హర్షణీయం, అభినందనీయం. హైదరాబాద్‌ జిందాబాద్‌ సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నది. కాలుష్యం మానవ మనుగడకు ముప్పు కలిగిస్తున్న తరుణంలో పండుగలన్నీ పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరుచున్నాము. దేశవ్యాప్తంగా దీపావళి, ఇతర పండుగలలో రాత్రి 8 నుండి 10 గంటల వరకే బాణాసంచా కాల్చాలనీ, నూతన సంవత్సరం, క్రిస్మస్‌లలో రాత్రి 11.55 నుండి 12.30 వరకు కాల్చాలనీ, ఆన్‌లైన్‌- వెబ్‌సైట్లలో టపాసులు అమ్మడానికి వీల్లేదని, తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసులకే అనుమతి ఇవ్వాలని అనేక ఆంక్షలతో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అభినందనీయం.



15, అక్టోబర్ 2018, సోమవారం

ఢిల్లీకి ఏమైంది... మళ్లీ కాలుష్యం...

దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది...
మళ్లీ కాలుష్యం, పొగమంచు వల్ల ఊపిరాడని పరిస్థితి... 
అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. ప్రజలకు హెచ్చరిక...

3, అక్టోబర్ 2018, బుధవారం

పర్యావరణాన్ని కాపాడలని మానవహారం ...

పర్యావరణాన్ని కాపాడలని ట్యాంక్ బండ్ పైన ( హైదరాబాద్‌ ) అక్టోబర్ 2 మానవహారం లో ...
కాలుష్య నివారణకు ఐక్య ఉద్యమం -  ఈ పాపం పెట్టుబడిదారులదే : మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య
- పరిశుభ్ర నగరంగా మార్చుదాం : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌

                   ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కాలుష్య పాపం పెట్టుబడిదారులదేనని, దీని నివారణను ప్రజలంతా ఉద్యమంగా స్వీకరించాలని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కోరారు. హైదరాబాద్‌ నగరం కూడా కాలుష్యంలో ఢిల్లీ, బెంగళూర్‌తో పోటీ పడుతున్నదని చెప్పారు. తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక (పట్నం) ఆధ్వర్యంలో 'కాలుష్యాన్ని నివారించండి- పర్యావరణ పరిరక్షణకై నడుంకట్టండి' నినాదంతో ట్యాంక్‌బండ్‌పై భారీ మానవహారం నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని, కాలుష్యాన్ని నివరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ...కాలుష్యం కేవలం నగరానికో, దేశానికో సంబంధించిన అంశం కాదనీ, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య అని చెప్పారు. దీనిపై ప్రభుత్వాలు కూడా సీరియస్‌గా స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్లాస్టిక్‌, పాలిథిన్‌తో వాయుకాలుష్యం, జనకాలుష్యం అవుతుందన్నారు. పరిశ్రమల్లో వచ్చే లాభాలను పెట్టుబడిదారులు తీసుకుంటూ, కాలుష్యాన్ని మనకు ఇస్తున్నారని విమర్శించారు.
               జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ మాట్లాడుతూ...కాలుష్యంలేని స్వచ్ఛ తెలంగాణ నిర్మాణంగా మార్చేందుకు అందరం ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్‌ నగరాన్ని కూడా స్వచ్ఛకార్మికుల సహాయంతో పారిశుభ్రమైన నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నగరంలో స్వచ్ఛ సర్వే జరుగుతున్నదన్నారు. ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు శుభ్రతను తమ జీవనంలో భాగం చేసుకోవాలని కోరారు.
            ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తాజ్వాల మాట్లాడుతూ...కాలుష్య నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా స్పందించాలన్నారు. సర్కారు ఆలోచించేలా ప్రజల నుంచి ఒత్తిడి పెరగాలని కోరారు. విద్యాసంస్థలు, హాస్పిటల్స్‌, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా అన్నిచోట్ల కాలుష్య నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.      

            సినీనటులు మాదాల రవి మాట్లాడుతూ...కాలుష్య నివారణకు అందరం ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ రోజా, ప్రముఖ పాత్రికేయులు రాంచంద్రమూర్తి, సామాజికవేత్త గోపాల్‌రావు, వివిధ సంఘాల నాయకులు శోభన్‌నాయక్‌, మహేందర్‌, అరుణజ్యోతి, రాజేశం, మారన్న, సైదులు, మూర్తి, నరేశ్‌, జావీద్‌, వాణి తదితరులు పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌ నుంచి జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు.