21, నవంబర్ 2018, బుధవారం

శక్తి నీవే..అధికారం ఎండమావే!

మాటల్లోనే మహిళల గురించి ఊకదంపుడు, 
పోటీకి అవకాశమివ్వని రాజకీయ పార్టీలు 
ఏళ్లుగా సాధికారత  అందనంత దూరంలోనే..
67 ఏళ్లూ..అదే తీరు.. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంతే.........

               మహిళలు.. ఆకాశంలో సగం సంగతేమో కానీ, రాజకీయాల్లో వారి పాత్ర నానాటికీ తగ్గిపోతోంది. ప్రభుత్వాలను ఎన్నుకునే నిర్ణయాధికారంలో సగం వాటా కలిగిన మహిళలకు చట్టసభలకు పోటీచేసే అకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు. ఈ విషయంలో కొద్ది హెచ్చుతగ్గులతో అన్ని రాజకీయ పార్టీలదీ ఒకటే తీరు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలు కలిపి 44 మంది మహిళలకు మాత్రమే టికెట్లు కేటాయించాయి.
- 2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో కలిపి 317 మంది మహిళలు పోటీ చేస్తే.. 27 మంది (తెలంగాణ– 9, ఆంధ్రప్రదేశ్‌– 18) గెలిచారు
2009లో 300 మంది మహిళలు పోటీకి దిగగా, 33 మంది (కాంగ్రెస్‌– 21, టీడీపీ– 9, సీపీఐ– 1, ప్రజారాజ్యం–2) గెలుపొందారు
2004లో 161 మంది పోటీచేస్తే 25 మంది విజయం సాధించారు (కాంగ్రెస్‌– 17, సమాజ్‌వాదీ పార్టీ– 1 (డీకే అరుణ), టీడీపీ– 5, టీఆర్‌ఎస్‌– 2)
1999లో 157 మంది బరిలో నిలిస్తే 28 మంది గెలిచారు (టీడీపీ– 22, కాంగ్రెస్‌– 5, ఇండిపెండెంట్‌– 1)
1994లో 127 మంది పోటీచేస్తే 8 మంది గెలుపొందారు (టీడీపీ– 6, కాంగ్రెస్‌– 1, సీపీఎం– 1)
1989లో 70 మందికి టికెట్లు దక్కగా, 17 మంది పోటీలో నెగ్గారు (కాంగ్రెస్‌– 11, టీడీపీ– 6)
1985లో 66 మంది బరిలో నిలబడితే పది మంది గెలుపొందారు (కాంగ్రెస్‌– 1, టీడీపీ– 9)
1983లో 66 మంది పోటీకి నిలవగా, గెలిచింది పదకొండు మంది (టీడీపీ– 9, కాంగ్రెస్‌– 1, సీపీఎం– 1)
1978లో 54 మందికి టికెట్లు ఇవ్వగా పదిమంది గెలిచారు (కాంగ్రెస్‌– 6, జనతా పార్టీ– 3, సీపీఎం– 1)
1972లో ఒక్క మహిళ కూడా గెలవలేదు. 287 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 49 మంది మహిళలు పోటీ పడ్డారు
1967లో 21 మంది నిలబడితే 11 మంది గెలిచారు (కాంగ్రెస్‌– 10, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా– 1)
1962లో 24 మంది పోటీచేస్తే పది మంది విజయం సాధించారు (కాంగ్రెస్‌– 8, సీపీఐ– 2)
1952లో హైదరాబాద్‌ స్టేట్‌ తొలి శాసనసభ ఎన్నికల్లో 8 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు 
    (కాంగ్రెస్‌– 5, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌– 1, ఇండిపెండెంట్‌– 1,  ఆల్‌ఇండియా షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్‌– 1)
      (ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలూ కలిపి 44 మంది మహిళలకు అవకాశం ఇచ్చాయి)
సాక్షి 21.11.2018


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి