27, సెప్టెంబర్ 2016, మంగళవారం

భారతీయ యువకుడికి ఐరాస గుర్తింపు...

... కార్పొరేట్‌ కొలువును వదులుకొని సమాజ సేవ
... ఆకలి, పౌష్టికాహార సమస్యల పరిష్కారానికి కృషి
             ఢిల్లీకి చెందిన అంకిత కవత్రకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించింది. ాఫీడింగ్‌ ఇండియా్ణ ద్వారా ఆకలి, పౌష్టికాహార సమస్యల పరిష్కారానికి అతడు చేస్తున్న కృషికి గుర్తింపుగా ాయంగ్‌ లీడర్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవల్‌పమెంట్‌ గోల్స్‌్ణ కార్యక్రమానికి ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా 186 దేశాల నుంచి వచ్చిన 18000 నామినేషన్లలో 17మందిని మాత్రమే ఐరాస ఎంపిక చేసింది. ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగే సదస్సులో, 71వ సాధారణ అసెంబ్లీ సమావేశాలలో కవత్ర ప్రసంగించనున్నారు.


26, సెప్టెంబర్ 2016, సోమవారం

భారత్ చారిత్రక' విజయం...

భారత్ క్రికెట్ జట్టు చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్ ను కనీసం డ్రాతో ముగిద్దామని న్యూజిలాండ్ శతవిధాలా ప్రయత్నించింది.  ప్రత్యేకంగా ఈ సెషన్ లో రవీంద్ర జడేజా ఒక వికెట్ తీస్తే, పేసర్ మొహ్మద్ షమీ రెండు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు తీసి కివీస్ ను చావు దెబ్బకొట్టాడు. దాంతో న్యూజిలాండ్ కు ఘోర పరాజయానికి స్వాగతం పలకగా,197 పరుగుల తేడాతో  భారత్ 'చారిత్రక' విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 318 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇందులో విజయ్ (65), పుజారా (62), జడేజా (42 నాటౌట్), అశ్విన్ (40) పరుగులు చేశారు. 
అనంతరం కివీస్ మొదటి ఇన్నింగ్స్ ఆటను ప్రారంభించింది.  విలియమ్సన్ (75), టామ్ లాథమ్ (58) పరుగులు చేశారు.  262 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో భారత్ బౌలర్ జడేజా ఐదు వికెట్లు తీయగా అశ్విన్ నాలుగు వికెట్లు తీశాడు.
 అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మెన్స్ విజృంభించారు. ఓపెనర్ రాహుల్ (38) విజయ్ (76) ధాటిగా ఆటను ప్రారంభించారు. పుజారా (78), కోహ్లీ (18), రహానే (40)లు పరుగులు చేశారు. మొత్తం 5 వికెట్లు కోల్పోయిన భారత్ 377 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. శర్మ (68 నాటౌట్), జడేజా (50 నాటౌట్) గా మిగిలారు.

434 పరుగుల లక్ష్యం..
434 పరుగుల లక్ష్య చేధనతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఆటను ఆరంభించింది.  రోంచీ (80), శాంట్నర్ (71) పోరాటం చేశారు. కానీ మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివరకు 236 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ ఆరు వికెట్లు, షమీ రెండు, జడేజా ఒక వికెట్ తీశారు. చారిత్రక 500 టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం సాధించడం పట్ల క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

25, సెప్టెంబర్ 2016, ఆదివారం

ఇండ్లలోకి వరద నీరు రాకుండ శాస్వత పరిష్కారం చేయాలి - హైదరాబాద్‌ జిందాబాద్‌

నల్లకుంట ఏరియాలో మ్యాన్‌ హోల్స్‌పై కవర్స్‌ లేవు. వర్షపు నీటి పైపు లైన్‌ కూలి గుంత పడింది. గత రెండు నెలల నుండి ఎన్ని కంప్లాయింట్స్‌ చేసిన పట్టించుకొని అధికారులు...

17, సెప్టెంబర్ 2016, శనివారం

నగరం అతలాకుతలమైంది...

శుక్రవారం సాయంత్రం (16.09.2016) కురిసిన భారీ వర్షంతో  హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. చెరువులను తలపించిన రహదారులు, పొంగిపొర్లిన నాలాలు,  అడుగడుగునా గుంతలతో వాహనదారులు రోడ్లపై నరకం చూశారు...

15, సెప్టెంబర్ 2016, గురువారం

భారీ ఖైరతాబాద్ గణేష్ ను సందర్శన...

మా కుటుంబసభ్యులతో కలిసి   హైదరబాద్ లో 58 అడుగులతో ఏర్పాటైన భారీ  ఖైరతాబాద్  గణేష్ ను సందర్శించడం జరిగింది.    అనంతరం ట్యాంక్ బండ్ వద్ద గణేష్ ల నిమజ్ఙనం తిలకించారు. 


5, సెప్టెంబర్ 2016, సోమవారం

'' వట్టి మాటలు కటిపెట్టి - మట్టి గణపతి పెట్టవోరు ''...

             అంబర్‌పేట డిడి కాలనీలోని ఎస్‌బిఐ కాలనీ పార్క్‌లో  04.09.2016 ఉచిత గణేష్‌ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాదరావు గారు ప్రారంభిస్తూ ప్రసంగించారు. నగరంలో సాంప్రదాయరీతులలో గణేష్‌ ఉత్సవాలను జరుపుకోవటం ఆనవాయితీ అన్నారు. నిమజ్జనం అనంతరం మట్టితో తయారైన విగ్రహం మట్టిలోనే కలుస్తుందని , దీని వలన సమాజానికి ఎలాంటి హాని ఉండదని అన్నారు. కానీ ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌ తో తయారు అయిన గణపతుల వల్ల కాలుష్యం ఎక్కువగా ప్రబలుతుందని, అది ఎంతో హాని కరమని హెచ్చరించారు. 
          సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి గారు మాట్లాడుతూ '' వట్టి మాటలు కటిపెట్టి - మట్టి గణపతి పెట్టవోరు '' అంటూ పిలుపునిచ్చారు. మట్టి గణపతులనే వాడాలని - కాలుష్యకారకమైన, విషరసాయక రంగులు, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌ విగ్రహాలు వద్దని అన్నారు. ఆర్‌డివో సురేష్‌ గారు మాట్లాడుతూ కాలుష్య సమస్య అత్యంత తీవ్ర సమస్యగా మన ముందుకు వచ్చిందని, మానవాళి మనుగడకే ప్రమాదంగా మారిందని అన్నారు. అనంతరం ఎస్‌బిఐ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజగోపాల్‌ రెడ్డి, ఆర్‌వి రాజు గార్లు ప్రసంగించారు.
                  ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ జిందాబాద్‌ అంబర్‌పేట అధ్యక్షులు మల్లం రమేష్‌, నగర నాయకులు జె. కుమారస్వామి, కె. వీరయ్య, విజయ, జెకె శ్రీనివాస్‌, రవిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. కాలనీల ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు.


4, సెప్టెంబర్ 2016, ఆదివారం

మట్టి గణేష్‌ల ఉచిత పంపిణి ...హైదరాబాద్‌ జిందాబాద్‌

బాగ్‌లింగంపల్లిలో ఎల్‌ఐజి గ్రౌండ్‌ వద్ద హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో 03.09.2016న మట్టి గణేష్‌ల ఉచిత పంపిణి కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిధిగా హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు పాశం యాదగిరి గారు పాల్గొని మట్టి గణేష్‌లను పంపిణి చేశారు.ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరంలో వైభవంగా నిర్వహించుకొనే '' వినాయక చవితి'' పండుగ అని అన్నారు. ప్రతి ఇంటిలో కుటుంబ సమేతంగా నిర్వహించుకుంటూ అపార్ట్‌మెంట్స్‌, కాలనీ, బస్తీలలో సామూహికంగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించుకొని పూజించటం ఆనవాయితిగా వస్తున్నది. ఇళ్ళల్లో మరియు సామూహికంగా ప్రతిష్టించే గణేష్‌ విగ్రహాలను పర్యావరణానికి హానికరం కాని మట్టి గణేష్‌లనే ఉపయోగించాలని హైదరాబాద్‌ జిందాబాద్‌ విజ్ఞప్తి చేస్తున్నది.
అందుకే పర్యావరణహితమైన విగ్రహాలను ఐదు అడుగులలోపే బుజ్జి, బుజ్జి వినాయకులను భక్తితో పూజిద్దాం. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రావు, నగర సహాయ కార్యదర్శి వి.విజయకుమార్‌, నగర నాయకులు వెంకటేశ్వర్‌రావు, కె.వీరయ్య, ఎల్‌ఐజి కాలనీ నాయకులు భూపాల్‌, శేఖర్‌, లింగారెడ్డి, స్థానిక నాయకులు 
సి. మల్లయ్య, జి.రాములు తదితరులు పాల్గొన్నారు.