26, సెప్టెంబర్ 2016, సోమవారం

భారత్ చారిత్రక' విజయం...

భారత్ క్రికెట్ జట్టు చారిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్ ను కనీసం డ్రాతో ముగిద్దామని న్యూజిలాండ్ శతవిధాలా ప్రయత్నించింది.  ప్రత్యేకంగా ఈ సెషన్ లో రవీంద్ర జడేజా ఒక వికెట్ తీస్తే, పేసర్ మొహ్మద్ షమీ రెండు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు తీసి కివీస్ ను చావు దెబ్బకొట్టాడు. దాంతో న్యూజిలాండ్ కు ఘోర పరాజయానికి స్వాగతం పలకగా,197 పరుగుల తేడాతో  భారత్ 'చారిత్రక' విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 318 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇందులో విజయ్ (65), పుజారా (62), జడేజా (42 నాటౌట్), అశ్విన్ (40) పరుగులు చేశారు. 
అనంతరం కివీస్ మొదటి ఇన్నింగ్స్ ఆటను ప్రారంభించింది.  విలియమ్సన్ (75), టామ్ లాథమ్ (58) పరుగులు చేశారు.  262 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో భారత్ బౌలర్ జడేజా ఐదు వికెట్లు తీయగా అశ్విన్ నాలుగు వికెట్లు తీశాడు.
 అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మెన్స్ విజృంభించారు. ఓపెనర్ రాహుల్ (38) విజయ్ (76) ధాటిగా ఆటను ప్రారంభించారు. పుజారా (78), కోహ్లీ (18), రహానే (40)లు పరుగులు చేశారు. మొత్తం 5 వికెట్లు కోల్పోయిన భారత్ 377 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. శర్మ (68 నాటౌట్), జడేజా (50 నాటౌట్) గా మిగిలారు.

434 పరుగుల లక్ష్యం..
434 పరుగుల లక్ష్య చేధనతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఆటను ఆరంభించింది.  రోంచీ (80), శాంట్నర్ (71) పోరాటం చేశారు. కానీ మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివరకు 236 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ ఆరు వికెట్లు, షమీ రెండు, జడేజా ఒక వికెట్ తీశారు. చారిత్రక 500 టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం సాధించడం పట్ల క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి