29, జూన్ 2011, బుధవారం

ఇకపై చేతులు ఊపుకుంటూ మార్కెట్‌కు వెళ్లడం కుదరదు....


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుడా ఇకపై చేతులు ఊపుకుంటూ మార్కెట్‌కు వెళ్లడం కుదరదు. పాల ప్యా కెట్ కోసమో, వంట సరుకుల కోసమో కిరాణా దుకాణాలకు బయలుదేరడం ఇకముందు సాధ్యం కాకపోవచ్చు.  ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం అమల్లోకి రానుండటమే దీనికి కారణం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీహెచ్ఎంసీ..ప్లాస్టిక్ సంచుల వాడకంపై పాక్షిక నిషేధం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి మనం మద్దతు పలుకుద్దాం.             
           40 మైక్రాన్ కన్నా తక్కువ మందం ఉండే సంచులపై వేటుకు పరిమితమయింది. జూలై 1 నుంచి గట్టిగా నిషేధం అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతోంది. ఈ వివరాలను కార్పొరేషన్ కమిషనర్ కృష్ణబాబు మీడియాకు వెల్లడించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులతో పాటు ప్లాస్టిక్‌కప్పులు, కవర్లను నిషేధిస్తున్నట్టు తెలిపారు. పూర్తి నిషేధం అంశంపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్నారు.  పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖతో పాటు న్యాయనిపుణులతో చర్చించి.. 40 మైక్రాన్లలోపు పరిమితిని విధించామన్నారు.  బవిష్యత్ లొ ఐన పూర్తి నిషేధం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాం ,జీహెచ్ఎంసీ చర్యలు  తిసుకొవాలి
      
             మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది.  వాతావరణ సమతుల్యం కోల్పోయి ఓజోన్‌పొర దెబ్బతినడం వల్ల పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  దీంతో క్యాన్సర్, చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి.  ప్రతి ఒక్కరూ విధిగా ఇంటి ఆవరణలో చెట్లను నాటాలి, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలి, వాహన కాలుష్యం తగ్గించాలి.  పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం  మనందరి మీద ఉంది.
          ఒకరికి ఒకరు  తోడైతే మన పర్యావరణాన్ని ఈ కాలుష్య భూతానికి బలికాకుండా కాపాడగలుగుతాం. మన కాలనీలలో, మనం వుండే గృహ సముదాయాలలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులతో పాటు ప్లాస్టిక్‌కప్పులు, కవర్లను నిషేద్దన్ని అమలు  పై అవగాహన కల్పించి ఈ సత్కార్యానికి చేయూతనిస్తే మన భూమిని మరుభూమి కాకుండా చూడగలుగుతాం. 
          అందుకే రండి.. ఆ ఆనందం లో మనమూ పాలుపంచుకొని, మనవంతు పని మనం చేసి మన తరువాతి తరాలకు పచ్చని పర్యావరణాన్ని శోభాయమానంగా అందిద్దాం..!

(  పత్రికల  సహకారంతో ...)

3 వ్యాఖ్యలు:

  1. ఈ కార్యక్రమాన్ని మా తాడిపత్రిలో 5 సంవత్సరాల క్రితమే ప్రారంభించారు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. మీరు, మరికొన్ని మున్సిపాలిటిలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులతో పాటు ప్లాస్టిక్‌కప్పులు, కవర్లను నిషేద్దన్ని అమలు చెస్తున్నందుకు థ్యాంక్స్.
    మీరు మేము అందరు కలసి పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మనవంతు పని మనం చేసి మన తరువాతి తరాలకు పచ్చని పర్యావరణాన్ని శోభాయమానంగా అందిద్దాం..!

    ప్రత్యుత్తరంతొలగించు