29, జులై 2011, శుక్రవారం

అమెరికాలో మరో బూటకపు యూనివర్శిటీ...!

వాషింగ్టన్‌ నగర శివార్లలో వున్న ఒక బూటకపు యూనివర్శిటీపై అమెరికా అధికారులు గురువారం దాడి చేశారు. ఈ యూనివర్శిటీ విద్యార్ధుల్లో 90 శాతం మంది భారత్‌కు చెందిన వారే కావటం విశేషం. కాగా అందులో అధిక సంఖ్యాకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని తెలుస్తోంది.
                       వాషింగ్టన్‌ నగర శివార్లలో వర్జీనియా రాష్ట్రంలోని అన్నాడేల్‌లో వున్న ఈ యూనివర్శిటీలో దాదాపు 2,400 మంది విద్యార్ధులున్నారు.  అయితే ఈ దాడిపై స్పందించేందుకు నిరాకరించిన యూనివర్శిటీ పాలక వర్గం తమ విద్యార్ధులు ఇతర యూనివర్శిటీలకు బదిలీ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రవేశద్వారం ముందు ఒక నోటీసు అంటించింది. తాము తాత్కాలికంగా విదేశీ విద్యార్ధులెరినీ చేర్చుకోవటం లేదంటూ మరో నోటీసును అంటించింది. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధికారులు కేలిఫోర్నియాలోని ట్రైవ్యాలీ యూనివర్శిటీపై దాడులు చేసి దానిని మూసివేయించిన విషయం తెలిసిందే. ఇమిగ్రేషన్‌ అవకతవకలకు పాల్పడిందంటూ ఈ యూనివర్శిటీని మూసివేసిన ఫలితంగా దాదాపు వెయ్యికి పైగా భారత విద్యార్ధుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది. ఈ వరుసలో ఇది రెండో యూనివర్శిటీ కావటం విశేషం. ట్రైవాలీ యూనివర్శిటీలో భారత విద్యార్ధులను అమెరికా అధికారులు పరిగణించిన తీరును దృష్టిలో వుంచుకున్న భారత ప్రభుత్వం ఈసారి విద్యార్ధులకు ఎటువంటి వెసులుబాటూ కల్పించని ఫెడరల్‌ అధికారుల వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అయితే విద్యార్ధులను అరెస్ట్‌ చేయటం లేదా నిర్బంధించటం లేదా ఎలక్ట్రానిక్‌ మానిటరింగ్‌ పరికరాలను ఏర్పాటు చేయటం వంటి చర్యలేవీ తీసుకోబోమని అమెరికా అధికారులు ఇక్కడి రాయబార కార్యాలయానికి హామీ ఇచ్చారు. విద్యార్ధులను ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చూసేందుకు ఇక్కడి భారత రాయబార కార్యాలయం అమెరికా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
           
( ప్రజాశక్తి ,ఈనాడు పత్రిక సౌజన్యం తో...  )

22, జులై 2011, శుక్రవారం

మన హైదరాబాదిలకి ఖేల్ రత్న, అర్జున్ అవార్డులు ...

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు గగన్ నారంగ్‌కు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాజీవ్ ఖేల్­రత్న అవార్డును ప్రకటించింది. బీజింగ్ ఒలంపిక్స్ లో  మన దేశం తరుపున  స్వర్ణం సాధించినారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో గగన్ నాలుగు స్వర్ణాలు సాధించినారు. దేశ క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు.  అలాగే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు  అర్జున్ అవార్డుకు ఎంపికయ్యారు.    

అర్జున్ అవార్డుకు ఎంపికైనవారు : జహీర్ ఖాన్ (క్రికెట్), రాహుల్ బెనర్జీ (విలువిద్య), ప్రీజా శ్రీధరన్ (అథ్లెటిక్స్), జ్వాలా గుత్తా (బ్యాడ్‌మింటన్), సురంజయ్ సింగ్ (బాక్సింగ్), సునీల్ శెట్టి (ఫుట్‌బాల్), రాజ్‌పాల్ సింగ్ ( హాకీ), రాకేష్ కుమార్ (కబాడీ), తేజశ్వనీ సావంత్ (షూటింగ్), విర్ధవల్ ఖాడే ( స్విమ్మింగ్), ఆసిష్ కుమార్ (జిమ్నాస్టిక్స్), సోమ్‌దేవ్ (టెన్నీస్), రవీందర్ సింగ్ (కుస్తీ), వికాస్ గౌడ (అథ్లెటిక్స్), సంధ్యారాణి ( ఉషు), ప్రశాంత కర్మాకర్ (స్విమ్మింగ్), సంజయ్ కుమార్ (వాలీబాల్), తేజశ్వనీ (కబాడీ) తదితరులు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. 


( పత్రికలు , గూగ్ల్స్   సహకారంతో ...)

21, జులై 2011, గురువారం

వేలెత్తి చూపకుండా వేలు పట్టుకుని నడిపించండి....


పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు వేలెత్తి చూపకుండా వారిని వేలు పట్టుకుని నడిపించటం ద్వారా సరైన దిశానిర్దేశం చేయాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్‌ బివి పట్టాభిరామ్‌ సూచిం చారు. పిల్లలు వివిధ అంశాల్లో రాణించినప్పుడు మెచ్చుకోవటం, మంచి పనులు చేసినప్పుడు వారిని ప్రశంసించటం ద్వారా వారి భవిష్యత్తుకు పునాది వేయాలని కోరారు. ఎదుగుతున్న పిల్లల శారీరక, మానసిక సమస్యల్ని అర్థం చేసుకోవటం, పరిష్కార మార్గాల్ని చూపటం ద్వారా వారిలోని మానసిక ఒత్తిడిని దూరం చేయాలన్నారు. 'పిల్లల భవిష్యత్తు- తల్లిదండ్రుల బాధ్యత' అనే అంశంపై హైదరా బాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం శాసనమండలి సభ్యులు చుక్కా రామయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో బివి పట్టాభిరామ్‌ ప్రధాన వక్తగా ప్రసంగిస్తూ గతంలో సైకియాట్రిస్టుల వద్దకు ప్రేమలో వైఫల్యాలు, భార్యాభర్తల విడాకుల కేసులు, వరకట్న వేధింపుల్లాంటి కేసులు ఎక్కువగా వచ్చేవని, అయితే ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య బాగా తగ్గిందని చెప్పారు. ఇదే సమయంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య మనస్పర్థలు పెరగటం, వారి మధ్య సంబం ధాలు దెబ్బతిని అగాధం పెరిగిపోవటంలాంటి కేసులు 70 శాతం వరకూ వస్తున్నాయని చెప్పారు. అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ పిల్లల్ని సహజంగా పెరగనీయకపోవటం వల్ల వారిలో సున్నితత్వం దెబ్బ తింటోందని పట్టాభిరామ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 








19, జులై 2011, మంగళవారం

పేదల నెత్తిన పిడుగు...ఆధార్‌?

పౌరులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇచ్చే ఆధార్‌ కార్డులు కేంద్రం, ప్రణాళికా సంఘం చేపడుతున్న చర్యలు భవిష్యత్తులో పేదలను నిరాధారులుగా మార్చనున్నాయి. సంక్షేమ పథకాలకు ఆధార్‌ కార్డు తప్పనిసరి చేయాలన్న నిర్ణయం వెనుక సబ్సిడీలను కుదించే కుట్ర దాగుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జారీ చేస్తున్న ఆధార్‌ కార్డు ప్రజలకు ముఖ్యంగా పేదలకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగ పడుతుందని యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ అధినేత నందన్‌ నిలేకని చెపుతున్నారు. సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లు ప్రభుత్వ పథకాల్లో లీకేజీలు, అవినీతి, అక్రమాల నిరోధం అన్నింటికీ ఆధార్‌ కార్డే ఏకైక అస్త్రమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. నిలేకని చెప్పినట్లు పేదలకు ఆధార్‌ కార్డులు ఉపయోగ పడతాయన్న గ్యారంటీ అయితే లేదు. కాని వారికి అందుతున్న సబ్సిడీలను కోయడానికి సర్కార్‌కు ఆధార్‌ కార్డు కత్తెరలా పనికొస్తుంది. బ్యాంక్‌ అక్కౌంట్‌, రేషన్‌ పొందడానికి సైతం గుర్తింపు పత్రాల్లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు,  వారి సమస్యలను తీర్చడానికే ఆధార్‌ కార్డులిస్తున్నాం అని గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ప్రధాని మన్మోహన్‌ వక్కాణించారు. ప్రభుత్వ పథకాలను అనర్హులు అనుభవిస్తున్నారని, సబ్సిడీలను అర్హులకు చేర్చడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. సబ్సిడీలు అర్హులకు అందాలన్న విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండదు. అనర్హులను ఏరివేసే పేరుతో అర్హులను పథకాలకు దూరం చేస్తేనే సమస్య. నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్న మన్మోహన్‌ సర్కార్‌ ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలకు ఏ విధంగా కోత పెట్టాలా అన్న రంధిలో ఉంది. నగదు బదిలీ వంటి వాటిని తెరమీదికి తెచ్చింది. ఎప్పుడు ఏ మార్గంలో సబ్సిడీలకు కోత పెడుతుందో తెలీక ప్రజలు ఆందోళన చెందుతున్నరు.  వారి నెత్తిన పడటానికి ఆధార్‌ పిడుగు సిద్ధంగా ఉంది.

15, జులై 2011, శుక్రవారం

నింగిలోకి దోసుకెళ్లినా పీఎస్‌ఎల్‌వీ సీ-17


పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌దావన్‌ అంతరిక్ష ప్రయోగం షార్‌ నుంచి ఈరోజు సాయంత్రం పీఎస్‌ఎల్‌వీ-సీ17 రాకెట్‌ను ప్రయోగించారు. 1410 కిలోల  బరువున్న సమాచార  ఉపగ్రహం జీ శాట్ -12  ఈది   నింగిలొకి  మొసుకెల్లింది.  విజయవంతగా జీ శాట్ -12 కక్ష్యలోకి ప్రవేశించడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు.

                 ఈ రాకెట్‌ 295 టన్నుల బరువు, 44 మీటర్ల ఎత్తు ఉంటుంది. నాలుగు దశల్లో ఈ రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దోసుకెళ్లింది. భూమికి 26వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర మధ్యంతర కక్ష్యలోకి అంతరిక్షంలోకి దూసుకెళుతుంది.  గ్రామీణ సమాచార వ్యవస్థ మరింత పటిష్టతను చేసే జీశాట్‌-12 ఉపగ్రహం నింగిలోకి మోసుకెళ్లింది. 200 కోట్ల రూపాయల వ్యయంతో జీ-12ను రూపొందించారు.  జీశాట్‌-12 ఎనిమిదేళ్లపాటు సేవలు అందించనుంది.  ఇది చారిత్రాక విజయం అని ఇస్రోవర్గాలు అంటున్నాయి. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 19వ ప్రయోగం.  భారత జాతికే ఈ ప్రయోగం గర్వకారణమని శాస్తవేత్తలు  అన్నారు. ఈది  పూర్తిగా  స్వదేసి పరిజఞనంతో  రూపొందించారు.


9, జులై 2011, శనివారం

నేటి యువతను అలోచింపచేశారు....

నేడు యువత రకరాకాల మార్గాలలో నాడుస్తున్నారు. సమాజం కోసం, పేదల కోసం అలోచించే వారు చాలా చాలా  తక్కువ. మారీ ఈపుడు వున్నా కాలంలో ప్రతిది డబ్బులతో  నాడుస్తున్నది. కాని మన యువకుడు  ప్రపంచంలోని నేటి యువతను అలోచింపచేశారు.... 

 ఈనాడు  సహకరంతో...

7, జులై 2011, గురువారం

నాడు చెలమని...నేడు చెల్లని కాని....

ఒక్కపుడు అందరిలో బగా చెలమని
నేడు ఎక్కడ చెల్లని నాణెమైంది.
అదే చెల్లని చారాన.
పనికిరాని పావలా
ఇక ఇలలో వుండని పావలా..












































































1, జులై 2011, శుక్రవారం

హై స్పీడ్ తో దుసుకుపొతున్న చైనా...

గత కొన్ని సంవత్సరాల కాలంలో చైనాలో సోషలిస్టు ఆధునికీకరణ కొనసాగుతున్నది. ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచటం ద్వారా ఉత్పాదక శక్తుల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. బలమైన చైనా నేడు అవతరించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం అన్ని దేశాలను ఆవహించింది. చైనా దానిని తట్టు కున్నది. చైనా కమ్యూనిస్టుపార్టీ ఒక పరిపక్వత చెందిన మార్క్సిస్టు పాలకపార్టీగా నేడు నిలబడింది.
            
90 సంవత్సరాలుగా పార్టీ ప్రజలతో మమేకమై చేసిన కృషి సత్ఫ లితాలనిచ్చింది. అత్యధిక ప్రజల ప్రయోజనాలను  కాపాడింది. పార్టీ సరైన పంథాని రూపొందించుకుని, సూత్రా లకు కట్టుబడి ప్రజలతో కలిసి వుంటే మరిన్ని  ఐన సవాళ్ళను ఎదుర్కోగలదు.