22, జులై 2011, శుక్రవారం

మన హైదరాబాదిలకి ఖేల్ రత్న, అర్జున్ అవార్డులు ...

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు గగన్ నారంగ్‌కు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాజీవ్ ఖేల్­రత్న అవార్డును ప్రకటించింది. బీజింగ్ ఒలంపిక్స్ లో  మన దేశం తరుపున  స్వర్ణం సాధించినారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో గగన్ నాలుగు స్వర్ణాలు సాధించినారు. దేశ క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు.  అలాగే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు  అర్జున్ అవార్డుకు ఎంపికయ్యారు.    

అర్జున్ అవార్డుకు ఎంపికైనవారు : జహీర్ ఖాన్ (క్రికెట్), రాహుల్ బెనర్జీ (విలువిద్య), ప్రీజా శ్రీధరన్ (అథ్లెటిక్స్), జ్వాలా గుత్తా (బ్యాడ్‌మింటన్), సురంజయ్ సింగ్ (బాక్సింగ్), సునీల్ శెట్టి (ఫుట్‌బాల్), రాజ్‌పాల్ సింగ్ ( హాకీ), రాకేష్ కుమార్ (కబాడీ), తేజశ్వనీ సావంత్ (షూటింగ్), విర్ధవల్ ఖాడే ( స్విమ్మింగ్), ఆసిష్ కుమార్ (జిమ్నాస్టిక్స్), సోమ్‌దేవ్ (టెన్నీస్), రవీందర్ సింగ్ (కుస్తీ), వికాస్ గౌడ (అథ్లెటిక్స్), సంధ్యారాణి ( ఉషు), ప్రశాంత కర్మాకర్ (స్విమ్మింగ్), సంజయ్ కుమార్ (వాలీబాల్), తేజశ్వనీ (కబాడీ) తదితరులు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. 


( పత్రికలు , గూగ్ల్స్   సహకారంతో ...)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి