30, ఏప్రిల్ 2011, శనివారం

మరోచరిత్ర సృష్టించరు....

          అజరామరమైన ప్రేమకథలను, మధ్య తరగతి జీవన చిత్రాలను ఎంతో హృద్యంగా వెండితెరపై ఆవిష్కరించిన అతికొద్దిమంది దర్శకుల్లో బాలచందర్‌ ఒకరు. ఈప్పటికె ఎన్నొ అవార్దులు అందుకున్న బాలచందర్‌ గారు మరోచరిత్ర  సృష్టించరు.

భారతీయ సినీరంగంలో విశేష కృషి సల్పిన వారికిచ్చే, అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కే   ప్రముఖ తమిళ దర్శకుడు కె.బాలచందర్‌కు దక్కింది. 2010 సంవత్సరానికి గాను ఈ అవార్డును భారత ప్రభుత్వం అందజేస్తోంది.  మంచి సినీమాల  దర్శకుడిగా  సినీరంగంలో రాణించిన వారు అరుదుగా ఉంటారు.  కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌...... వంటి గొప్ప నటులను వెండితెరకు అందించారు. దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం వచ్చిన సంద్భంగా వారికి మాన   అందరి అభినందనలు . 
    ఆయన దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలలో ...లోకం మారాలి(1973),  మరోచరిత్ర(1978), గుప్పెడు మనసు(1979), తొలి కోడి కూసింది(1981), ఆకలిరాజ్యం(1971)...,  లాంటి అపురూప చిత్రాలు వున్నాయి.
( గూగ్ల్స్ ఇమేజ్స్, పత్రిక ల సహకరం తొ.....)

తెలుగు సాహిత్య ప్రపంచంలొ ఉదయించిన ఏర్రని సూర్యుడు.... శ్రీశ్రీ

ఉవ్వెత్తున విప్లవ జ్వాలలు రగిలించిన అక్షర సూరీడు శ్రీశ్రీ
సాహితీ వినీలాకాసంలో ఉదయించి అస్తమించని ఎర్ర సూరీడు శ్రీశ్రీ

                   ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ.  శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.

                  శ్రీశ్రీ అద్భుత సృష్టి, ఈ మహా ప్రస్థానం, ఇది వెలుబడిన తరువాత తెలుగు సాహిత్యపు ప్రస్థానానికే ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మహా ప్రస్థానానికి ముందు, మహా ప్రస్థానానికి తరువాత అని విభజించవచ్చు అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.ఇది ఒక అభ్యుదయ కవితా సంపుటి.  ఇందులో శ్రీశ్రీ కార్మిక కర్షిక శ్రామిక వర్గాలను ఉత్తేజితులను చేస్తూ, నూతనోత్సాహం కలిగిస్తూ, ఉర్రూతలూగిస్తూ గీతాలు వ్రాసినాడు. ఇది తెలుగు కవితకే ఓ మార్గదర్శి అయినది.

మరో ప్రపంచం,
    మరో ప్రపంచం,
    మరో ప్రపంచం పిలిచింది!
    పదండి ముందుకు,
    పదండి త్రోసుకు!
    పోదాం, పోదాం పైపైకి!

    కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,దారిపొడుగునా గుండె నెత్తురులు
    తర్పణచేస్తూ పదండి ముందుకు!
    బాటలు నడచీ,
    పేటలు కడచీ,
    కోటలన్నిటిని దాటండి!
    నదీ నదాలూ,
    అడవులు, కొండలు,
    ఎడారులా మన కడ్డంకి?

    పదండి ముందుకు!
    పదండి త్రోసుకు!
    పోదాం, పోదాం, పైపైకి!.....    



తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించాడు." తెలుగువీరాలెవరా(అల్లూరి సీతారామరాజు) " అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. 

సినిమాకు ఆయన రాసిన కొన్ని ప్రముఖ సినిమా పాటలు

 మనసున మనసై   (డాక్టర్ చక్రవర్తి) 

హలో హలో ఓ అమ్మాయి   (ఇద్దరు మిత్రులు) 

నా హృదయంలో నిదురించే చెలి   (ఆరాధన) 

తెలుగువీరాలెవరా(అల్లూరి సీతారామరాజు) 

పాడవోయి భారతీయుడా (వెలుగు నీడలు)...

   నేడు 102 శ్రీశ్రీ జన్మదినం  
( గూగ్ల్స్ ఇమేజ్స్, వి కీ పీ డి య, పత్రిక ల సహకరం తొ.....)

28, ఏప్రిల్ 2011, గురువారం

మంచి వేసవి విడిది కేంద్రంగా..

1.ఊటీ : తమిళనాడులో నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ది గాంచిన పర్యాటక కేంద్రం మరియు పట్టణం. నీలగిరి జిల్లాకు ప్రధాన పట్టణం. ఉదకమండలం అనేది దీని అధికారిక నామం. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఇది మంచి వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు.
ప్రాచీన కాలంలో నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. తరువాత గంగ వంశ రాజుల ఆధీనంలోకి మారాయి. తరువాత 12వ శతాబ్దంలో హోయసాల వంశ రాజైన విష్ణువర్థనుడి స్వాధీనంలో ఉన్నాయి. చివరకు టిప్పు సుల్తాన్ అధీనంలోకి వచ్చి, 18వ శతాబ్దంలో ఆంగ్లేయులకు అప్పగించబడ్డాయి. పక్కనే ఉన్న కోయంబత్తూర్ ప్రావిన్సు కు గవర్నరుగా ఉన్న జాన్ సుల్లివాన్ ఊటీ చల్లటి వాతావరణం, మరియు అడవులను చూసి ముచ్చటపడి, అక్కడ నివసిస్తున్న కోయజాతి తెగలకు అతి తక్కువ పైకాన్ని చెల్లించి చాలా స్థలాన్ని కొన్నాడు. నెమ్మదిగా ఈ స్థలాలు ఆంగ్ల ప్రైవేటు వ్యక్తుల పరం కావడంతో త్వరత్వరగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. మద్రాసు సంస్థానానికి వేసవి రాజధానిగా మారింది. మద్రాసు సంస్థానం సహకారంతో ఇక్కడ ప్రముఖ ఆంగ్లేయులు కొండల మద్య మెలికలు తిరిగే రహదారులు, సంక్లిష్టమైన రైలు మార్గాల్ని నిర్మించారు. ఈ పట్టణం సముద్ర మట్టం నుంచి 2,240 మీటర్ల ఎత్తులో ఉండటంతో ప్రముఖ వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. దీని అద్భుత సౌదర్యం, ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు మొదలైన వాటికి ముగ్ధులైన ఆంగ్లేయులు దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుచుకునే వారు.

చూడవలసిన ప్రదేశాలు  :     బొటానికల్ గార్డెన్స్,            దొడ్డబెట్ట శిఖరం                  ఊటీ బోట్‌హౌస్              కాఫీ తోటలు


2. కోయంబత్తూరు : 
కోవై అని కూడా పిలుస్తారు .  తమిళనాడు రాష్ట్రములోని రెండవ అతిపెద్ద నగరం. కోయంబత్తూరు జిల్లా యొక్క ముఖ్యస్థానమైన ఈ నగరం దక్షిణ భారత మాంచెస్టర్ గా పేరుగాంచినది. ఇది తమిళనాడులోని కొంగునాడు ప్రాంతములో భాగము. నొయ్యల్ నది తీరాన ఉన్న కోయంబత్తూరు నగరం, వస్త్ర పరిశ్రమలకు, ఇంజనీరింగు కర్మాగారాలకు, వాహన విడిభాగాల నిర్మాణకేంద్రాలకు, వైద్య సౌకర్యాలకు, విద్యాసంస్థలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆతిధ్యానికి మరియు ప్రత్యేకత కలిగిన కొంగు తమిళ మాండలికానికి ప్రసిద్ధి చెందినది.

కోవన్ అనే రాజు పరిపాలించడం వలన కోవన్‌పుతూర్ అన్న పేరు వచ్చిందని ఒక వివరణ ఉన్నది. ఈ పేరు ఆంగ్లీకరణ చెంది కోయంబత్తూర్ అయ్యిందని భావిస్తున్నారు. ఆధునిక యుగంలో కొన్నిసందర్భాలలో ఈ పేరును రైల్వే స్టేషను కోడును అనుసరించి సిబిఈగా క్లుప్తీకరించడం జరుగుతున్నది.

3. కొట్టాయం :  భారతదేశంలోని కేరళ రాష్ట్రం యొక్క ఒక నగరం. ఇది కేరళ రాష్ట్ర మధ్యభాగంలో ఉంది మరియు కొట్టాయం జిల్లా పరిపాలనా కేంద్రం. 2001 జనాభా లెక్కల ప్రకారం కొట్టాయం జనాభా 60,725గా అంచనా వేయబడింది. ఈ పట్టణం, సుగంధ ద్రవ్యాలు మరియు వాణిజ్య పంటలకు, ప్రత్యేకించి రబ్బర్ కు ప్రధాన వ్యాపార కేంద్రం. మలయాళ మనోరమ మరియు దీపిక వంటి కేరళ యొక్క ప్రధాన ప్రచురణ మాధ్యమానికి ఈ నగరం ముఖ్య కేంద్రం. కేరళలో ఆధునిక విద్యకు మార్గదర్శిగా, ఈ నగరం 1989లో భారతదేశంలో 100% అక్షరాస్యత సాధించిన మొదటి పురపాలక సంస్థగా మారింది మరియు భారతదేశంలో మొదటి పొగాకు రహిత జిల్లా అయింది. ముద్రణా మాధ్యమం మరియు సాహిత్యంలో ఈ నగరం యొక్క సేవను పరిగణించి కొట్టాయం "అక్షర నగరి(അക്ഷര നഗരി) " అనగా "అక్షరాల నగరం" అని కూడా పిలువబడుతుంది.మొట్ట మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు చెంపిల్ అరయన్ అనంతపద్మనాభన్ వలియ అరయన్ కంకుమరాన్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కొచ్చిన్ కోట వద్ద 29 డిసెంబర్ 1808న పోరాడారు.చెంపిల్ అరయన్, వేలు తంబి దళవ యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు.

ముఖ్యమైన ప్రదేశాలకు దూరం: కొట్టాయం - శబరిమల - 100 కిమీ, కొట్టాయం - తెక్కడి - 114 కిమీ, కొట్టాయం - తిరువనంతపురం - 160 కిమీ, కొట్టాయం - గురువాయూర్ దేవస్థానం - 170 కిమీ,కొట్టాయం - కోచి - 67 కిమీ, కొట్టాయం - చెట్టికులంగర దేవస్థానం - 50 కిమీ, కొట్టాయం - కాలికట్ - 285 కిమీ, కొట్టాయం- తొడుపుజ - 55 కిమీ

4. తిరువనంతపురం, కేరళ రాష్ట్రానికి రాజధాని. దీనిని బ్రిటీషు పరిపాలనా కాలములో ట్రివేండ్రం అని పిలిచేవారు. ఇది ఒక రేవు పట్టణము. అనంతపద్మనాభస్వామి కొలువైవున్న దివ్యక్షేత్రం. ఈ ఆలయంలొనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి. ఆడవారు కుడా ఎటువంటి అధునాతన దుస్తులు ధరించరాదు. అందరు సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి.
ప్రధానాలయం మళయాళ సంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గాలిగోపురం ఆనుకొని చుట్టూ ప్రహారి నాలుగు ముఖద్వారాలతో నిర్మించబడింది. ఆలయంలో స్వమి ఊరేగింపుకై ప్రాంగణం నిర్మించబడింది. నాలుగు మూలల నాలుగు ఉయ్యాల మండపాలతో, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు. ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో 'పుష్కరిణి' చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది. ఆలయంలో శ్రీ నారసింహ, శాస్త (అయ్యప్ప), పార్థసారథి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది.
5 . కేరళ  :  భారత దేశంలో నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రము. కేరళ సరిహద్దులలో తూర్పు మరియు ఈశాన్య దిక్కులలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు, పడమర దిక్కున అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా కేరళలోనే ఉంది. దక్షిణ భారతంగా పరిగణించబడే నాలుగు రాష్ట్రాలలో కేరళ ఒకటి.

1947లో భారతదేశం స్వతంత్రమైనాక 1941 జూలై 1న తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాలను కలిపి తిరువాన్కూర్-కొచ్చిన్ ఏర్పరచారు. 1950 జనవరి 1న దీనిని ఒక రాష్ట్రంగా గుర్తించారు. ఇదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు రాష్ట్రం చేశారు. 1956 నవంబరు 1న, రాష్ట్రపునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేరళ రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీనుండి మలబార్‌ప్రాంతాన్ని (4 తాలూకాలు మినహా) వేరుచేసి తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలో కలిపారు. 1957లో క్రొత్త అసెంబ్లీ ఎన్నిల అనంతరం ఇ.ఎమ్.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికలద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే మొదటివాటిలో ఇది ఒకటి.
ఆ కమ్యూనిస్టు ప్రభుత్వం కార్మికులకు, కౌలుదారులకు అనుకూలమైన విధానాలను అనుసరించింది. తరువాతి ప్రభుత్వాలు కూడా ఇదే మార్గాన్ని అవలంబించారు.  ప్రజల జీవన ప్రమాణాలు ఈ కాలంలో గణనీయంగా అభివృద్ధి చెందాయి.
( వి కీ పీ డి య  సహకారంతో ...)

25, ఏప్రిల్ 2011, సోమవారం

23, ఏప్రిల్ 2011, శనివారం

ధోనీకి మరో అరుదైన గౌరవం..

'మిస్టర్ కూల్'గా పేరొందిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేందర్‌సింగ్ దోనీకి మరో   అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక 'టైమ్ మ్యాగజైన్'.. ఈ ఏడాదికి గానూ రూపొందించిన ప్రపంచంలోనే 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఈ జార్ఖండ్ కుర్రాడు 52వ స్థానం సంపాదించుకున్నాడు. 28 ఏళ్ల తరువాత భారత క్రికెట్ జట్టు ప్రపంచ్ కప్‌ను కైవసం చేసుకోవడానికి కారకుడైన దోనీపై టైమ్స్ పత్రిక.. ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించింది.

                తన పరిశోధనలతో పాత్రికేయ రంగంలో సంచలనాలను సృష్టిస్తున్న వెబ్‌సైట్ వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజ్‌కు ఈ జాబితాలో 9వ స్థానం లభించింది.  సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో విప్లవానికి తెరదీసిన 'ఫేస్‌బుక్' వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బెర్గ్ 6వ స్థానంలో నిలిచారు.  అరబ్బు ప్రపంచాన్ని కుదిపేసేలా.. ఈజిప్ట్‌లో ప్రజా విప్లవం రావడానికి ఆన్‌లైన్ ద్వారా దోహదపడ్డ 'గూగుల్' సంస్థ ఎగ్జిక్యూటివ్ వేల్ గోనిమ్‌కు ఈ జాబితాలో ప్రథమ స్థానం లభించింది. 
                కాగా.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, బ్రెయిన్ మ్యాపింగ్ నిపుణుడు వి.ఎస్.రామచంద్రన్, సామాజిక వేత్త అరుణా రాయ్‌లు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కాగా.. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షుజా పాషాకు కూడా ఈ జాబితాలో స్థానం (17వ స్థానం) దక్కింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం ఈ జాబితాలో.. 86వ స్థానంలోకి పడిపోయారు. మరో వైపు.. ఆయన ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి హిలరీ క్లింటన్ మాత్రం 43వ స్థానంలో ఉండటం విశేషం.  ( గూగ్ల్స్ ఇమేజ్స్, ఆంద్ర జ్యోతి పత్రిక ల సహకరం తొ.....)              

ధరిత్రీని కాపాడుదాం...

              మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది.  వాతావరణ సమతుల్యం కోల్పోయి ఓజోన్‌పొర దెబ్బతినడం వల్ల పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి .  దీంతో క్యాన్సర్, చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి.  ప్రతి ఒక్కరూ విధిగా ఇంటి ఆవరణలో చెట్లను నాటాలి, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలి, వాహన కాలుష్యం తగ్గించాలి.  పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం  మనందరి మీద ఉంది.
                 దేశంలోని అరుదైన పక్షి జాతులు, వన్యప్రాణులను కాపాడుకోవడానికి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలి.  అడవులను నరికేస్తే భవిష్యత్తులో మనుగడ ప్రశ్నర్ధకం అవుతుంది.

         ఒకరికి ఒకరు  తోడైతే మన పర్యావరణాన్ని ఈ కాలుష్య భూతానికి బలికాకుండా కాపాడగలుగుతాం. మన కాలనీలలో, మనం వుండే గృహ సముదాయాలలో ఈ విషయం పై అవగాహన కల్పించి ఈ సత్కార్యానికి చేయూతనిస్తే మన భూమిని మరుభూమి కాకుండా చూడగలుగుతాం.

         అందుకే రండి.. ఆ ఆనందం లో మనమూ పాలుపంచుకొని, మనవంతు పని మనం చేసి మన తరువాతి తరాలకు పచ్చని పర్యావరణాన్ని శోభాయమానంగా అందిద్దాం..!

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

నేడు ధరిత్రి దినోత్సవం

నేలమ్మ నేలమ్మ నెలమ్మ
     నీకు వేల వేల వందనాలమ్మ...
               
నేడు  ధరిత్రి దినోత్సవం.   ఏప్రిల్ 22న భూమి గురించి తెలుసుకోవటానికి ఇంకా మెచ్చుకోవటానికి ఈ రోజును కల్పన చేశారు.  పర్యావరణ  కోసం సన్దేశంతో 1970 లో ఆరంభించారు. ఇంకా దీనిని ప్రతిసంవత్సరం చాల దేశాలు జరుపుకొంటున్నాయి.
                  "భూమిదినము ఒక్కటే మొదటి పవిత్రమైన రోజు, ఇది అన్ని దేశాల మధ్య ఉన్న సరిహద్దులను అతిక్రమించినది, అయినప్పటికీ అందరి భౌగోళిక నిజాయితీలను కాపాడుతుంది, కాల మార్పులు, పర్వతాలు ఇంకా సముద్రాలు మధ్యన ఉన్నప్పటికీ ప్రపంచములోని ప్రజలందరినీ ఒక కారణము మీద ఏకము చేసింది, ప్రకృతిలోని సమ్మేళనాన్ని కాపాడటమే ఉద్దేశముగా మరియు సాంకేతికముగా విజయాలను సాధిస్తూ, కాలమును గణిస్తూ ఇంకా తక్షణము అకాశాము ద్వారా సమాచారము పంపుతోంది.
                      మానవుని వలన  భూగ్రహం మీద వేడి పెరిగి ( పరిశ్రమలు వెదజల్లే పొగలో ఉండే కార్బన్ డయాక్సైడ్ ) "గ్లోబల్ వార్మింగ్" కి దారి తీస్తుంది అని శాస్త్రీయంగా నిరూపించబడింది. దీని వల్ల వాతావరణంలో చల్ల ప్రమాదకర మార్పులు సంభవిస్తాయి, అవి మంచు కరగటం, ఒకేసారి భూమి యొక్క వీడి పెరగడం లేదా తగ్గటం, వాతావరణంలో మార్పులు మరియు సముద్ర మట్టంలో నీరు పెరగటం లాంటివి జరుగుతాయి.
              మన వంతు కరత్వంగా కాలుషన్ని తాగ్గిద్దాం. భూమిని కపదుద్దాం.
( గూగ్ల్స్ ఇమేజ్స్,  పత్రిక ల సహకరం తొ.....)

మన దేశంలో రోడ్దు ప్రమాదాల్లో రోజుకు లక్ష మరణాలు.

 రోడ్డు ప్రమాదాలు మన దేశంలో ఎన్ని ప్రాణాలు తీస్తున్నాయో తెలుసా..
          ప్రతిరోజూ దాదాపు లక్ష!.  ఉగ్రవాద దాడుల్లో సంభవించే మరణాలకు ఇవి 20 రెట్లు ఎక్కువ!. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి జీకే పిళ్లై తెలిపారు. సమర్ధమైన ట్రాఫిక్ నిర్వహణకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంతో విలువైన ప్రాణాలు పోవడంతోపాటు, నష్టపరిహారం పేరుతో ఏటా రూ. 10వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని పిళ్లై చెప్పారు. ( గూగ్ల్స్ ఇమేజ్స్,  పత్రిక ల సహకరం తొ.....)

బెంగాల్‌ కేరళల్లో విజయం దేశంలో వామపక్షాలకు కీలకం...ప్రకాశ్‌ కరత్‌

               అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి అంచనా వేయాల్సివస్తే బెంగాల్‌, కేరళ రాష్ట్రాలు దేశంలో వామపక్షాలకు చాలా ముఖ్యమైనవని ఈ రెండు రాష్ట్రాల్లో వామపక్షాల విజయం దేశ వ్యాపితంగా వామపక్ష, ప్రజాతంత్ర, ప్రత్యామ్నాయం కోసం లెఫ్ట్‌ సాగిస్తున్న నిరంతర పోరాటాలకు మరింత ఊపునిచ్చేందుకు తోడ్పడతాయని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ చెప్పారు.
            తమిళనాడు ఎన్నికల ఫలితాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుచేతనంటే ఇవి నయా ఉదారవాద - అవినీతి మధ్య అపవిత్ర పొత్తుకు నేరుగా తగిలే పెద్ద ఎదురు దెబ్బ కానుంది. అవినీతి- ఉదారవాద కలయికకు మొత్తంగా యుపిఏ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తున్నది.  కాబట్టి తమిళనాడు ఫలితాలు జాతీయ స్థాయిలో కూడా పెద్ద ప్రభావాన్నే చూపనున్నాయి.

               అవినీతి, ద్రవ్యోల్బణం ఇవి రెండూ జాతీయ స్థాయిలో ప్రధాన అంశాలు.  కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం వరుస కుంభకోణాల్లో మునిగి తేలుతుంటే, ఇంకోవైపు కేరళలో యుడిఎఫ్‌ను గతంలో చేసిన అవినీతి, తప్పుడు పనులు నీడలా దానిని వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు యుడిఎఫ్‌కు చెందిన మాజీ మంత్రికి ఒకరికి అవినీతి కేసులో సుప్రీం కోర్టు ఒక సంవత్సర జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై ప్రస్తుత ముఖ్యమంత్రి సుప్రీం కోర్టుకు అప్పీలు చేసి గట్టిగా పోరాడారు.
 
                అధిక ధరలు, అవినీతి  దేశ వ్యాపిత ప్రభావం చూపగల అంశాలు కనుక పశ్చిమ బెంగాల్‌ లోనూ ఇవి ప్రభావం చూపుతాయి. అవినీతి గురించి మరీ ముఖ్యంగా స్వతంత్ర భారతంలోనే అతి పెద్దదైన 2జి- స్పెక్ట్రమ్‌ కుంభకోణం బయటపడ్డాక ప్రజలు దీనిపట్ల చాలా మెలకువగా వున్నారు.  గడచిన అయిదేళ్లలో అది అనేక ముఖ్యమైన చర్యలు చేపట్టింది. ఈ కాలంలో 20 వేల ఎకరాల భూమిని భూమిలేని నిరుపేదలకు పునః పంపిణీ చేసింది. అఖిలభారత స్థాయిలో వ్యవసాయ వృద్ధి రేటులో స్తబ్ధత నెలకొన్న స్థితిలో బెంగాల్‌ నికరమైన వృద్ధిరేటు సాధించింది. వ్యవసాయోత్పత్తి లో పెరుగుదల జాతీయ సగటు కన్నా చాలా అధికంగా ఉన్నది. రెండవది, లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం అధిక ధరల మూలంగా ప్రజలకు ఎదురైన కడగండ్లను తొలగించేందుకు పలు చర్యలు చేపట్టింది. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఇందులో అతి ముఖ్యమైనది. మూసివేసిన ఫ్యాక్టరీలలో కార్మికులకు నెలకు రు.1500 అలవెన్సు ఇచ్చే ఏర్పాటు చేసింది. అసంఘటిత రంగ కార్మికులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ సదుపాయాన్ని కల్పించింది.  కేంద్ర ప్రభుత్వ విధానాల దుష్ప్రభావాల నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రతి సందర్భంలోనూ లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో వీటిని హైలైట్‌ చేస్తాము.
          బెంగాల్‌లో వామపక్షాలు ఒక బలమైన శక్తిగా ఉన్నాయి. వామపక్షాలను తొలగించాలని అనుకున్నప్పుడల్లా తృణమూల్‌ మావోయిస్టులతో చేతులు కలిపింది. ఏ కారణం చేతనో కానీ కొందరు మేధావుల్లో కూడా ఇటువంటి కలయికే జరిగింది. ఇటువంటి వారే మమతా బెనర్జీని విప్లవ రాజకీయవేత్తగా చిత్రిస్తున్నారు. మార్పు కోసం అన్ననినాదం కూడా క్షణభంగురం పాటు ఉండేదే. చివరికి ఈ మితవాద శక్తుల, మేధావుల, వారి సూత్రీకరణల అసలు బండారం బయటపడక మానదు.
( గూగ్ల్స్ ఇమేజ్స్,  పత్రిక ల సహకరం తొ.....)

21, ఏప్రిల్ 2011, గురువారం

కులం పేరుతో పిలిచినా నేరమే ...సుప్రీంకోర్టు

                   దళితులను అవమానించే ఉద్దేశంతో వారిని కులం పేరుతో పిలవడం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నేరమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తమిళనాడులో ఇద్దరు వ్యక్తులను దోషులుగా నిర్ధారించడం సబబేనని చెప్పింది. ఇప్పటికీ అక్కడ 'రెండు గ్లాసుల' విధానం అమలులో ఉందని, ప్రభుత్వం ఈ జాడ్యాన్ని వదిలించకపోతే సంబంధిత పోలీసు, పౌర అధికారులు ఈ చట్టం కింద విచారణకు గురికావల్సి వస్తుందని జస్టిస్ మార్కండేయ కట్జు, జస్టిస్ జ్ఞానసుధా మిశ్రాలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది.

              ఆధునిక సమాజంలో ఇలాంటి కులవివక్ష ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సంప్రదాయ జల్లికట్టు ఉత్సవ సమయంలో బాధితులను నిందితులు తిట్టారు. ఆధునిక కాలంలో ఏ ఒక్కరి మనసునూ గాయపరచకూడదని, వాళ్ల కులం.. మతం.. తెగ.. భాషల ఆధారంగా తిట్టకూడదని కోర్టు చెప్పింది. అప్పుడు మాత్రమే మన దేశం సమైక్యంగా, బలంగా ఉంటుందని తెలిపింది. ఈ కేసులో నిందితులు అనాగరిక పద్ధతుల్లో ప్రవర్తించారని, అందువల్ల వారు క్షమాభిక్షకు ఏమాత్రం అర్హులు కారని.. అందువల్ల వారి అప్పీలును కొట్టేస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. 
(  పత్రిక ల సహకరం తొ.....)

సోషలిజాన్ని కాపాడాలనే ప్రజల శాశ్వత ఆకాంక్షను నెరవేర్చాలి

           క్యూబా ఆరో మహాసభ ముగింపు సమావేశంలో  క్యూబా విప్లవ నేత ఫైడల్‌ కాస్ట్రో పాల్గొన్నారు.  వారు మాట్లాడుతూ నా ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా వున్నదని నాకు తెలుసు. కాని నేను ప్రశాంతంగానే వున్నాను. విప్లవం పురోగమిస్తూనే వుంది. సోవియట్‌ యూనియన్‌ అదృశ్యమైనప్పుడు నా జీవితంలో అది సంక్లిష్టసమయం. 2001 నుండి బుష్‌ అధికారంలో వున్నప్పుడు కిరాయి మూకలను పంపించి మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూశారు. ఇప్పుడు క్యూబాకి తోడు వెనిజులాలో మరొక విప్లవం జయప్రదమైంది. యాంకీలకు మింగుడు పడటంలేదు. వెనిజులా, క్యూబాల మధ్య స్నేహసం బంధాలు, సహకారం చరిత్రలో విప్లవ శక్తులకు ఒక ఉదాహరణగా నిలుస్తాయి.
           ప్రతిరోజూ నేను ప్రపంచ పరిణామాలను శ్రద్ధగా పరిశీలిస్తున్నాను. రాజకీయ పార్టీలు, మానవుల నడవడికల్లో వివేకవంతమైన చర్యలను చూశాను. పొరపాట్లు చూశాను. గత 50 సంవత్సరాల్లో చాలా ఉదాహరణలు వున్నాయి. నేను చెప్పేది సూటిగానే ఉందని అనుకుంటున్నాను. క్యూబా విప్లవకారులు ఒక ప్రాథమిక కర్తవ్యాన్ని గుర్తుంచుకోవాలి. చిన్నదేశం పెద్ద క్లిష్టపరిస్థితుల్లో వుంది. తప్పులను నివారించటం ముఖ్యం  అని  చెప్పారు.
                క్యూబా ప్రజల ఐక్యతను,  సోషలిజాన్ని కాపాడాలనే ప్రజల శాశ్వత ఆకాంక్షను నెరవేర్చేందుకు మూల స్థంభాలైన సార్వభౌమత్వం, స్వాతంత్య్రాన్ని విస్మరించరాదని మహాసభ పేర్కొన్నారు. ప్రజాధికార సంస్థల నాయకత్వాన్ని, దేశ ఎన్నికల, రాజకీయ, పాలనా వ్యవస్థలను పరిపూర్ణంగా ఉంచేందుకు సిఫారసులు చేయాల్సిందిగా కేంద్ర కమిటీకి మహాసభ సూచించింది. అందరి సహాయంతో క్యూబా ఆర్థిక నమూనాను నవీకరించడం, క్యూబాలో సోషలిజం కొనసాగింపునకు హామీనివ్వడం తమ ముందున్న అత్యంత ముఖ్యమైన అంశమని రావుల్‌ కాస్ట్రో  ‌ తెలిపారు. 

( గూగ్ల్స్ ఇమేజ్స్,  పత్రిక ల సహకరం తొ.....)

20, ఏప్రిల్ 2011, బుధవారం

అణు గుణపాటం కాదా...

జపాన్ అణు ప్రమాదంతొ ప్రజలు యిప్పటికి  బయం తొ అల్లడుతున్నారు. రెడియెషన్ యిప్పటికి వస్తునెంది.
                 మహారాష్ట్రలో జైతపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్థానికులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం పాశవికంగతా వ్యవహరించింది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపించి ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. అనేక మందిని క్షతగాత్రులను చేసింది.
                       జపాన్‌ అణు విషాదం కళ్లెదుట ఉన్నా పూర్తిగా నిరూపణ కాని అణు రియాక్టర్ల కోసం కేంద్రంలోని యుపిఏ-2 ప్రభుత్వం, మహారాష్ట్రలోని కాంగ్రెస్‌-ఎన్‌సిపి సర్కార్‌ ఎందుకింత తహతహలాడుతున్నట్లు? అణు శాస్త్రవేత్తలు, నిపుణులు, వామపక్షాల నేతలు, ఇతర  పార్టిలు, రైతులు, మత్స్యకారులు, విద్యార్థులు ఇలా అన్ని తరగతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నారు  
                రేపు ఏదైనా ప్రమాదం జరిగితే చెర్నోబిల్‌ ప్రమాద సందర్భంగా వెలువడిన అణుధార్మికత (400 హిరోషిమా బాంబులకు సమానం ) కన్నా పది రెట్లు అధికంగా జైతపూర్‌ అణుధూళిని విరజిమ్ముతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెర్నోబిల్‌ ప్రమాదం వల్ల దాదాపు లక్ష చ.కి.మీ వరకు గల సారవంతమైన పొలాలు శాశ్వతంగా బీడుబారిపోయాయి.

            జపాన్‌లో ప్రమాదానికి గురైన రియాక్టర్ల రూపశిల్పి అరెవా కంపెనీయే జైతపూర్‌ కు కూడా ఇప్పుడు రియాక్టర్లను సరఫరా చేస్తున్నది. కొత్త డిజైన్‌ తో కూడిన ఈ రియాక్టర్లు ఇంతవరకు ఎక్కడా పరీక్షించకుండా . మన దేశంలో ప్రయోగం చేస్తున్నది. దిగుమతి చేసుకుంటున్న విదేశీ అణు రియాక్టర్ల వల్ల ఎలాంటి ముప్పు లేదని నిర్ధారణ అయ్యేవరకు విదేశీ అణు రియాక్టర్ల కొనుగోలుపై మారటోరియం విధించాలి. 
        అణు శాస్త్రవేత్తలు, నిపుణుల తో కూడిన స్వతంత్ర బృందం దీనిసై నిష్పాక్షికంగా అధ్యయనం జరిపి వీటి నిగ్గు తేల్చేంత వరకు జైతపూర్‌తో సహా కొత్తగా ప్రతిపాదించిన అణు విద్యుత్‌ ప్రాజెక్టులన్నిటిని నిలిపివేయాలి.
(  పత్రిక ల సహకరం తొ.....)

              

19, ఏప్రిల్ 2011, మంగళవారం

సోషలిజానికి అనుగుణంగానే ఆర్థిక మార్పులు...క్యూబా

          దేశంలోని సోషలిజానికి అనుగుణంగానే ఆర్థిక మార్పులు ఉంటాయని క్యూబా అధ్యక్షుడు రావుల్‌ కాస్ట్రో తెలిపారు.  క్యూబా కమ్యూనిస్టు పార్టీ ఆరవ మహాసభను
ప్రారంభించారు.
         పలు మార్పుల ప్రతిపాదనలను ఈ సందర్భంగా ముందుకు తెచ్చారు. ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఆస్తుల కేంద్రీకరణను అనుమతించేందుకు వచ్చిన పలు సంస్కరణల సూచనలను ఆయన తిరస్కరించారు.  అయితే క్యూబా సోషలిస్టు వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు తెచ్చేందుకు ఆయన గట్టిగా మద్దతిచ్చారు. క్యూబా పలు క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.  అమెరికా దాడుల నుంచి తనను తాను రక్షించుకోవడాన్ని క్యూబా కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. అదే సమయంలో పరస్పర గౌరవం ఆధారంగా ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు తాము సానుకులంగా ఉన్నట్లు రావుల్‌ కాస్ట్రో పునరుద్ఘాటించారు.
            విప్లవాన్ని కొనసాగిస్తామని, పార్టీ, ప్రభుత్వ నాయకత్వాన్ని ఒక క్రమపద్ధతితో పునరుజ్జీవింపజేస్తామని రావుల్‌ మహాసభ ప్రారంభంలో ఉద్ఘాటించారు. మహాసభ ప్రారంభంలో ఆయన కేంద్ర నివేదికను ప్రవేశపెట్టారు. గొప్ప బాధ్యతలను చేపట్టేందుకు సన్నద్ధం కావాల్సిన ఆవశ్యకత ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. యువతకు ప్రధాన బాధ్యతలు అప్పగించనున్నట్లు చెప్పారు.  పిసిసి ఆర్థిక, సామాజిక విధాన మార్గదర్శకాలపై జరిగిన చర్చలో 89,13,000 మంది ప్రజలు పాల్గొన్నట్లు రావుల్‌ తెలిపారు
. ( గూగ్ల్స్ ఇమేజ్స్, పత్రిక ల సహకరం తొ.....)
 

13, ఏప్రిల్ 2011, బుధవారం

విప్లవ యోధులు భగత్ సింగ్ .......... అవమానo.

                    

             భారత స్వాత్రంత్ర సమరంలో పాల్గొన్న విప్లవ యోధులు భగత్ సింగ్ జాట్ సిక్కు కులానికి చెందిన వాడని, రాజగురు దేశస్థ బ్రాహ్మణ కులంలో పుట్టాడని పేర్కొంటూ కులం ప్రస్తావన కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక 'కాంగ్రెస్ సందేశ్ ' తాజా సంచికలో  తీసుకురావడం విచారం . జాతి గర్వించదగ్గ సాహస వీరులైన భగత్ సింగ్, రాజగురులను అవమానo.  బారత దేశంలొ బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పొరాటం చెసినారు.




                 భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్