28, ఏప్రిల్ 2011, గురువారం

మంచి వేసవి విడిది కేంద్రంగా..

1.ఊటీ : తమిళనాడులో నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ది గాంచిన పర్యాటక కేంద్రం మరియు పట్టణం. నీలగిరి జిల్లాకు ప్రధాన పట్టణం. ఉదకమండలం అనేది దీని అధికారిక నామం. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఇది మంచి వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు.
ప్రాచీన కాలంలో నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. తరువాత గంగ వంశ రాజుల ఆధీనంలోకి మారాయి. తరువాత 12వ శతాబ్దంలో హోయసాల వంశ రాజైన విష్ణువర్థనుడి స్వాధీనంలో ఉన్నాయి. చివరకు టిప్పు సుల్తాన్ అధీనంలోకి వచ్చి, 18వ శతాబ్దంలో ఆంగ్లేయులకు అప్పగించబడ్డాయి. పక్కనే ఉన్న కోయంబత్తూర్ ప్రావిన్సు కు గవర్నరుగా ఉన్న జాన్ సుల్లివాన్ ఊటీ చల్లటి వాతావరణం, మరియు అడవులను చూసి ముచ్చటపడి, అక్కడ నివసిస్తున్న కోయజాతి తెగలకు అతి తక్కువ పైకాన్ని చెల్లించి చాలా స్థలాన్ని కొన్నాడు. నెమ్మదిగా ఈ స్థలాలు ఆంగ్ల ప్రైవేటు వ్యక్తుల పరం కావడంతో త్వరత్వరగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. మద్రాసు సంస్థానానికి వేసవి రాజధానిగా మారింది. మద్రాసు సంస్థానం సహకారంతో ఇక్కడ ప్రముఖ ఆంగ్లేయులు కొండల మద్య మెలికలు తిరిగే రహదారులు, సంక్లిష్టమైన రైలు మార్గాల్ని నిర్మించారు. ఈ పట్టణం సముద్ర మట్టం నుంచి 2,240 మీటర్ల ఎత్తులో ఉండటంతో ప్రముఖ వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. దీని అద్భుత సౌదర్యం, ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు మొదలైన వాటికి ముగ్ధులైన ఆంగ్లేయులు దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుచుకునే వారు.

చూడవలసిన ప్రదేశాలు  :     బొటానికల్ గార్డెన్స్,            దొడ్డబెట్ట శిఖరం                  ఊటీ బోట్‌హౌస్              కాఫీ తోటలు


2. కోయంబత్తూరు : 
కోవై అని కూడా పిలుస్తారు .  తమిళనాడు రాష్ట్రములోని రెండవ అతిపెద్ద నగరం. కోయంబత్తూరు జిల్లా యొక్క ముఖ్యస్థానమైన ఈ నగరం దక్షిణ భారత మాంచెస్టర్ గా పేరుగాంచినది. ఇది తమిళనాడులోని కొంగునాడు ప్రాంతములో భాగము. నొయ్యల్ నది తీరాన ఉన్న కోయంబత్తూరు నగరం, వస్త్ర పరిశ్రమలకు, ఇంజనీరింగు కర్మాగారాలకు, వాహన విడిభాగాల నిర్మాణకేంద్రాలకు, వైద్య సౌకర్యాలకు, విద్యాసంస్థలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆతిధ్యానికి మరియు ప్రత్యేకత కలిగిన కొంగు తమిళ మాండలికానికి ప్రసిద్ధి చెందినది.

కోవన్ అనే రాజు పరిపాలించడం వలన కోవన్‌పుతూర్ అన్న పేరు వచ్చిందని ఒక వివరణ ఉన్నది. ఈ పేరు ఆంగ్లీకరణ చెంది కోయంబత్తూర్ అయ్యిందని భావిస్తున్నారు. ఆధునిక యుగంలో కొన్నిసందర్భాలలో ఈ పేరును రైల్వే స్టేషను కోడును అనుసరించి సిబిఈగా క్లుప్తీకరించడం జరుగుతున్నది.

3. కొట్టాయం :  భారతదేశంలోని కేరళ రాష్ట్రం యొక్క ఒక నగరం. ఇది కేరళ రాష్ట్ర మధ్యభాగంలో ఉంది మరియు కొట్టాయం జిల్లా పరిపాలనా కేంద్రం. 2001 జనాభా లెక్కల ప్రకారం కొట్టాయం జనాభా 60,725గా అంచనా వేయబడింది. ఈ పట్టణం, సుగంధ ద్రవ్యాలు మరియు వాణిజ్య పంటలకు, ప్రత్యేకించి రబ్బర్ కు ప్రధాన వ్యాపార కేంద్రం. మలయాళ మనోరమ మరియు దీపిక వంటి కేరళ యొక్క ప్రధాన ప్రచురణ మాధ్యమానికి ఈ నగరం ముఖ్య కేంద్రం. కేరళలో ఆధునిక విద్యకు మార్గదర్శిగా, ఈ నగరం 1989లో భారతదేశంలో 100% అక్షరాస్యత సాధించిన మొదటి పురపాలక సంస్థగా మారింది మరియు భారతదేశంలో మొదటి పొగాకు రహిత జిల్లా అయింది. ముద్రణా మాధ్యమం మరియు సాహిత్యంలో ఈ నగరం యొక్క సేవను పరిగణించి కొట్టాయం "అక్షర నగరి(അക്ഷര നഗരി) " అనగా "అక్షరాల నగరం" అని కూడా పిలువబడుతుంది.మొట్ట మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు చెంపిల్ అరయన్ అనంతపద్మనాభన్ వలియ అరయన్ కంకుమరాన్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కొచ్చిన్ కోట వద్ద 29 డిసెంబర్ 1808న పోరాడారు.చెంపిల్ అరయన్, వేలు తంబి దళవ యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు.

ముఖ్యమైన ప్రదేశాలకు దూరం: కొట్టాయం - శబరిమల - 100 కిమీ, కొట్టాయం - తెక్కడి - 114 కిమీ, కొట్టాయం - తిరువనంతపురం - 160 కిమీ, కొట్టాయం - గురువాయూర్ దేవస్థానం - 170 కిమీ,కొట్టాయం - కోచి - 67 కిమీ, కొట్టాయం - చెట్టికులంగర దేవస్థానం - 50 కిమీ, కొట్టాయం - కాలికట్ - 285 కిమీ, కొట్టాయం- తొడుపుజ - 55 కిమీ

4. తిరువనంతపురం, కేరళ రాష్ట్రానికి రాజధాని. దీనిని బ్రిటీషు పరిపాలనా కాలములో ట్రివేండ్రం అని పిలిచేవారు. ఇది ఒక రేవు పట్టణము. అనంతపద్మనాభస్వామి కొలువైవున్న దివ్యక్షేత్రం. ఈ ఆలయంలొనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి. ఆడవారు కుడా ఎటువంటి అధునాతన దుస్తులు ధరించరాదు. అందరు సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి.
ప్రధానాలయం మళయాళ సంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గాలిగోపురం ఆనుకొని చుట్టూ ప్రహారి నాలుగు ముఖద్వారాలతో నిర్మించబడింది. ఆలయంలో స్వమి ఊరేగింపుకై ప్రాంగణం నిర్మించబడింది. నాలుగు మూలల నాలుగు ఉయ్యాల మండపాలతో, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు. ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో 'పుష్కరిణి' చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది. ఆలయంలో శ్రీ నారసింహ, శాస్త (అయ్యప్ప), పార్థసారథి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది.
5 . కేరళ  :  భారత దేశంలో నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రము. కేరళ సరిహద్దులలో తూర్పు మరియు ఈశాన్య దిక్కులలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు, పడమర దిక్కున అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా కేరళలోనే ఉంది. దక్షిణ భారతంగా పరిగణించబడే నాలుగు రాష్ట్రాలలో కేరళ ఒకటి.

1947లో భారతదేశం స్వతంత్రమైనాక 1941 జూలై 1న తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాలను కలిపి తిరువాన్కూర్-కొచ్చిన్ ఏర్పరచారు. 1950 జనవరి 1న దీనిని ఒక రాష్ట్రంగా గుర్తించారు. ఇదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు రాష్ట్రం చేశారు. 1956 నవంబరు 1న, రాష్ట్రపునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేరళ రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీనుండి మలబార్‌ప్రాంతాన్ని (4 తాలూకాలు మినహా) వేరుచేసి తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలో కలిపారు. 1957లో క్రొత్త అసెంబ్లీ ఎన్నిల అనంతరం ఇ.ఎమ్.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికలద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే మొదటివాటిలో ఇది ఒకటి.
ఆ కమ్యూనిస్టు ప్రభుత్వం కార్మికులకు, కౌలుదారులకు అనుకూలమైన విధానాలను అనుసరించింది. తరువాతి ప్రభుత్వాలు కూడా ఇదే మార్గాన్ని అవలంబించారు.  ప్రజల జీవన ప్రమాణాలు ఈ కాలంలో గణనీయంగా అభివృద్ధి చెందాయి.
( వి కీ పీ డి య  సహకారంతో ...)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి