సాహితీ వినీలాకాసంలో ఉదయించి అస్తమించని ఎర్ర సూరీడు శ్రీశ్రీ
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.
శ్రీశ్రీ అద్భుత సృష్టి, ఈ మహా ప్రస్థానం, ఇది వెలుబడిన తరువాత తెలుగు సాహిత్యపు ప్రస్థానానికే ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మహా ప్రస్థానానికి ముందు, మహా ప్రస్థానానికి తరువాత అని విభజించవచ్చు అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.ఇది ఒక అభ్యుదయ కవితా సంపుటి. ఇందులో శ్రీశ్రీ కార్మిక కర్షిక శ్రామిక వర్గాలను ఉత్తేజితులను చేస్తూ, నూతనోత్సాహం కలిగిస్తూ, ఉర్రూతలూగిస్తూ గీతాలు వ్రాసినాడు. ఇది తెలుగు కవితకే ఓ మార్గదర్శి అయినది.
మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!
కదం త్రొక్కుతూ,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!
కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,దారిపొడుగునా గుండె నెత్తురులు
తర్పణచేస్తూ పదండి ముందుకు!
బాటలు నడచీ,
పేటలు కడచీ,
కోటలన్నిటిని దాటండి!
నదీ నదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!.....
తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించాడు." తెలుగువీరాలెవరా(అల్లూరి సీతారామరాజు) " అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి.
తర్పణచేస్తూ పదండి ముందుకు!
బాటలు నడచీ,
పేటలు కడచీ,
కోటలన్నిటిని దాటండి!
నదీ నదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!.....
తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించాడు." తెలుగువీరాలెవరా(అల్లూరి సీతారామరాజు) " అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి.
సినిమాకు ఆయన రాసిన కొన్ని ప్రముఖ సినిమా పాటలు :
మనసున మనసై (డాక్టర్ చక్రవర్తి)
హలో హలో ఓ అమ్మాయి (ఇద్దరు మిత్రులు)
నా హృదయంలో నిదురించే చెలి (ఆరాధన)
తెలుగువీరాలెవరా(అల్లూరి సీతారామరాజు)
పాడవోయి భారతీయుడా (వెలుగు నీడలు)...
నేడు 102 శ్రీశ్రీ జన్మదినం
( గూగ్ల్స్ ఇమేజ్స్, వి కీ పీ డి య, పత్రిక ల సహకరం తొ.....)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి