25, మే 2011, బుధవారం

అమ్మాయిలను పుట్టకుండా నిరోధించడమేనా...

     భారత దేశంలో అమ్మాయిలను పుట్టకుండా నిరోధించడము న్యాయమా...
భారత దేశంలో ఆడ శిశువులను కడుపులోనే చంపేసే అలవాటు పెరిగిపోతోంది . అదీ బాగా ధనిక కుటుంబాల్లోనూ చదువుకున్న వారే ఇలాంటి ఎంపిక చేసిన గర్భస్రావాలకు పాల్పడుతున్నారట. ముఖ్యంగా కుటుంబంలో మొదటి బిడ్డ ఆడపిల్ల అయితే.. రెండో బిడ్డ మగ పిల్లవాడు అయ్యేలా చూసుకుంటున్నారట.
                   దేశంలో పుట్టబోయేది ఆడపిల్ల అని తేలితే ఎంపిక చేసి గర్భస్రావాలు(సెలక్టివ్‌ అబార్షన్స్‌) చేయించడం పెరిగింది. 1980 నుంచి 2010 మధ్య భాగంలో దాదాపు  1.21 కోట్ల మంది అమ్మాయిలను పుట్టకుండా నిరోధించారు. అమ్మాయి అనే కారణంతో గర్భస్రావం చేయించడం 1990 దశకంలో బాగా పెరిగినట్లు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. ఉత్తర భారత రాష్ట్రాల నుంచి ఈ జాడ్యం తూర్పు రాష్ట్రాల మీదుగా దక్షిణ భారతానికి కూడా పాకిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన ప్రభాత్ ఝా  చెప్పారు.
                  0-6 సంవత్సరాల మధ్య ఉన్న బాలుర కంటే 71 లక్షల మంది బాలికలు తక్కువగా ఉన్నట్లు 2011 జనాభా లెక్కలు వెల్లడించాయి. ఈ సంఖ్య 2001 జనాభా లెక్కల్లో 60 లక్షలుగా ఉండగా, 1991 జనాభా లెక్కల్లో 42 లక్షలుగా ఉంది. బాలురతో బాలికల నిష్పత్తి ఈ విధంగా తగ్గడం పేదలు, నిరక్షరాస్యులుగా ఉన్న వారిలో కంటే బాగా చదువుకున్న, ధనికులైన వారి ఇళ్ళలోనే ఎక్కువగా ఉంది. 
(  పత్రికల  సహకారంతో ...)

24, మే 2011, మంగళవారం

మరో అవినీతి కుంభకోణాల్లో కేంద్రం...

మరో అవినీతి కుంభకోణాల్లో యుపిఎ కూరుకుపోయిందా... 
               వరుస కుంభకోణాల్లో ఉకిరిబికిరి  అవుతున్న కేంద్ర  ప్రభుత్వాన్ని మరో  అవినీతి కుంభకోణం  బొగ్గుగనుల కేటాంపులో   భారీ  అవినీతి జరిగినట్లు తెలుసుతున్నది. 
          అవినీతిని ఎదుర్కొంటామని, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని  ప్రజలను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నమ్మించజూశారు.  కేంద్రంలో యుపిఎ-2 ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తమ హయాంలో జరిగిన స్కాంలన్నీ తూసు  అన్నట్లు మాట్లాడారు. అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుపోయి ప్రభుత్వం ఒక  వైపు  గిలగిల కొట్టుకుంటున్నది.  ఐపిఎల్‌, కామన్వెల్త్‌, ఆదర్శ్‌, ఎస్‌-బ్యాండ్‌, 2జి స్పెక్ట్రం కుంభకోణాల పరంపరను ఆవిష్కరించింది. ఐపిఎల్‌ స్కాంలో కేంద్ర మంత్రి శశిథరూర్‌, ఆదర్శ్‌ కుంభకోణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ పదవీచ్యుతులయ్యారు. అతిపెద్ద కుంభకోణం 2జి స్పెక్ట్రంలో డిఎంకె నేత ఎ రాజా మంత్రి పదవి కోల్పోయి ఊచలు లెక్కిస్తున్నారు. కామన్వెల్త్‌ స్కాంలో కాంగ్రెస్‌ ఎంపి సురేష్‌ కల్మాడీ జైలుకెళ్లారు. రెండేళ్ల సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే యుపిఎ భాగస్వామి డిఎంకె పార్టీ ఎంపి కనిమొళి 2జి స్పెక్ట్రం కేసులో కటకటాల పాలయ్యారు. 
                 అణు ఒప్పందం సమయంలో యుపిఎ-1 ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎంపీలను కొనుగోలు చేసినమాట నిజమేనని ఇటీవల వికీలీక్స్‌ కుండ బద్దలు కొట్టింది.  రెండేళ్లలో లెక్కలేనన్ని సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచి ప్రజల పై  భారం మోపారు.  నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. రెండేళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆత్మవిమర్శ లేకుండా భవిష్యత్తులో అవినీతిని తుదముట్టిస్తామని చెప్పి ప్రజలను వెర్రి వెంగళప్పలుగా జమ కట్టారు. 
( ప్రజాశక్తి, ఇతర పత్రికల  సహకారంతో ...)

20, మే 2011, శుక్రవారం

ప్రజా సంస్కృతి పరిరక్షణకు నడుం కడదాం...


  •                ప్రపంచీకరణ నేపథ్యంలో కనుమరుగవుతోన్న ప్రజా సంస్కృతిని, కళలను పరిరక్షించుకునే బాధ్యత మనందరిపైనా ఉందని ప్రముఖ చరిత్రకారులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ అన్నారు. ఇందుకోసం ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రగతిశీలవాదులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 26వ వర్థంతిని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'ప్రజా సంస్కృతి, వికాసం, పరిణామం' అనే అంశంపై రామకృష్ణ స్మారకోపన్యాసం చేశారు.
                   
    రామకృష్ణ మాట్లాడుతూ ప్రజా సంస్కృతి మీద, సాహిత్యం మీద సుందరయ్యకు మంచి పట్టు ఉందన్నారు. ప్రముఖుల జీవిత చరిత్రలోని లోపాలను సైతం ఆయన సునిశితంగా విమర్శించారని చెప్పారు. శ్రమైక జీవన సౌదర్యం నుండే ప్రజా సంస్కృతి ఉద్భవించిందని తెలిపారు. అనేక మంది శతకకారులు ప్రజా సంస్కృతిని ప్రతిబింబించే శతకాలను రచించారని, వారి పద్యాల్లో సామాజిక చిత్రణ స్పష్టంగా గోచరించేదని చెప్పారు. రాజ్యాధికారం కోసం ప్రజా సంస్కృతిని వాడుకున్న రాజులు, ఆ తర్వాతికాలంలోని భూస్వామ్య వర్గాలవారు కావాలనే వీటిని నిర్లక్ష్యం చేశారన్నారు. అయితే కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం, వామపక్ష భావజాలం వల్ల 1950 తర్వాత జానపదాలు, కళారూపాలు పునరుద్దరింపబడ్డాయని వివరించారు. ప్రజలకు దూరమైన, మరుగునపడిపోతున్న కళలను వారికి చేరవయ్యేట్లు కృషి చేసిందన్నారు. అంతేకాక సమాజంలోని చెడును, రుగ్మతలను, దురాచారాలను, రూపుమాపడానికి, వామపక్ష భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేసిందని వివరించారు.

19, మే 2011, గురువారం

సుందరయ్య గారి రేరు ఫొటోలు...

నేడు మహా మనిషి  పుచ్చలపల్లి సుందరయ్య గారి  26వ వర్థంతి  సందర్బంగా ...


 

సుందరయ్య గారి రేరుగా (తక్కువగా ) కనపడే ఫొటోలలో  కొన్ని...
             
     
 







1944 లో  బందర్ కాలువ  పూడికతీత  పనుల పర్యవేక్షణలో

   


                                             




                                                1961 లో 








( సుందరయ్యవిజ్ఞాన కేంద్రం  సహకారంతో ...)

మహా మనిషి, ఆదర్శ జీవి...

ప్రపంచ చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న అతికొద్దిమంది మహా పురుషుల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు.
               నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913 మే 1 న జన్మించాడు అందరిలాగే పుట్టారు. సంపన్న కుటుంబంలో పెరిగారు. కాని శ్రామికనేతగా ఎదిగారు. భూస్వామ్య బంధనాలను తాను తెంచుకోవడమే గాక, సమాజాభివృద్ధికి ఆటంకంగా మారిన ఫ్యూడల్‌ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించివేయడానికి నడుంకట్టారు. భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆయుధంగా మలచుకోవడమేగాక దాన్ని ఆచరణలోపెట్టి లక్షలసంఖ్యలో సామాన్య ప్రజానీకాన్ని కదనరంగంలోకి దించిన మహానేత.   దేశంలో బలమైన వామపక్ష శక్తిగా సిపియంను ఆయన తీర్చిదిద్దారు.  సిద్ధాంతాన్ని ఆచరణతో మేళవించిన పోరాటయోధుడు.  తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు . కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన ఆయన తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు.
             ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్నంత కాలం మన దేశ పార్లమెంటు లో సైకిల్ స్టాండు ఉండేది. పార్లమెంటు సమావేశాలకు ఆయన సైకిల్ మీదే వెళ్ళేవారు. ఆయనతో పాటే ఆ స్టాండు కు కాలం చెల్లింది.  రాష్ట్ర విధానసభలోనూ అదే సైకిల్. ఆయన నిరాడంబర జీవితానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు.  పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డుతగులుతాయని పెళ్లికాగానే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స చేయించుకొన్నారు. తండ్రినుంచి లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచివేశారు. 1985 మే19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి కన్నుమూశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి.
                 

17, మే 2011, మంగళవారం

వామపక్షాలు కనుమరుగవుతాయనిది కేవలం భ్రమలు...

       శాసనసభ ఎన్నికల ఓటమి నేపథ్యంలో ప్రజలతో మరింతంగా మమేకమవ్వడంపై దృష్టి కేంద్రీకరిస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌ పేర్కొన్నారు. బెంగాల్‌ ఎన్నికల ఓటమిపై లోతుగా చర్చించి, తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల అనంతరం బెంగాల్లో సిపిఎం శ్రేణులపై జరుగుతోన్న దాడులపై ఆయన తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. సోమవారము  డిల్లిలో జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలపై సమావేశంలో ప్రాథమికంగా చర్చించినట్లు చెప్పారు. జూన్‌లో హైద్రాబాద్‌లో జరిగే పార్టీ కేంద్ర కమిటీ సమవేశాల్లో ఎన్నికల ఫలితాలను సమగ్రంగా సమీక్షిస్తామన్నారు. ఈలోపు ఆయా రాష్ట్ర కమిటీలు ఫలితాలపై సవివరమైన నివేదికలను తయారు చేస్తాయన్నారు. 
                   34 సంవత్సరాల అవిచ్ఛిన్న పాలన అనంతరం బెంగాల్లో వామపక్షాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందన్నారు. తన పాలనలో బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వం చారిత్రాత్మక ప్రజానుకూల చర్యలను చేపట్టిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పు నినాదానికి అనూకులంగా నిర్ణయాత్మకంగా ఓటు చేశారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలను లోతుగా సమీక్షించి, పార్టీ మరింతగా ప్రజలకు చేరువయ్యేందుకు తగిన చర్యలు చేపట్టాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించినట్లు చెప్పారు. ' ఫలితాల నేపథ్యంలో దేశంలో వామపక్షాలు కనుమరుగవుతాయని కొందరు భావిస్తు న్నారు. ఇవి కేవలం భ్రమలుగానే మిగిలిపోతాయి. వారి అభి ప్రాయం తప్పని భవిష్యత్తు నిరూపిస్తుందని చెప్పారు.

15, మే 2011, ఆదివారం

ఒక్కరూ చావకూడదు...

                      "గోదాముల నిండా ఆహార ధాన్యాలు ఉండగా.. దేశంలో ఆకలి చావులు చోటు చేసుకోవడమా? మరో 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను దేశంలోని నిరుపేదలకు సరసమైన ధరలకు తక్షణం పంపిణీ చేయండి. తద్వారా ఒక్క ఆకలి చావు కూడా చోటు చేసుకోకుండా వ్యవహరించండి. మన దేశంలో ఇంతకంటే ముఖ్యమైన అంశం మరొకటి ఉండదు'' అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలోని 150 పేద జిల్లాల్లో దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారందరికీ ఈ ఆహార ధాన్యాలను అందజేయాలని సుప్రీం న్యాయమూర్తులు దల్వీర్ భండారీ, దీపక్ వర్మలు.. కేంద్రానికి శనివారం ఆదేశాలు జారీ చేశారు.

                 అయినప్పటికీ.. సుప్రీం న్యాయమూర్తులు ఈ అంశంపై విచారణ జరిపి.. కేంద్రానికి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. "గోదాముల్లో మూలుగుతున్న ఆహార ధాన్యాలను పేదలకు సరసమైన ధరలకు అందజేయాలంటూ మీకు మేం పదేపదే విజ్ఞప్తి చేస్తునే ఉన్నాం. ఆహార ధాన్యాలను ఎంతో ఎక్కువ ధరకు మీరు కొనుగోలు చేసి.. గోదాముల్లో దాస్తున్నారు. పంటలు బాగా పండినప్పుడు.. గోదాముల సామర్థ్యం సరిపోకపోవడంతో.. పాత ధాన్యాలను పారవేస్తున్నారు.

14, మే 2011, శనివారం

ప్రజలపై బాంబు ...

              ఎన్నికలు ముగియగానే ప్రజలపై పెట్రో ధరల బాంబు పడింది. పెట్రోలు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఈసారి లీటరుకు ఐదు రూపాయలు ధర పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్‌లో పెట్రోలు లీటరు ధర కాస్త అటు ఇటుగా 72 రూపాయలు. గత తొమ్మిది నెలలలో పెట్రోలు ధరలు పెరగడం ఇది తొమ్మిదోసారి.  పెరిగిన ధరలు ఈరోజు అర్థరాత్రినుంచే అమలుకానున్నాయి. త్వరలో మరోసారి పెట్రోలు ధర పెంచే అవకాశం ఉందని చమురు సంస్థలు సూచనప్రాయంగా తెలిపాయి.
                పెట్రోలు ధరను ఇంత పెద్ద ఎత్తున పెంచేయడం ఇదే మొదటిసారి. పశ్చిమబెంగాల్‌, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశంలో వామపక్ష రాజకీయాల ప్రాధాన్యత తగ్గడంతొ ఎవరు అడ్డు ఈక లేరని కేంద్రం ,మిగత పాలక పార్టిలు బావిసుతున్నాయి. రానున్న కాలంలో ప్రపంచబ్యాంకు, అమెరికా ఒత్తిళ్లు మరింతగా పెరుగు తాయి. పాలకులు మరింతగా పేట్రేగిపోయి ప్రజల హక్కులను కాలరాచే ప్రమాదముంది.

10, మే 2011, మంగళవారం

మరణ శిక్ష విధించాలి...

                        దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కుల దురహంకార హత్యలు మన జాతికే మాయని మచ్చని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కుల దురహంకార హత్యలను 'అత్యంత అరుదైన'విగా (రేర్‌ ఆఫ్‌ది రేరెస్ట్‌) వర్గీకరించి ఈ నేరాలకు పాల్పడేవారికి మరణ శిక్ష విధించాలని సర్వోన్నత న్యాయస్థానం కోర్టులను ఆదేశించింది.        
                  'కారణం ఏదైనా మా అభిప్రాయంలో కుల దురహంకార హత్యను అత్యంత అరుదైన కేసుగానే పరిగణించాల్సి వుంటుంది. దీనికి మరణశిక్షే తగినది. మన జాతికే మాయని మచ్చగా మారుతున్న ఇటువంటి దారుణమైన ఫ్యూడల్‌ ఆచారాలను తుడిచి పెట్టాల్సిన అవసరం వుంది' అని సుప్రీం కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. ఇటువంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు తమ కోసం వధ్యశిల ఎదురు చూస్తుంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలని న్యాయమూర్తులు మార్కండేయ కట్జు, జ్ఞాన్‌ సుధా మిశ్రాతోకూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
                అటువంటి అనాగరిక, సిగ్గుమాలిన పనులను అడ్డుకునేందుకు ఇది తప్పనిసరి. తమ కోసం ఉరితాళ్లు ఎదురు చూస్తున్నాయన్న విషయం ఇప్పటికీ పరువు హత్యలకు పాల్పడాలని కుట్రలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ తెలియాలి'' అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. పెళ్లయినప్పటికీ, భర్తను వదిలేసిన తన కుమార్తె సీమ వావి వరుసలు మరచి వరుసకు సోదరుడి (కజిన్)తో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో ఢిల్లీకి చెందిన భగవాన్ దాస్ హత్య చేశారు.  ఈ కేసును విచారించిన ఢిల్లీ సెషన్స్ కోర్టు దాస్‌కు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసును విచారించిన సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ మార్కండేయ కట్జు, జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రాలు భగవాన్‌దాస్ పిటిషన్‌ను కొట్టివేశారు. దీనిపై తమ తీర్పును వెలువరిస్తూ పరువు హత్యలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

9, మే 2011, సోమవారం

ప్రపంచ సాహిత్యంలో గొప్ప రచన గీతాంజలి...

                    భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ టాగోర్ . ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి వారు .    రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా గొప్ప మానవతావేత్తగా టాగూర్ చరిత్రలో నిలిచిపోయాడు. మాతృభూమి, మానవసంబంధాలపట్ల అచంచలమయిన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న విశ్వకవి' రవీంద్రనాథ్ టాగూర్.
                        రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది. ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913 వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రుని గీతాంజలికే నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. ఆసియా ఖండంలో మొదటిసారి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. గీతాంజలి వెలువడిన తరువాత అన్ని దేశాలవారు రవీంద్రుని గ్రంథాలను చదవడం ఆరంభించారు.
                       రవీంద్రనాధ టాగోరు డెబ్భై ఏళ్ళ ప్రాయంలో చిత్రకళా సాధనను ప్రారంభించాడు. ఆయన వేసిన చిత్రాలు లండను, ప్యారిస్, న్యూయార్కు మొదలగు నగరాలలో ప్రదర్శించబడ్డాయి. ఆయన దాదాపు రెండు వేల చిత్రాలను గీశాడు.

7, మే 2011, శనివారం

తెలుగు జాతి గర్వించదగ్గ విప్లవయోధుడు...

                భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు  ఒక మహోజ్వల శక్తి. మన్యం వీరుడు, తెలుగు జాతి గర్వించదగ్గ విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు. వారు  జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి.  కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
                 అల్లూరి సీతారామరాజు 1974లో విడుదలైన తెలుగు సినిమా.  ఆ  సినిమా నిజంగా అల్లూరి పోరాటాన్ని చుసిన అనుభూతి కలిగింది.  జీవిత కధను తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో మొట్టమొదటి సినిమా స్కోప్ చిత్రం. కృష్ణ హిరో సినీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా పేరుపొందింది.  తెలుగు వీర లేవరా"  దీక్షబూని సాగరా...దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా పాటకై  మొటమొదటి  సరిగా తెలుగు పాటకు  జాతీయ బహుమతి వచ్చింది. ( మహా కవి శ్రీశ్రీ రచనకు  ). మేము చినప్పుడు  స్వాతంత్ర్య దినోత్సవాల సందర్బంగా స్కూల్లో , రోడ్ల మిద ఆ పాట పాడుతూ ఊరేగింపు  చేసేవాళ్ళం .

6, మే 2011, శుక్రవారం

ప్రేమించడం నేరమా...

              ఆధునిక సమాజంలో ఈ అనాగరిక చేష్టలు ఏంటని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీవ్రంగా స్పందించడానికి కారణమైన కుల దురహంకార హత్యలె.  మన రాష్ట్రంలో కూడా  ( ఆంధ్రప్రదేశ్‌లోనూ) అక్కడక్కడ   ఈ పాశవిక సంఘటనలు జరుగుతున్నాయి. 
                తక్కువ కులం వ్యక్తిని (దళితున్ని) పెళ్లి చేసుకున్న కారణంగా కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా, పాశవికంగా దాడి చేసి, హత్య చేశారు.  దూరంగా  ఖాలీ  ప్రాంతానికి తీసుకెళ్లిన ఆమె తల్లి, మానమేమలు... రాళ్లతో కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు.  అటు మానవత్వానికి, ఇటు మాతృత్వానికి మచ్చ తెచ్చిన ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో  బాలానగర్‌ మండలం రాజాపూర్‌ (జాతీయ రహదారి పక్కనున్న గ్రామం)లో  చోటుచేసుకుంది.  గొర్రెల పెంపకందారుల సామాజిక తరగతికి చెందిన మాధవి(18), కేశంపేట మండలం కాకునూరు గ్రామానికి చెందిన దళితుడు లింగం గత ఏడాది నవంబర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దళితున్ని పెళ్లి చేసుకోవడం మింగుడు పడని మాధవి తల్లి శంకరమ్మ తన బిడ్డకు మైనార్టీ తీరలేదని, లింగం కిడ్నాప్‌ చేశాడనే ఆరోపణతో బాలానగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు లింగంను రిమాండ్‌కు పంపి మాధవిని స్టేట్‌ హోమ్‌లో ఉంచారు. అనంతరం రెండు నెలల్లోనే జడ్చర్ల మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌, మాధవి మైనార్టీ తీరిందని చెప్పి హోమ్‌ నుండి తీసుకొచ్చారు. అక్కడి నుండి నేరుగా భర్త లింగం దగ్గరకు మాధవి వెళ్లింది. మాధవి అక్కడికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేని తల్లి, మేనమామలు గురువారం కసాయిమూకల ఘోరకలి సంఘటన జరిగింది
                     ఇదిలావుండగా  మరొ సంఘటన, దళతున్ని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతుర్ని దారుణంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు  ఒక తండ్రి..  శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం రట్టిణికి చెందిన లలిత్‌ కుంటియా, గొల్లపు కుంటియా  వారి కుమార్తె లల్లి కుంటియా (19).  ఒడిషాలోని ఒడ్రు కులానికి చెందిన ఆమె దళిత కులానికి చెందిన అలజండి మోహనరావును ప్రేమించింది. ఈ నెల 20న టిటిడి ఆధ్వర్యాన నిర్వహించనున్న కల్యాణమస్తులో వివాహం చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి లలిత్‌ కుంటియా బుధవారం రాత్రి గొడవపడి, పీక నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని గురువారం గ్రామస్తులకు చెప్పాడు.
                 ఈ  సంఘటనలకు బాద్యులయిన   నిందితులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని  కొరుకుంద్దాం.   ఈ  సంఘటనలు మల్లి జరుగకుండా    ప్రభుత్యం  తగు చర్యలు    తిసుకొవలని  కొరుకుంద్దాం.  
                ''వ్యవసాయకార్మికులు, పేదరైతుల మీద జరుగుతున్న దాడులు, సాంఘిక ఇబ్బందులు, అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా  సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా పోరాడాలి'' అని సుందరయ్య గారు ఆనాడు పిలుపునిచ్చారు. ఊరుమ్మడి బావుల్లో దళితుల్ని నీరు తోడుకోనివ్వకపోవడం, అంటరానితనం, కూలీ వివక్ష, అగౌరవపర్చడం, ఆడవారితో నీచంగా మాట్లాడటం వంటి అనాగరిక పద్ధతుల్ని ఆయన ఈసడించుకున్నారు.  విద్యార్థిగా స్వగ్రామం అలగానిపాడులో సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం  ప్రారంబించినారు.
                అంబేద్కర్ ఆలోచనలు ఈనాడు ఎంతగా వ్యాపించినా, బలపడినా- దేశంలో ఇంకా దళితులపై అత్యాచారాలు, హత్యలు  జరుగుతూనే ఉన్నాయి,   అవమానాలకు గురిఅవుతున్నాయి. దేశంలో మారుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా వారి సామాజిక, ఆర్థిక హోదా దిగజారుతున్నది.
               అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా  ముందుకు  రావాలని  కొరుకుంద్దాం. 

4, మే 2011, బుధవారం

ఐపీఎల్‌లో మళ్ళీ దాదా ...

              ఐపీఎల్‌లోకి  మళ్ళీ దాదా వచ్చారు.  మన  మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ అనుహ్యంగా మళ్ళీ ఐపిఎల్‌-4లో ఆడే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు.  పూణే వారియర్స్‌ జట్టులో పేసర్‌ ఆశిష్‌ నెహ్రా గాయపడడంతో అతడి స్థానంలో గంగూలీని జట్టులోకి తీసుకున్నారు.  గంగూలీ గత మూడు ఐపిఎల్‌ టోర్నీలలో కొల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రెండు టోర్నీలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.  ఐపిఎల్‌-4లో వేలంలో 10 ఫ్రాంఛైజీలలో సౌరవ్‌ గంగూలీని కొనటానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించకపోవడంతో గంగూలీ ఈ టోర్నీలో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. సొంత జట్టు కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ కూడా గంగూలీని కొనుగోలు చేయలేదు. 
         ఐపిఎల్‌  గంగూలీ ఆడడం లేదని బాధపడుతున్న అభిమానులకు తీపివార్త. దాదా డబ్బు కోసం గాక ప్రతిష్ఠ కోసమే పుణెకు ప్రాతినిధ్యం వహించనున్నట్టు క్రికెట్ వర్గాలు తెలుపుతున్నాయి.    ఐపీఎల్‌లో సత్తాచాటి తనను అవమానించిన వారికి తగిన సమాధానం ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడు. పుణె బుధవారం ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో దాదా ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. యువరాజ్ సింగ్ సారథ్యంలో పుణె వరసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయి కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఐపీఎల్‌లో గంగూలీ విజృంభిస్తాడని, యువరాజ్ సింగ్ కు అండగా  ఉండి  ఈద్దరు  కలసి విజయం సాదిస్తరని కొరుకుంద్దాం.  
 ( గూగ్ల్స్ ఇమేజ్స్, పత్రిక ల సహకరం తొ.....)

3, మే 2011, మంగళవారం

ఎందుకు నిషేధించకూడదు?...

              ఎండోసల్ఫాన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. క్రిమి సంహారిణి ఎండోసల్ఫాన్‌ ఉత్పత్తిని, విక్రయాలను, వినియోగాన్ని ఎందుకు నిషేధించకూడదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌హెచ్‌ కపాడియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. పలు మరణాలకు, ఎంతో మంది అనారోగ్యం బారిన పడడానికి కారణమైన ఎండోసల్ఫాన్‌ను దేశంలో తయారీ, విక్రయం, వినియోగాన్ని నిషేధించాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఎండోసల్ఫాన్‌ వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

               ''కేరళ ప్లాంటేషన్‌ కార్పొరేషన్‌''కు సంబంధించిన దాదాపు 12,500 ఎకరాల జీడి మామిడి తోటల్లో ఒక రకమైన దోమల్ని (ట్రీ మస్కిటోస్‌) నియంత్రించడానికి 1980 నుండి హెలికాప్టర్‌ ద్వారా ఈ మందును స్ప్రే చేస్తూ వచ్చారు. ఈ తోటలు కేరళ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పాడ్రే అనే గ్రామం చుట్టుపక్కల వుండడం వల్ల ఎండోసల్ఫాన్‌ స్ప్రే వల్ల అక్కడి నదులు, వాగులు, వంకలు, నివాస ప్రాంతాలు, పొలాలు కలుషితమయ్యాయి. దోమలు, వానపాములు, కప్పలు, తేనెటీగలు ఇతర కీటకాలు చనిపోయాయి. ఈ మందు దుష్ప్రభావం వల్ల అధికారికంగా ఇంతవరకు దాదాపు 500 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది అనారోగ్యం పాలయ్యారు. చాలా మంది మహిళల్లో సంతానోత్పత్తి వ్యవస్థ దెబ్బతిన్నది గర్భస్రావాలు ఎక్కువయ్యాయి. పుట్టినవారిలో అంగవైకల్యాలు సర్వసాధారణమైపోయాయి. ఈ ప్రాంతంలో 2002-03 అధ్యయనం చేసిన భారత మెడికల్‌ అసోసియేషన్‌ కేరళ శాఖ పరిశోధనా విభాగం అధికంగా తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలకు ఎండోసల్ఫాన్‌యే కారణమని నిర్ధారించాయి. దీంతో కేరళ ప్రభుత్వం 2005 నుండి ఎండోసల్ఫాన్‌ వాడకాన్ని నిషేధించింది.

                  ఎండోసల్ఫాన్‌ను దేశమంతటా నిషేధించాలని  కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌ ( సిపిఎం )  చేసిన పోరాటం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు 5000 మంది సామూహిక నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు.  పార్లమెంట్‌ సభ్యులు కూడా ఢిల్లీలో తమ నిరసన గళాన్ని వినిపించారు. జాతీయ స్థాయిలో నిషేధించాలనే డిమాండ్‌ను కేరళ ప్రభుత్వమే గాక, అన్నీ ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అఖిల భారత ప్రజా సైన్స్‌ నెట్‌వర్క్‌ లాంటి ఎన్నో సంస్థలు ఎండో సల్ఫాన్‌ వాడకాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

                 ఈంత దుర్మాగమైన  మందును తక్షణమే దేశమంతటా  నిషేధం విధించాలని డిమండ్  చేద్దాం.    ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ప్రత్యామ్నాయ మందులను  అభివృద్ధికి లోకి తీసుకరావాలని కొరుకుంద్దాం. ( ప్రజాశక్తి   పత్రిక  సహకరం తొ.....)

1, మే 2011, ఆదివారం

మహా మనిషి ...

                        ప్రపంచ చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న అతికొద్దిమంది మహా పురుషుల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు. అందరిలాగే పుట్టారు. సంపన్న కుటుంబంలో పెరిగారు. కాని శ్రామికనేతగా ఎదిగారు. భూస్వామ్య బంధనాలను తాను తెంచుకోవడమే గాక, సమాజాభివృద్ధికి ఆటంకంగా మారిన ఫ్యూడల్‌ వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించివేయడానికి నడుంకట్టారు. భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆయుధంగా మలచుకోవడమేగాక దాన్ని ఆచరణలోపెట్టి లక్షలసంఖ్యలో సామాన్య ప్రజానీకాన్ని కదనరంగంలోకి దించిన మహానేత.
                 ఆ రకంగా సిద్ధాంతాన్ని ఆచరణతో జోడించి దేశంలో బలమైన వామపక్ష శక్తిగా సిపియంను ఆయన తీర్చిదిద్దారు. దాని కోసం ఆహరహం తపించారు. సిద్ధాంతాన్ని ఆచరణతో మేళవించిన పోరాటయోధుడు.
                  మన దేశంలో పేదలు వర్గరీత్యానే గాక సామాజికంగా అణచివేయబడుతున్నారు. తన చిన్నతనంలోనే సుందరయ్య ఈవిషయాన్ని గ్రహించారు. ఊరుమ్మడి బావుల్లో దళితుల్ని నీరు తోడుకోనివ్వకపోవడం, అంటరానితనం, కూలీ వివక్ష, అగౌరవపర్చడం, ఆడవారితో నీచంగా మాట్లాడటం వంటి అనాగరిక పద్ధతుల్ని ఆయన ఈసడించుకున్నారు.  విద్యార్థిగా స్వగ్రామం అలగానిపాడులో సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు.  ''వ్యవసాయకార్మికులు, పేదరైతుల మీద జరుగుతున్న దాడులు, సాంఘిక ఇబ్బందులు, అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా ఈ సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా పోరాడాలి'' అని పిలుపునిచ్చారు.

                 సుందరయ్యగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సుందరయ్య బతికున్నంతకాలం సామాజికన్యాయం కోసం , పేద ప్రజల కోసమే పోరాడారు. పాలకుల విధానాలపై తిరుగుబాటు చేశారు. సోషలిజమనే నూతన సమాజం కోసం అహరహం శ్రమించారు. 
సుందరయ్య
నీలాంటి త్యాగజీవు లెందరయ్యా       
శ్రమజీవులు నిన్నెపుడూ మరువరయ్యా...
( నేడు
మహా మనిషి  సుందరయ్య గారి జన్మదినం సందర్బంగా  ) 

దోపిడీ రహిత సమాజానికై .......

                దోపిడీ రహిత సమాజానికై .....మనిషిని మనిషి దోచుకోని ప్రపంచం కోసం   పోరాటం జరుగు తుంది.
                  నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా, కార్మిక వర్గం తమ హక్కుల పరిరక్షణ కోసం, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న పోరాటాలకు  మే డే సందర్భంగా సంఘీభావాన్ని తెలుపుద్దాం .    ప్రభుత్యం  అనుసరించే ప్రజా  వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా , సమైక్య పోరాటాలను నిర్మించాలని కార్మిక వర్గాన్ని కొరుద్దాం. 
                  టెలికాం కుంభకోణం, ఖనిజాల తవ్వకం, కామన్వెల్త్‌ గేమ్స్‌లో అవకతవకలు, అనేక హౌసింగ్‌, భూ కుంభకోణాలు ఇటీవలి కాలంలో వెలుగుచూశాయి. ఈ కుంభకోణాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు లక్షలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. బడా పారిశ్రామిక సంస్థలు బాగా లబ్ధి పొందాయి.  నయా ఉదారవాద ఆర్ధిక విధానాలు అవినీతిని పెంచి పోషిస్తున్నాయి. ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి  ఫలితంగా ధరల పెరుగుదల, ఆహార ద్రవ్యోల్బణం నింగిని చూడటం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చెయ్యడం జరుగుతునెవుంది.

            పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్న తీవ్ర సంక్షోభం నేపథ్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కోల్పోతున్న తరుణం ( లేఆఫ్‌లు, మూసివేతలు, వేతనాల కోత ).  తమ హక్కులపై, జీవనశైలిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాటాలను ఉధృతం చేస్తున్న తరుణంలో  మే దినోత్సవాలు జరుగుతున్నాయి.