3, మే 2011, మంగళవారం

ఎందుకు నిషేధించకూడదు?...

              ఎండోసల్ఫాన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. క్రిమి సంహారిణి ఎండోసల్ఫాన్‌ ఉత్పత్తిని, విక్రయాలను, వినియోగాన్ని ఎందుకు నిషేధించకూడదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌హెచ్‌ కపాడియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. పలు మరణాలకు, ఎంతో మంది అనారోగ్యం బారిన పడడానికి కారణమైన ఎండోసల్ఫాన్‌ను దేశంలో తయారీ, విక్రయం, వినియోగాన్ని నిషేధించాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఎండోసల్ఫాన్‌ వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

               ''కేరళ ప్లాంటేషన్‌ కార్పొరేషన్‌''కు సంబంధించిన దాదాపు 12,500 ఎకరాల జీడి మామిడి తోటల్లో ఒక రకమైన దోమల్ని (ట్రీ మస్కిటోస్‌) నియంత్రించడానికి 1980 నుండి హెలికాప్టర్‌ ద్వారా ఈ మందును స్ప్రే చేస్తూ వచ్చారు. ఈ తోటలు కేరళ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పాడ్రే అనే గ్రామం చుట్టుపక్కల వుండడం వల్ల ఎండోసల్ఫాన్‌ స్ప్రే వల్ల అక్కడి నదులు, వాగులు, వంకలు, నివాస ప్రాంతాలు, పొలాలు కలుషితమయ్యాయి. దోమలు, వానపాములు, కప్పలు, తేనెటీగలు ఇతర కీటకాలు చనిపోయాయి. ఈ మందు దుష్ప్రభావం వల్ల అధికారికంగా ఇంతవరకు దాదాపు 500 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది అనారోగ్యం పాలయ్యారు. చాలా మంది మహిళల్లో సంతానోత్పత్తి వ్యవస్థ దెబ్బతిన్నది గర్భస్రావాలు ఎక్కువయ్యాయి. పుట్టినవారిలో అంగవైకల్యాలు సర్వసాధారణమైపోయాయి. ఈ ప్రాంతంలో 2002-03 అధ్యయనం చేసిన భారత మెడికల్‌ అసోసియేషన్‌ కేరళ శాఖ పరిశోధనా విభాగం అధికంగా తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలకు ఎండోసల్ఫాన్‌యే కారణమని నిర్ధారించాయి. దీంతో కేరళ ప్రభుత్వం 2005 నుండి ఎండోసల్ఫాన్‌ వాడకాన్ని నిషేధించింది.

                  ఎండోసల్ఫాన్‌ను దేశమంతటా నిషేధించాలని  కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌ ( సిపిఎం )  చేసిన పోరాటం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు 5000 మంది సామూహిక నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు.  పార్లమెంట్‌ సభ్యులు కూడా ఢిల్లీలో తమ నిరసన గళాన్ని వినిపించారు. జాతీయ స్థాయిలో నిషేధించాలనే డిమాండ్‌ను కేరళ ప్రభుత్వమే గాక, అన్నీ ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అఖిల భారత ప్రజా సైన్స్‌ నెట్‌వర్క్‌ లాంటి ఎన్నో సంస్థలు ఎండో సల్ఫాన్‌ వాడకాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

                 ఈంత దుర్మాగమైన  మందును తక్షణమే దేశమంతటా  నిషేధం విధించాలని డిమండ్  చేద్దాం.    ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ప్రత్యామ్నాయ మందులను  అభివృద్ధికి లోకి తీసుకరావాలని కొరుకుంద్దాం. ( ప్రజాశక్తి   పత్రిక  సహకరం తొ.....)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి