ఐపీఎల్‌లోకి మళ్ళీ దాదా వచ్చారు. మన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అనుహ్యంగా మళ్ళీ ఐపిఎల్-4లో ఆడే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. పూణే వారియర్స్ జట్టులో పేసర్ ఆశిష్ నెహ్రా గాయపడడంతో అతడి స్థానంలో గంగూలీని జట్టులోకి తీసుకున్నారు. గంగూలీ గత మూడు ఐపిఎల్ టోర్నీలలో కొల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. రెండు టోర్నీలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపిఎల్-4లో వేలంలో 10 ఫ్రాంఛైజీలలో సౌరవ్ గంగూలీని కొనటానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించకపోవడంతో గంగూలీ ఈ టోర్నీలో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. సొంత జట్టు కొల్‌కతా నైట్ రైడర్స్ కూడా గంగూలీని కొనుగోలు చేయలేదు.
ఐపిఎల్ గంగూలీ ఆడడం లేదని బాధపడుతున్న అభిమానులకు తీపివార్త. దాదా డబ్బు కోసం గాక ప్రతిష్ఠ కోసమే పుణెకు ప్రాతినిధ్యం వహించనున్నట్టు క్రికెట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఐపీఎల్‌లో సత్తాచాటి తనను అవమానించిన వారికి తగిన సమాధానం ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడు. పుణె బుధవారం ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో దాదా ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. యువరాజ్ సింగ్ సారథ్యంలో పుణె వరసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయి కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఐపీఎల్‌లో గంగూలీ విజృంభిస్తాడని, యువరాజ్ సింగ్ కు అండగా ఉండి ఈద్దరు కలసి విజయం సాదిస్తరని కొరుకుంద్దాం.
( గూగ్ల్స్ ఇమేజ్స్, పత్రిక ల సహకరం తొ.....)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి