28, డిసెంబర్ 2013, శనివారం

రైల్లో ఘోర అగ్ని ప్రమాదం...

   నాందేడ్-బెంగళూర్ ఎక్స్ ప్రెస్ లో 28.12.2013(శనివారం) తెల్లవారుజామున 3.10 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 23 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. ప్రమాదంలో బి-1 ఏసీ బోగీ పూర్తిగా దగ్ధమైంది. మరో బోగీ పాక్షికంగా దగ్ధమైంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా కొత్తచెరువు, పుట్టపర్తి రైల్వే స్టేషన్ల మధ్య రైల్లో మంటలు వ్యాపించాయి. రైల్లోని ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏసీ బోగీ బి వన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ బోగీలోని వారందరూ మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.

         ఈ విషయాన్ని గమనించిన అధికారులు రైలును పుట్టపర్తి రైల్వే స్టేషన్ లో ఆపివేసి ఏసీ బోగీల లింక్ ను తొలగించారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా మంటలు రెండో బోగీకి వ్యాపించాయి. ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది. రెండు బోగీల్లో 72 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన 15 మంది మృత దేహాలను వెలుపలికి తీశారు.
రైలు ప్రమాద హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లు- బెంగళూరు: 080-22354108, 22251271, 22156554, 22156553
పుట్టపర్తి ప్రశాంతి నిలయం : 08555-280125


21, డిసెంబర్ 2013, శనివారం

famous stepwell...

      Chand Baori is a famous stepwell situated in the village Abhaneri near Jaipur in Indian state of Rajasthan. This step well is located opposite Harshat Mata Temple and is one of the deepest and largest step wells in India. It was built in 9th century and has 3500 narrow steps and 13 stories and is 100 feet deep. It is a fine example of the architectural excellence prevalent in the past.








12, డిసెంబర్ 2013, గురువారం

ప్రకృతి అందాలతో అలరాకే చిత్తూరు...

                 ఆంధ్రప్రదేశ్‌లో అతి పొడవైన పర్వతశ్రేణులంటే గుర్తొచ్చేది తూర్పు కనుమలే. ఇవి చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దు నుంచి ప్రారంభమవుతాయి. చిత్తూరు జిల్లాలో దట్టమైన అడవి, పచ్చటి చెట్లు ఉన్న కొండలపైన తిరుమల క్షేత్రం, పర్వత పాదభాగంలో తిరుపతి నగరం ఉన్నాయి. కింద తిరుపతి నుండి పైకి చూస్తే, ఏడుకొండల శ్రేణి... మహా సర్పంలా, తిరుమల ప్రాంతం... పడగలా కన్పిస్తుంది. భారతదేశంలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి అగ్రస్థానంలో ఉంది. చుట్టుపక్కల ఉన్న సహజ మానవ నిర్మిత ఆకర్షణలతో చక్కటి యాత్రాస్థలంగా, సెలవు కాలపు నెలవుగా విరాజిల్లుతోంది. ఏడుకొండల ఘాట్‌ రోడ్డులో ప్రయాణ అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. 
       తిరుమల దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. సంవత్సరం పొడవునా లక్షలాది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తండోప తండాలుగా తరలివస్తారు. ఈ ఆలయం గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విశేషాలను ప్రస్తావించారు. తిరుమల ఆలయానికి మహరాజ పోషకులుగా పల్లవులు, పాండ్యులు, చోళులు, విజయనగర పాలకులు, మైసూరు మహారాజులు చరిత్రకెక్కారు.
             తిరుమల ప్రధాన ఆలయం ప్రాచీన భారతీయ శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. గర్భగుడిపై ఉండే విమానం, ధ్వజస్థంభం పైపొరలు బంగారు తాపడంతో చేసినవి. 

5, డిసెంబర్ 2013, గురువారం

10 జిల్లాల తెలంగాణకే కేబినెట్ ఆమోద ముద్ర

 తెలంగాణ బిల్లుపై ఉత్కంఠకు దాదాపుగా తెర పడింది. 10 జిల్లాల తెలంగాణకే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రేటర్ హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. జీవోఎం తయారు చేసిన బిల్లు ముసాయిదాను కేబినెట్ సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదించినట్లు హోంమంత్రి షిండే అధికారికంగా ప్రకటించారు. అన్ని వర్గాలను సంప్రతించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. 

3, డిసెంబర్ 2013, మంగళవారం

పాలమూరు పాపికొండలు...

పాపికొండలంటే గుర్తొచ్చేది గోదారమ్మే!
కానీ... అంతే స్థాయిలో కృష్ణమ్మ పొదువుకున్న సింగారాలున్నాయి !
ఎత్తయిన కొండల మధ్య... కృష్ణమ్మకు పచ్చని పట్టు చీరె కట్టినట్లుండే దుర్గమారణ్యం నడుమ...
 ప్రకృతి కుంచె దిద్దితీర్చిన ఓ అద్భుత చిత్తరువు... 
వంద కిలోమీటర్ల పొడవునా మెరిసిపోతూ మురిసిపోతుంటుంది!
పడవెక్కి బయల్దేరితే... ఆప్యాయంగా పలకరిస్తుంటుంది !
మొన్నటి దాకా పోలీసులు, మావోయిస్టుల తుపాకులు పలకరించుకున్న ప్రాంతం... 
ఇప్పుడు జాలర్లు హైలెస్సా అంటూ పాడే పాటలకు మౌనంగా గొంతుకలుపుతున్నది !
అసలు అంతటి అద్భుత ప్రాంతం  కృష్ణమ్మకు సొంతమని చాలా తక్కువ మందికే తెలుసు!
అక్కడికి వెళ్ళేవారెవరు ? ఆ అందాలు వెలికి తీసి... బయట ప్రపంచానికి చాటేదెవరు ?
 నమస్తే తెలంగాణ పత్రిక ప్రయత్నం చేసింది! బాధ్యత తీసుకుంది!
భావి తెలంగాణలో మరో అద్భుత పర్యాటక ప్రాంతమయ్యేందుకు సకల అర్హతలూ ఉన్న ఒక ప్రకృతి నిలయాన్ని అత్యంత సాహసానికోర్చి... కన్నులారా చూసింది!
తన కళ్లతో తెలంగాణ ప్రజలకు అందిస్తున్నది !! 
               ఎవరా ప్రకృతి రమణి ?         ఎక్కడుందా రమణీయ కాంతి ? 


హైదరాబాద్‌ నుండి దాదాపు 170 కి.మీ. దూరం ప్రయాణిస్తే కొల్లాపూర్‌ (మహబూబ్‌నగర్‌ జిల్లా) పట్టణం వస్తుంది. అక్కడి నుండి మరో 8 కి.మీ. ముందుకెళితే పవిత్ర ఆలయాలకు నెలవైన సోమశిల, ఆ ఊరిని పెనవేసుకున్న కృష్ణానది దర్శనమిస్తాయి.

16, నవంబర్ 2013, శనివారం

సచిన్ కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న...

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం దక్కింది. సచిన్ కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ కార్యాలయం శనివారం (16.11.13) ప్రకటించింది. ఇదే రోజు కెరీర్ కు వీడ్కోలు పలికిన మాస్టర్ కు అత్యున్నత పురస్కారం ప్రకటించడం విశేషం.

భారత క్రీడా చరిత్రలో అత్యున్నత పౌరపురస్కారం అందుకోనున్న తొలి క్రీడాకారుడిగా సచిన్ ఘనత సాధించనున్నాడు. భారత క్రికెట్ కు విశేష సేవలు అందించినందుకుగాను ఈ అవార్డును బహూకరించనున్నారు. మాస్టర్ కు భారతరత్న ఇవ్వాలని పలువురు రాజకీయ నాయకులు, వివిధ రంగాల వ్యక్తులు రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ రోజునే సచిన్ కు అవార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించడంతో అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

 వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ 126 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో 43 /3 పరుగుల ఓవర్ నైట్ తో ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు 187 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

5, నవంబర్ 2013, మంగళవారం

కా.జనార్దన్ (ఎస్.ఎఫ్.ఐ. ఓయు ) అందుకో .. మా నివాళి .

జనార్దన్ నీవు బ్రతికున్నప్పుడు 
అప్పుడప్పుదే జ్ణాపకమొచ్చే వాడివెమో,
నీవు భౌతికంగా వుండవు కావొచ్చు ,
కాని శాశ్వతంగా మా హ్రుదయాలలొ నిలిచిపోతావు.
నిన్నెరిగిన ఎవరికైనా నిను మరవడం ఎలా సాద్యం .

ఉస్మానియా లో యెస్ ఎఫ్ ఐ జెండాని ఎత్తిపట్టావు.
బడుగు బలహీన విద్యార్థులకు బంధువయ్యావు.
అవసరమైనప్పుడల్ల "జనార్దన్" ఉన్నాడని భరోసా ఇచ్చావు.
మారుతున్న సమాజ క్రమము లో స్రుజనాత్మకత వెదికావు.
సామాజిక న్యాయం నిరంతర నినాదం కావాలని తపించావు.


30, అక్టోబర్ 2013, బుధవారం

బస్సు దగ్ధమవడంతో 44 మంది సజీవదహనం..


              మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తకోట మండలం, పాలెం గ్రామం వద్ద ఉ.5.20 ని.కు ( 30.10.13) ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై  తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేస్తున్నాను.  వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.  ప్రమాద ఘటనలో  చాల చాల గోరంగా అగ్నికి ఆహుతి అయ్యారు. 
             బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు కల్వర్టు (లేదా దివైడర్ )ను ఢీకొనడంతో.. బస్సు డీజిల్ ట్యాంకర్ పేలింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. వోల్వో బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 44 మంది మృతి చెందినట్లు సమాచారం. బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు, డ్రైవరు, క్లీనరు ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున కావడంతో ప్రయాణికులందరూ నిద్రావస్థలో ఉన్నారు. దీంతో డ్రైవరు, క్లీనర్ సహా మరో ఐదుగురు మాత్రమే తమ ప్రాణాలు దక్కించుకున్నారు. వీరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారు వనపర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు నెం. AP 02  TA 0963. డ్రైవరు నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. జబ్బర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు  అయినట్లు తెలుస్తోంది.    

26, అక్టోబర్ 2013, శనివారం

క్రిక్కిరిసిన యాత్రా స్థలలో ఒకటిగా షిర్డీ...

         షిర్డీ అనే చిన్న పట్టణం ప్రపంచ వ్యాప్తంగా వున్నా సాయి భక్తుల భక్తి తత్పరతతో గుబాళిస్తుంది. ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ఈ పల్లెకు అగ్ర తాంబూలం వుంది. క్షేత్రాన్ని ఏడాదిలో ఎప్పుడైనా చూడవచ్చు, కాని వర్షాకాలంలో ఇక్కడ వాతావరణం హాయి గోల్పేదిగా వుంటుంది కనక, వర్షాకాలంలో దర్శించడం మంచిది.  షిర్డిలో జరిగే ప్రధాన పండుగలు – గురు పూర్ణిమ, దసరా, శ్రీరామనవమి.
       
         తిరుపతి తర్వాత భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం ఇది. సాధారణ దినాల్లో రోజూ ముప్పై వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. అదే పర్వ దినాలలొ అయితే వీరి సంఖ్య లక్షకు దాటుతుంది. హిందువుల యాత్రా స్థలాలలో ఒకటిగా షిరిడీ పరిగణింప బడుతున్నది. ఒక పాత, చిన్న గ్రామం, ఈ రోజు అది దేశంలో  క్రిక్కిరిసిన యాత్రా స్థలలో ఒకటిగా మారిపోయింది.  

             సాయి బాబా యొక్క క్షేత్రానికి రోడ్డు, రైలు  మార్గాల ద్వారా  తేలిగ్గానే చేరుకోవచ్చు. నాశిక్, పూణే, ముంబై ల నుంచి బస్సుల ద్వారా అనుసంధానం చేయబడింది. దగ్గరలోనే విమానాశ్రయం నిర్మిస్తున్నారు.  రోడ్డు ద్వారా ఐతే, అహ్మద్ నగర – మన్మాడ్ రాష్ట్ర రహదారి నెంబర్ 10  మీదుగా రావచ్చు.అహ్మద్ నగర జిల్లాలోని కోపర్గావ్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో వుంది.   హైదరాబాద్ నుండి ప్రతిరోజు రైలు వుంటుంది. ఆ రైలు దోరుకాకపొతే  అజంతా ఎక్స్‌ప్రెస్. ఇది సికింద్రాబాద్  మరియు మన్మాడ్ పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. నాగర్సూల్ లో దిగితే అక్కడి నుండి  42 కిలోమీటర్ల దూరంలో వుంది         

 ఈ దసర సెలవులలో (2013 అక్టోబర్ 10, 11 తేదిలలో) షిర్డీ పుణ్యక్షేత్రం, శని శింగనాపూర్ లను మా కుటుంబసభ్యులు, బందువులు, స్నేహితులతో కలసి సందర్శించడం జరిగింది.





13, అక్టోబర్ 2013, ఆదివారం

దసరా పండుగ శుభాకాంక్షలు...

మీకు, మీ కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు,  మిత్రులందరికి దసరా పండుగ శుభాకాంక్షలు...

3, అక్టోబర్ 2013, గురువారం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. ప్రధాని నివాసంలో గురువారం 03.10.2013 సాయంత్రం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందని చెప్పారు. పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపారు. విభజన నేపథ్యంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ మంత్రుల బృందం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ బృందం ఇరు ప్రాంతాల ప్రజల భయాందోళనలను పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఇది తెలంగాణ ప్రజల విజయం.

28, సెప్టెంబర్ 2013, శనివారం

దేశంకోసం తన ప్రాణాల్నివదిలిన విప్లవవీరుడు

భగత్‌సింగ్‌ 23 ఏళ్ళకే దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంభం ఎక్కిన త్యాగశీలురు. భగత్‌సింగ్‌ ఒక గొప్ప వీరుడుగా, సాహసిగా, ధైర్యవంతుడుగా బాగా సుపరిచితుడయ్యారు. 'ఇంక్విలాబ్‌-జిందాబాద్‌' అని వారు ఇచ్చిన నినాదం యావత్‌ జాతికి స్ఫూర్తిదాయకంగా మారి  సామ్రాజ్యవాదులను గడగడ లాడించాయి.

భగత్‌సింగ్‌ గొప్ప అధ్యయనశీలి, ఆలోచనాపరుడు. అందుకే విప్లవం, సోషలిజం, దేవుడు, మతం, టెర్రరిజం అనే విషయాలపై స్పష్టంగా తన అభిప్రాయాలను వివరించాడు. సెప్టెంబర్‌ 28న భగత్‌సింగ్‌ 107వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ఆయన భావాలను ప్రజల ముందుంచడం అవసరం. సమాజ సేవ, సామాజిక న్యాయం, దేశ సార్వభౌమాధికారం, జాతీయ సమైక్యత, సమగ్రత, మానవత్వం, మత సామరస్యం కోసం పాటుపడాలనే చైతన్యాన్ని యువతలో పెంపొందించాలి. 

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఏడు ద్వీపాల సమూహం...


ఏడు ద్వీపాల సమూహం.. లక్నవరం సరసు
వరంగల్ నుంచి ములుగు వెళ్లే దారిలో లక్నవరం ఉంది. మూడు వైపులా కొండలు, మధ్యలో 10 వేల ఎకరాల్లో ఈ చెరువు విస్తరించి ఉంది. ఏడు చిన్నచిన్న ద్వీపాలుగా ఉన్న లక్నవరం కాకతీయుల నాటి నిర్మాణం. సరస్సులోని ద్వీపాలను కలుపుతూ పర్యాటక శాఖ నిర్మించిన ఊయల వంతెన(సస్పెన్షన్ బ్రిడ్జి) ప్రధాన ఆకర్షణ. బోటింగ్ సౌకర్యంతో పాటు కాటేజీలు ఉన్నాయి. ఇటీవలే ప్రారంభమైన లేక్‌వ్యూ రెస్టారెంట్ సరికొత్త రుచుల్ని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి 212 కిలోమీటర్ల దూరంలో ఉందీ లక్నవరం.

ఇలా చేరుకోవచ్చు...
-హైదరాబాద్ నుంచి రైలు, బస్సు ద్వారా హన్మకొండ, వరంగల్ చేరుకోవచ్చు.
-అక్కడి నుంచి ములుగు వెళ్లే దారిలో 50 కిలో మీటర్ల దూరం వెళితే చల్వాయి గ్రామం వస్తుంది. 
-అక్కడ నుంచి కుడివైపు తిరిగి ప్రయాణిస్తే బుస్సాపూర్ దాటిన తర్వాత 
లక్నవరం సరస్సు వస్తుంది. ఒక్కొక్కరికీ బస్సు చార్జీ 
సుమారు రూ.150 వరకు అవుతుంది. 

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం (27.09.2013)


నమస్తే తెలంగాణ  సౌజన్యం తో...

25, సెప్టెంబర్ 2013, బుధవారం

యాత్రలంటే ఇష్టమా...

ప్రస్తుతం 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 141 రాష్ట్రపార్టీలయందున్నాయి. వీటిలో 660 సాంస్కృతిక, 166 సహజసిద్ధ మరియు 25 మిశ్రమ ప్రత్యేకతల ప్రదేశాలున్నాయి.

భారతదేశములోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా :-

1 తాజ్ మహల్, ఉత్తర ప్రదేశ్.ప్రపంచపు ఏడు వింతలు క్రొత్తవిలో ఒకటి.
2 ఆగ్రా కోట, ఉత్తర ప్రదేశ్
3 అజంతా గుహలు, మహారాష్ట్ర
4 బౌద్ధ స్థూపాలు సాంచి బౌద్ధ స్థూపాలు మధ్యప్రదేశ్, సాంచి, మధ్య ప్రదేశ్.
5 చంపానేర్-పావగఢ్ పురావస్తు వనం, గుజరాత్
6 ఛత్రపతి శివాజీ టెర్మినస్, మహారాష్ట్ర
7 గోవా చర్చీలు మరియు కాన్వెంట్లు గోవా
8 ఎలిఫెంటా గుహలు, మహారాష్ట్ర
9 ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర
10 ఫతేపూర్ సిక్రీ, ఉత్తర ప్రదేశ్
11 చోళులు నిర్మించిన మహాదేవాలయాలు, తమిళనాడు
12 హంపి వద్ద నిర్మాణ సమూహాలు, హంపి, కర్ణాటక
13 మహాబలిపురం వద్ద నిర్మాణ సమూహాలు, మహాబలిపురం, తమిళనాడు
14 పట్టాడకల్ వద్ద నిర్మాణ సమూహాలు, పట్టాడకల్, కర్ణాటక
15 హుమాయూన్ సమాధి, ఢిల్లీ
16 కాజీరంగా జాతీయవనం, అస్సాం
17 కియోలాడియో జాతీయవనం, రాజస్థాన్
18 ఖజురహో వద్ద నిర్మాణ సమూహాలు, ఖజురహో, మధ్య ప్రదేశ్
19 మహాబోధి మందిరం, బీహార్
20 మానస్ జాతీయ అభయారణ్యం, అస్సాం
21 భారత పర్వత రైల్వేలు
22 నందా దేవి జాతీయవనం మరియు పుష్పాల లోయ జాతీయ వనం, ఉత్తరాంచల్
23 కుతుబ్ మీనార్, ఢిల్లీ.
24 భింబేట్కా రాతికప్పులు, మధ్యప్రదేశ్
25 ఎర్ర కోట, న్యూఢిల్లీ
26 కోణార్క సూర్య దేవాలయం, ఒరిస్సా
27 సుందర్ బన్ జాతీయవనం, పశ్చిమ బెంగాల్.
28 

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

సంప్రదాయాలని రక్షించే గ్రామం "శిల్పారామం"

                   హైదరాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్ యొక్క హస్తకళలకే కాకుండా దేశ వ్యాప్తంగా కళలకి ప్రాముఖ్యత పొందిన ప్రాంతం. ప్రఖ్యాతి గాంచిన కళలు మరియు హస్త కళా వస్తువుల గ్రామం మాదాపూర్ లో హైటెక్ సిటీ కి దగ్గరలో ఉన్నది శిల్పారామం. భారత దేశం యొక్క పురాతన కళల సంప్రదాయాలని రక్షించే ఆలోచనతో ఈ గ్రామాన్ని నిర్మించారు.

           



1992 లో ప్రారంభమైన దేశం లో ని వివిధ సాంప్రదాయక పండుగలని చక్కగా నిర్వహించడం వలన ఈ గ్రామం జాతీయ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ పండుగలు వల్ల భారత దేశం యొక్క వివిధ హస్తకళాకృతుల గురించి తెలియడమే కాకుండా అంతరించిపోకుండా ప్రాచీన కళల ని సంరక్షించే అవకాశం కూడా మీకు లభిస్తుంది. 

సాంప్రదాయ ఆభరణాలు, ఎంబ్రాయిడరీ వస్త్రాలు, చేతితో చెక్కబడిన ఫర్నిచర్ అలాగే ఎన్నో రకాల వస్తువులని ఇక్కడ కొనుక్కోవచ్చు. కనుల విందుగా ఉండే పచ్చటి లాన్స్ లో ఈ గ్రామాన్ని నిర్మించారు. 

           మా కుటుంబసభ్యులతో కలిసి మొదటిసరి ఆదివారం (15.09.2013) శిల్పరామం ను సందర్శించడం జరిగింది.