30, అక్టోబర్ 2013, బుధవారం

బస్సు దగ్ధమవడంతో 44 మంది సజీవదహనం..


              మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తకోట మండలం, పాలెం గ్రామం వద్ద ఉ.5.20 ని.కు ( 30.10.13) ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై  తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేస్తున్నాను.  వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.  ప్రమాద ఘటనలో  చాల చాల గోరంగా అగ్నికి ఆహుతి అయ్యారు. 
             బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు కల్వర్టు (లేదా దివైడర్ )ను ఢీకొనడంతో.. బస్సు డీజిల్ ట్యాంకర్ పేలింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. వోల్వో బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 44 మంది మృతి చెందినట్లు సమాచారం. బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు, డ్రైవరు, క్లీనరు ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున కావడంతో ప్రయాణికులందరూ నిద్రావస్థలో ఉన్నారు. దీంతో డ్రైవరు, క్లీనర్ సహా మరో ఐదుగురు మాత్రమే తమ ప్రాణాలు దక్కించుకున్నారు. వీరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారు వనపర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు నెం. AP 02  TA 0963. డ్రైవరు నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. జబ్బర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు  అయినట్లు తెలుస్తోంది.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి