15, నవంబర్ 2011, మంగళవారం

పెట్రో ధరలు తగ్గింపు.......!

ఇటీవల పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తగ్గిన పెట్రోల్ ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమలు లోకి రానున్నాయి. లీటరుకు రూ. 2.25లు తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణంగా తెలియవచ్చింది.

             కాగా వారం రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. పెట్రో పెంపుపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ధరల తగ్గింపు కేవలం పార్లమెంట్‌ సమావేశాలు, యు.పి. ఏన్నికల ప్రచార కోసం మాత్రమే. గతంలో ఎన్నొ సార్లు అంతర్జాతీయంగా పెట్రో ఉత్త్పతులు తగ్గిన,  ధరలు మాత్రము తగ్గలేదు. వారం రోజుల క్రితం దేశ ప్రధాని పెరిగిన ధరలు తగ్గించేది లేదని స్ఫష్టం చేసిన విషయం తెలిసిందే.

(  ఆంధ్రజ్యోతి  పత్రిక సౌజన్యం తో...  )