30, అక్టోబర్ 2013, బుధవారం

బస్సు దగ్ధమవడంతో 44 మంది సజీవదహనం..


              మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తకోట మండలం, పాలెం గ్రామం వద్ద ఉ.5.20 ని.కు ( 30.10.13) ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై  తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేస్తున్నాను.  వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.  ప్రమాద ఘటనలో  చాల చాల గోరంగా అగ్నికి ఆహుతి అయ్యారు. 
             బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు కల్వర్టు (లేదా దివైడర్ )ను ఢీకొనడంతో.. బస్సు డీజిల్ ట్యాంకర్ పేలింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. వోల్వో బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 44 మంది మృతి చెందినట్లు సమాచారం. బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు, డ్రైవరు, క్లీనరు ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున కావడంతో ప్రయాణికులందరూ నిద్రావస్థలో ఉన్నారు. దీంతో డ్రైవరు, క్లీనర్ సహా మరో ఐదుగురు మాత్రమే తమ ప్రాణాలు దక్కించుకున్నారు. వీరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారు వనపర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు నెం. AP 02  TA 0963. డ్రైవరు నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. జబ్బర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు  అయినట్లు తెలుస్తోంది.    

26, అక్టోబర్ 2013, శనివారం

క్రిక్కిరిసిన యాత్రా స్థలలో ఒకటిగా షిర్డీ...

         షిర్డీ అనే చిన్న పట్టణం ప్రపంచ వ్యాప్తంగా వున్నా సాయి భక్తుల భక్తి తత్పరతతో గుబాళిస్తుంది. ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ఈ పల్లెకు అగ్ర తాంబూలం వుంది. క్షేత్రాన్ని ఏడాదిలో ఎప్పుడైనా చూడవచ్చు, కాని వర్షాకాలంలో ఇక్కడ వాతావరణం హాయి గోల్పేదిగా వుంటుంది కనక, వర్షాకాలంలో దర్శించడం మంచిది.  షిర్డిలో జరిగే ప్రధాన పండుగలు – గురు పూర్ణిమ, దసరా, శ్రీరామనవమి.
       
         తిరుపతి తర్వాత భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం ఇది. సాధారణ దినాల్లో రోజూ ముప్పై వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. అదే పర్వ దినాలలొ అయితే వీరి సంఖ్య లక్షకు దాటుతుంది. హిందువుల యాత్రా స్థలాలలో ఒకటిగా షిరిడీ పరిగణింప బడుతున్నది. ఒక పాత, చిన్న గ్రామం, ఈ రోజు అది దేశంలో  క్రిక్కిరిసిన యాత్రా స్థలలో ఒకటిగా మారిపోయింది.  

             సాయి బాబా యొక్క క్షేత్రానికి రోడ్డు, రైలు  మార్గాల ద్వారా  తేలిగ్గానే చేరుకోవచ్చు. నాశిక్, పూణే, ముంబై ల నుంచి బస్సుల ద్వారా అనుసంధానం చేయబడింది. దగ్గరలోనే విమానాశ్రయం నిర్మిస్తున్నారు.  రోడ్డు ద్వారా ఐతే, అహ్మద్ నగర – మన్మాడ్ రాష్ట్ర రహదారి నెంబర్ 10  మీదుగా రావచ్చు.అహ్మద్ నగర జిల్లాలోని కోపర్గావ్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో వుంది.   హైదరాబాద్ నుండి ప్రతిరోజు రైలు వుంటుంది. ఆ రైలు దోరుకాకపొతే  అజంతా ఎక్స్‌ప్రెస్. ఇది సికింద్రాబాద్  మరియు మన్మాడ్ పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. నాగర్సూల్ లో దిగితే అక్కడి నుండి  42 కిలోమీటర్ల దూరంలో వుంది         

 ఈ దసర సెలవులలో (2013 అక్టోబర్ 10, 11 తేదిలలో) షిర్డీ పుణ్యక్షేత్రం, శని శింగనాపూర్ లను మా కుటుంబసభ్యులు, బందువులు, స్నేహితులతో కలసి సందర్శించడం జరిగింది.

13, అక్టోబర్ 2013, ఆదివారం

దసరా పండుగ శుభాకాంక్షలు...

మీకు, మీ కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు,  మిత్రులందరికి దసరా పండుగ శుభాకాంక్షలు...

3, అక్టోబర్ 2013, గురువారం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. ప్రధాని నివాసంలో గురువారం 03.10.2013 సాయంత్రం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందని చెప్పారు. పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపారు. విభజన నేపథ్యంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ మంత్రుల బృందం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ బృందం ఇరు ప్రాంతాల ప్రజల భయాందోళనలను పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఇది తెలంగాణ ప్రజల విజయం.