షిర్డీ అనే చిన్న పట్టణం ప్రపంచ వ్యాప్తంగా వున్నా సాయి భక్తుల భక్తి తత్పరతతో గుబాళిస్తుంది. ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ఈ పల్లెకు అగ్ర తాంబూలం వుంది. క్షేత్రాన్ని ఏడాదిలో ఎప్పుడైనా చూడవచ్చు, కాని వర్షాకాలంలో ఇక్కడ వాతావరణం హాయి గోల్పేదిగా వుంటుంది కనక, వర్షాకాలంలో దర్శించడం మంచిది. షిర్డిలో జరిగే ప్రధాన పండుగలు – గురు పూర్ణిమ, దసరా, శ్రీరామనవమి.
సాయి బాబా యొక్క క్షేత్రానికి రోడ్డు, రైలు మార్గాల ద్వారా తేలిగ్గానే చేరుకోవచ్చు. నాశిక్, పూణే, ముంబై ల నుంచి బస్సుల ద్వారా అనుసంధానం చేయబడింది. దగ్గరలోనే విమానాశ్రయం నిర్మిస్తున్నారు. రోడ్డు ద్వారా ఐతే, అహ్మద్ నగర – మన్మాడ్ రాష్ట్ర రహదారి నెంబర్ 10 మీదుగా రావచ్చు.అహ్మద్ నగర జిల్లాలోని కోపర్గావ్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో వుంది. హైదరాబాద్ నుండి ప్రతిరోజు రైలు వుంటుంది. ఆ రైలు దోరుకాకపొతే అజంతా ఎక్స్‌ప్రెస్. ఇది సికింద్రాబాద్ మరియు మన్మాడ్ పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. నాగర్సూల్ లో దిగితే అక్కడి నుండి 42 కిలోమీటర్ల దూరంలో వుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి