30, ఏప్రిల్ 2016, శనివారం

"నీట్"రాయాల్సిందే...

 మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలను 2016-17 విద్యా సంవత్సరం నుంచే ‘నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్టు (నీట్)’ ద్వారా చేపట్టాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర విద్య, వైద్య శాఖలు తర్జనభర్జన పడుతున్నాయి. ‘నీట్’ నుంచి ఈ ఏడాది ఎలా బయటపడాలన్న దానిపై దృష్టి సారించాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎంసెట్, ప్రైవేటు మెడ్‌సెట్ నోటిఫికేషన్లు జారీ చేయడం, మేలో ఎంసెట్ పరీక్ష నేపథ్యంలో సుప్రీం ఇచ్చిన తీర్పుతో అధికారుల్లో గందరగోళం నెలకొంది. విద్యార్థులు ‘నీట్’ పరీక్షకు హాజరుకావాలా, లేదా అన్న సందిగ్ధంలో మునిగిపోయారు.....



28, ఏప్రిల్ 2016, గురువారం

భగత్‌సింగ్‌ 'విప్లవ ఉగ్రవాది'.....!

...... ఢిల్లీ యూనివర్సిటీ రెఫరెన్స్‌ బుక్‌లో చరిత్ర రచయితల విశ్లేషణ
....... హెచ్‌ఆర్‌డీతోపాటు వీసీకి భగత్‌సింగ్‌ బంధువుల ఫిర్యాదు 
వలసపాలన నుంచి మాతృదేశ విముక్తి కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన యోధుడు ఆయన. స్వాతంత్య్రోద్యమకాలం నుంచీ నేటి వరకూ ఈ దేశ యువత ఆయణ్ని విప్లవ యోధుడిగానే అభిమానించింది, ఆరాధించింది. గొప్ప దేశభక్తుడిగా అందరి అభిమానాన్నీ చూరగొన్న భగత్‌సింగ్‌..ఇద్దరు చరిత్ర రచయితలకు మాత్రం 'విప్లవ ఉగ్రవాది'గా కనిపించారు.....


25, ఏప్రిల్ 2016, సోమవారం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటతడి...

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటతడి...
ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌.ఠాకూర్‌ కంటతడిపెట్టారు. ఈ సదస్సు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఆదివారం 24.04.2016 జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇతర పెద్దల సమక్షంలోనే సీజే కంటతడి పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి, ఆవేదనకు గురి చేసింది.



14, ఏప్రిల్ 2016, గురువారం

గ్రేటెస్ట్ ఇండియన్...

 డా. బాబాసాహెబ్ అంబేద్కర్ - తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని  అంశాలు.....
- ఒక గొప్ప సామాజిక శాస్త్రవేత్త..
- ఒక ప్రఖ్యాత న్యాయకోవిదుడు..
- ఒక విశిష్టమైన చరిత్రకారుడు..
- ఒక ప్రతిష్టాత్మక ఆర్థిక శాస్త్రవేత్త..
- ఒక అద్భుతమైన రచయిత..
- ఒక తిరుగులేని ఉద్యమకారుడు..
- ప్రజలను కట్టిపడేయగల వక్త.. 
- ప్రపంచంలో మరెవరూ చదవలేనన్ని డిగ్రీలను అందుకున్న ప్రపంచ మేధావి..
- భారత రాజ్యాంగ నిర్మాత..
- అన్నిటికంటే ముఖ్యంగా ఒక మానవతావాది, స్వేచ్చ, సమానత్వ స్థాపన కోసం,తపన పడ్డ సామాజిక విప్లవకారుడు..
- భారత భూమిపై నడయాడిన ఒక... ☆☆ " గ్రేటెస్ట్ ఇండియన్" "Greatest Indian"☆☆
      "జీవితం సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదు, గొప్పగా ఉండాలని" బాబాసాహెబ్ చెప్పిన మాటలు ఆయనకే వర్తించాయి.. 
 ((☞☞ పైన విషయాలు కొన్ని మాత్రమే, బాబాసాహెబ్ గురించీ మీరు కూడా మీకు తెలిసిన కొన్ని జోడించి, మన ఇంట్లో పిల్లలకు ఈ విషయాలు అవగాహన కల్పించకడి., కుదిరితే మీ దగ్గర లోని .... హాస్టల్ లకు ఒక సాయంత్రం వెళ్ళి బాబాసాహెబ్ నిజమైన గొప్పతనాన్ని మన తరువాతి తరాలకు వివరించండి ☜☜ ))

8, ఏప్రిల్ 2016, శుక్రవారం

తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు....

మీకు మరియు మీ కుటుంబ సభ్యుల కు
 ఉగాది...దుర్ముఖి నామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు....
 మీకు ఈ సంవత్సరం ఎల్లవేళలా దిగ్విజయం గా కొనసాగాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి .

6, ఏప్రిల్ 2016, బుధవారం

తల్లిదండ్రుల్లరా ఒక సారి ఆలోచించండి...

తల్లిదండ్రుల్లరా ఒక సారి ఆలోచించండి...
  కొంతమంది పిల్లల గురించి జాగ్రత్తలు తీసుకొండి...  06.04.16 eenadu