19, నవంబర్ 2017, ఆదివారం

ఫంక్షన్ లో కలిసిన స్కూల్‌ బ్యాచ్‌ స్నేహితుల బృందం...

కె. రాము కుటుంబముతో ...
ఒక ఫంక్షన్ లో హైదరాబాద్ లో కలిసిన

రేమద్దుల స్కూల్‌ బ్యాచ్‌ స్నేహితుల బృందం...15.11.2017
9, నవంబర్ 2017, గురువారం

దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది...?

దేశ రాజధాని ఢిల్లీకి ఏమైంది...?
కాలుష్యం, పొగమంచు వల్ల రెండ్రోజులుగా ఊపిరాడని పరిస్థితి...
పక్క రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలు తగులబెడుతుండటంతో ఢిల్లీ వైపు పొగ...
అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు హెచ్చరిక...
అత్యవసర పరిస్థితి ప్రకటించిన జాతీయ కాలుష్య నియంత్రణ మండలి...8, నవంబర్ 2017, బుధవారం

18 కార్లు ఒకదానికొకటి..ఢీ

కాలుష్య మేఘాలతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి...
ఈ రోజు 11 మంది మృతి (9 మంది విద్యార్థులు)..
 భారత వైద్య మండలి ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది...
ఒకవైపు దట్టంగా కమ్మేసిన పొగ మంచు.. మరోవైపు కాలుష్య మేఘాలతో దేశ రాజధాని ఢిల్లీ మంగళవారం,బుధవారం ఉక్కిరిబిక్కి రైంది. పంజాబ్, హరియాణాల్లో పంటలను కాల్చడం వల్ల వెలువడిన పొగ, వేడి గాలు లకు.. ఉత్తరప్రదేశ్‌ మీదుగా వీస్తున్న మంచుతో కూడిన చలిగాలులు తోడవ్వడంతో ఢిల్లీ వాసులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
                 ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఊహించని రీతిలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.  ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పొగమంచు కారణంగా అలాగే బుధవారం పంజాబ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు దుర్మరణం చెందారు.  కాగా  గ్రేటర్ నోయిడా దన్‌కౌర్ ప్రాంతంలో గౌతమ్‌ బుద్ధా నగర్‌ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌ వే వద్ద సుమారు పది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో పలువురు గాయపడ్డారు. 
పొగమంచు ఒకవైపు..మరోవైపు కాలుష్యం వెదజల్లుతుండడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా.. భారత వైద్య మండలి ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. విద్యా సంస్థలు మూసివేయాలని.. తప్పనిసరైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.


1, నవంబర్ 2017, బుధవారం

వాయువు... తీస్తోంది ఆయువు...

వాయువు... తీస్తోంది ఆయువు...
ఎన్నడూలేనంతగా పర్యావరణానికి ముప్పు...
హైదరాబాద్ నగరంలో రోజు రోజు పెరుగుతున్న వైనం...31, అక్టోబర్ 2017, మంగళవారం

ఇంకా వాతావరణంలోకి ఆక్సీజన్‌ విడుదల కాదు....

ఎన్నడూలేనంతగా పర్యావరణానికి ముప్పు...
- వాతావరణంలోకి రికార్డుస్థాయిలో కార్బన్‌ డయాక్సైడ్‌,
- ఎల్‌నీనో, మానవుడి చర్యలే ఇందుకు కారణం ...
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూయంఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 
ఒక్కమాటలో చెప్పాలంటే అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాలు ఏర్పడతాయి.
మొక్కలు, చెట్లు పెరిగే పరిస్థితి ఉండదు. వాతావరణంలోకి ఆక్సీజన్‌ విడుదల కాదు....


27, అక్టోబర్ 2017, శుక్రవారం

నల్లమలలో నదీయాత్ర....

కాశ్మీర్ అందాలను తలపిస్తూ..
ఊటీ సోయగాలను మరిపిస్తూ..
విహారం, వినోదం కలగలిసిన యాత్ర ఇది.
తెలుగు నేలను అన్నపూర్ణగా మార్చిన నాగార్జున సాగరాన మొదలై..
కృష్ణవేణి అలల పై.. విదేశాలను సైతం మరిపించేంతటి రమణీయత కలిగిన
ఆకుపచ్చని నల్లమలల గుండా.. రాజులు కట్టి..24, అక్టోబర్ 2017, మంగళవారం

గాలి కాదు...గరళం...

హైదరాబాద్ మరియు రాష్ర్టంలో...
తీవ్రరూపం దాల్చుతున్న వాయు కాలుష్యం...


21, అక్టోబర్ 2017, శనివారం

25 లక్షల మరణాలతో తొలి స్థానంలో భారత్...

యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆకలి కన్నా ఎక్కువ మందిని బలిగొంటున్న కాలుష్యం... 
2015లో ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది మృతి.. 
25 లక్షల మరణాలతో తొలి స్థానంలో భారత్.. 18 లక్షల మరణాలతో రెండో స్థానంలో చైనా..
కాలుష్యానికీ పేదలే బలిపశువులు..పేదదేశాల్లోనే కాలుష్యం ఎక్కువ. 
కాలుష్యం మరణాల్లో పేదల సంఖ్యే అత్యధికం.సంపన్న దేశాల్లో కాలుష్యం తక్కువే అయినప్పటికీ అక్కడా పేదలే దానికి బలవుతుంటారు.13, అక్టోబర్ 2017, శుక్రవారం

దీపాలతో ''దీపావళి'' జరుపుకుందాం...

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిద్దాం. డీల్లీ బాటలోనే మన హైదరాబాద్‌...
దీపాలతో ''దీపావళి'' జరుపుకుందాం...
పర్యావరణాన్ని కాపాడుకుందాం...10, అక్టోబర్ 2017, మంగళవారం

అణువణువూ విషపూరితమే...

బాణా సంచా కాల్చడం వల్ల వాయు నాణ్యత దారుణంగా, 
ప్రమాదకరమైన స్థాయికి క్షీణించి పోతున్నది....
నగరం ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరౌతూదనీ సుప్రీంకోర్టు తెలిపింది.
డీల్లీలో ఈ నెల 31 వరకు బాణా సంచా అమ్మకాలు  నిషేదం విదించింది సుప్రీంకోర్టు.
గత దీపావళి సమయంలో డీల్లీలో పాఠశాలలను మూసేయాల్సి పరిస్థితి వచ్చింది...

7, అక్టోబర్ 2017, శనివారం

మ్యాన్‌ హోళ్ల మరమ్మతులు పరిశీలన...

హైదరాబాద్‌ : నల్లకుంట డివిజన్‌లో పాత రామాలయం ఏరియాలో మ్యాన్‌ హోళ్ల మరమ్మతులు, 
సమస్యలను జిహెచ్‌ఎంసి -16 డిప్యూటి కమీషనర్‌ (డిసి) శ్రీ శ్రీనివాస్‌రెడ్డి గారు 
సందర్శించి, పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు 
జిహెచ్‌ఎంసి ఇఇ శ్రీ నిత్యనంద్‌, ఏఇ ఉపేందర్‌, వాటర్‌వర్క్స్‌ డిజిఎం రమణరెడ్డి, 
మేనేజర్‌ షాకీర్‌ వున్నారు. ఈ కార్యక్రమంలో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' 
నగర ఉపద్యాక్షుడు కె.వీరయ్య, స్థానిక నాయకులు డి. మోహన్‌, సునిల్‌, వినోద్‌, అమర్‌నాద్‌ తదితరులు పాల్గొన్నారు.
24, సెప్టెంబర్ 2017, ఆదివారం

చెప్పుకోలేని వేదన...

డాక్టర్లు, సిబ్బంది కొరతతో రోగులకు తీవ్ర ఇక్కట్లు...
వైద్య శాఖలో 11 వేల పోస్టులు ఖాళీ...
ఇది మన తెలంగాణ లో... హైదరాబాద్ లోని కోఠిలో.....

15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

మంట గలిసిన మానవత్వం...

బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని యాజమాని.
హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున కూకట్‌పల్లి సర్కిల్‌ వెంకటేశ్వర నగర్‌లో ఘటన.
మానవత్వం చచ్చిపోయింది. కూతురు వివాహం జరిగి సంవత్సరం దాటలేదని, బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు ఇంటి యాజయాని. గత్యంతరం లేక ఓ తల్లి కమారుడిి మృతదేహాం పాటు రాత్రంతా వర్షంలో ఉండిపోయింది.అత్యాధునిక యుగం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో దూసుకుపోతున్నా...సమాజాన్ని ఇంకా మూఢ నమ్మకాలు పట్టి పీడిస్తూన్నాయనడానికి ఇది ఓ తార్కాణం.


14, సెప్టెంబర్ 2017, గురువారం

ఫోన్‌ వస్తే చాలా జాగ్రతగా వుండండి...

బ్యాంక్‌ నుంచి అని, ఇన్సూరెన్స్‌ అని, అన్‌లైన్‌లో వస్తువు కొన్నపుడు గాని... ఫోన్‌ వస్తే నమ్మకండి...
కొత్త తరహాలో రెచ్చిపోతున్న నేరస్థులు... చాలా జాగ్రతగా వుండండి.

మీకు ఫోన్‌ వచ్చినపుడు ఆధార్‌ కార్డు నెం.కాని, డెబిట్‌ కార్డు నెం.కాని, మీ పుట్టిన తేదీ కాని చెప్పకుండ చూసుకోండి.
 మీకు సందేహాలు, సమస్యలు వుంటే మీ బ్రాంచ్‌ మేనేజర్‌ను / ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌ను కలువండి.


9, సెప్టెంబర్ 2017, శనివారం

మంచినీటిలో విషం ...

మనం త్రాగే మినరల్‌ వాటర్‌ స్వచ్ఛమైనదేనా ... ప్యూరిఫయర్ల నుంచి వచ్చే నీరెనా ...
అయిన శుద్ధి చేసిన నీటిలో బ్యాక్టీరియా లేకపోవచ్చు.... కానీ ప్లాస్టిక్‌ కాలుష్యం వుందంటా...
మానవ సమాజ మనుగడకే ముష్పుగా పరిణమిస్తున్నఃః కాలుష్యాన్నిఃః నియంత్రించాల్సిన అవసరం మన అందరిపైన వుంది....8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

కాలుష్యంతో చేపల మృతి...

హైదరాబాద్‌ నగరం చుట్టు ప్రాంతాలలో కంపెనీల విషరసాయనాలు భూమిపై వదిలివేడంతో,
ఆ నీరు చెరువులలోకి చేరటం వల్ల కాలుష్యం మరింత పెరిగిపోతున్నది.
చెరువుల పరిసర కాలనీలలోని డ్రైనేజి పైప్‌ లైన్లు ఆయా చెరువులలో కలిపేస్తున్నారు.
ఫలితంగా చెరువులన్నీ కాలుష్య భరితమై-దుర్గంధంతో 
దోమల కేంద్రాలుగా కూడా తయారయ్యాయి.   ఈ పరిస్థితి... చూడండి.....

6, సెప్టెంబర్ 2017, బుధవారం

గౌతమ్‌ గ్రేట్ ...

ప్రముఖ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ 
మరొకసారి తన క్రీడాస్ఫూర్తితో ముందుకొచ్చారు.
ఉగ్రవాదుల చేతిలో అమరుడైన పోలీసు కుమార్తెకు 
అండగా వుంటానాని, జీవితాంతం తన ఖర్చులతో చవిస్తానాని అన్నారు.
అందరికీ ఆదర్శంగా నిలిచారు....
గొప్ప క్రీడాకారుడు...
గౌతమ్‌ గంభీర్‌కు అభినందనలు.

26, ఆగస్టు 2017, శనివారం

కాలుష్యాము మానవ మనుగడకే ముప్పు...

మీకు మీ కుటుంబ సభ్యులకు 
వినాయక చవితి శుభాకాంక్షలు ..... వీరయ్య కె

25.08.2017  హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో...
ఓల్డ్‌ నల్లకుంట, ఎస్‌బిఐ పార్క్‌( బాగ్‌అంబర్‌పేట )లలో 
"ఉచితం గా మట్టి వినాయకుల పంపిణీ" కార్యక్రమాలు... 
రాజగోపాల్‌ రెడ్డి, మల్లం రమేష్‌, డా|| బాల్‌రాజు, డా|| జయసూర్య, ఎస్‌. లక్ష్మయ్య, సుందర్‌ రామ్‌ ప్రసన్న,
కె. వీరయ్య, మోహన్‌, శ్రీనివాస్‌ తదితరులు...


15, ఆగస్టు 2017, మంగళవారం

మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం... పర్యావరణాన్ని కాపాడదాం... మేయర్‌

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో ....
14.08.2017  పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న జిహెచ్‌ఎంసి మేయర్‌ శ్రీ బొంతు రామ్మోహన్‌ గారు,

 హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు పాశం యాదగిరి గారు .
మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం... పర్యావరణాన్ని కాపాడదాం...