కాలుష్య మేఘాలతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి...
ఈ రోజు 11 మంది మృతి (9 మంది విద్యార్థులు)..
భారత వైద్య మండలి ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది...
ఒకవైపు దట్టంగా కమ్మేసిన పొగ మంచు.. మరోవైపు కాలుష్య మేఘాలతో దేశ రాజధాని ఢిల్లీ మంగళవారం,బుధవారం ఉక్కిరిబిక్కి రైంది. పంజాబ్, హరియాణాల్లో పంటలను కాల్చడం వల్ల వెలువడిన పొగ, వేడి గాలు లకు.. ఉత్తరప్రదేశ్ మీదుగా వీస్తున్న మంచుతో కూడిన చలిగాలులు తోడవ్వడంతో ఢిల్లీ వాసులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఊహించని రీతిలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పొగమంచు కారణంగా అలాగే బుధవారం పంజాబ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. కాగా గ్రేటర్ నోయిడా దన్‌కౌర్ ప్రాంతంలో గౌతమ్ బుద్ధా నగర్ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద సుమారు పది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో పలువురు గాయపడ్డారు.
పొగమంచు ఒకవైపు..మరోవైపు కాలుష్యం వెదజల్లుతుండడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా.. భారత వైద్య మండలి ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. విద్యా సంస్థలు మూసివేయాలని.. తప్పనిసరైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి