1, మే 2019, బుధవారం

సూచనలొద్దు ...ఆచరించండి...

కాలుష్య నివారణకు చర్యలు తీసుకోండి...
తెలంగాణ రాష్ట్రంలో కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు అవసరమని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ధర్మాసనం అభిప్రాయపడింది. అసలు పర్యావరణ కాలుష్యానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని ఎన్జీటీ ప్రశ్నించింది. పర్యావరణాన్ని కాపాడటం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఉద్ఘాటించింది. సోమవారం ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ కాలుష్య నియంత్రణపై విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ ఎస్‌కే జోషితో పాటు పీసీబీ అధికారులు సైతం హాజరయ్యారు.
        తెలంగాణలో అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న విషయంపై ఎన్జీటీ ఘాటుగా స్పందించింది. స్థానిక కలెక్టర్లతో రాష్ట్ర సీఎస్‌, పీసీబీ అధికారులు నెలకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. దీనికి స్పందించిన సీఎస్‌ ఇక నుంచి ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. ఆరు నెలల్లో కాలుష్య నియంత్రణ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించింది. మరో ఆరు నెలల తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలను పూర్తిమేర సమీక్షిస్తామని హరిత ట్రిబ్యూనల్‌ ధర్మాసనం విచారణ సందర్భంగా చెప్పింది.


29, ఏప్రిల్ 2019, సోమవారం

నడి వయసులో ధీమాగా ఉండాలంటే బీమా అవసరం...

ఈ వయసులో ఆర్థికంగా స్థిరత్వం సాధించి ఉంటారు. మరికొందరు ఇప్పుడిప్పుడే తమ భవిష్యత్ ప్రణాళికలను వేసుకుంటారు... ఉద్యోగంలో చేరిన కొత్తలో బీమా పాలసీలు వేరు, నడి వయసులో బీమా పాలసీలు వేరు... ఇప్పుడు అన్ని రకాలుగా బాధ్యతలు పెరిగి ఉంటాయి. అందుకు అనుగుణంగా ఇప్పుడు బీమా పాలసీలు ఆలోచించాలి...

27, ఏప్రిల్ 2019, శనివారం

తెలంగాణ లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు...

 తెలంగాణ లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు...
 మే 6 మొదటి విడతలో , మే 10 రెండో విడతలో , మే 14 మూడో విడతలో  ఓటింగ్‌ జరగనుంది. 24, ఏప్రిల్ 2019, బుధవారం

చేతులెత్తేసారా?...

- ఇంటర్‌లో అవకతవకలపై ప్రభుత్వానికి హైకోర్టు చురకలు
- యంత్రాంగం లేదని బాధ్యతల నుండి తప్పుకోవద్దు
- మీనమేషాలు లెక్కించకుండా తల్లిదండ్రుల కోణంలో ఆలోచించండి
- ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తే న్యాయం జరగదు
- లెక్కల్లో 60 మార్కులొచ్చిన విద్యార్థికి ఊరట లభిస్తుందా?
- సమస్య పరిష్కారంపై 29లోగా చెప్పాలని ఆదేశం
ఇంటర్మీడియట్‌ పరీక్ష పేపర్లను సరిగ్గా వాల్యుయేషన్‌ చేయకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం అత్యవసరంగా భోజన విరామ సమయంలో విచారించాలని కోరారు. దీనిని మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్య్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ పిల్‌ను విచారించింది. మూడు లక్షల మంది విద్యార్థులు పరీక్ష తప్పారు. వీరి సమస్యను ఎలా పరిష్కరిస్తారో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌, రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డిలు 29న జరిగే విచారణ సమయంలో చెప్పాలి. 18, ఏప్రిల్ 2019, గురువారం

విద్వేష వ్యాఖ్యలు చేసిన నేతలపై నిషేధం...

యోగి ఆదిత్యనాథ్ పై మూడు రోజులు,
అజమ్ ఖాన్ పై మూడు రోజులు,
మేనకా గాంధీ పై రెండు రోజులు,
మాయావతి పై రెండు రోజులు నిషేధం సుప్రీం కోర్టు ప్రకటించింది.

17, ఏప్రిల్ 2019, బుధవారం

పార్లమెంటు సభ్యుల విద్యార్హతలు...

మొదటి లోక్ సభ నుండి 16వ లోక్ సభ వరకు సభ్యుల వివరాలు....
నరేంద్ర మోడీ, స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీ.....పార్లమెంట్ సభ్యుల విద్యార్హతల పై దేశంలో అనేక చర్చలు   జరుగుతున్నాయి.  


13, ఏప్రిల్ 2019, శనివారం

రాష్ట్రంలో పోలింగ్‌ 62.69%...

- 2019 లోక్‌సభ ఎన్నికల తుది ఓటింగ్‌ వివరాల ప్రకటన
- ఖమ్మంలో అత్యధికంగా 75.28%, 
- హైదరాబాద్‌లో అతితక్కువగా 44.75% నమోదు
- గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 8.06 శాతం తగ్గుదల
   2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 62.69 శాతం పోలింగ్‌ నమోదైంది. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం జరిగిన పోలింగ్‌ తుది వివరాలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. దీని ప్రకారం అత్యధికంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో 75.28 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా హైదరాబాద్‌ పార్లమెంటు సెగ్మెంట్‌లో 44.75 శాతం మంది ఓటేశారు. పూర్తిగా పట్టణ ప్రాంత సెగ్మెంట్లైన మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్‌ నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్‌ నమోదైంది.

    2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 70.75 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల పోలింగ్‌ గణాంకాలతో పరిశీలిస్తే ఈసారి ఎన్నికల్లో ఏకంగా 8.06 శాతం మేర పోలింగ్‌ తగ్గడం గమనార్హం. 2014లో రాష్ట్రంలో ఒకేసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో గడువు ముగియకముందే శాసనసభ రద్దు కావడంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గతేడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 76.07 శాతం ఓటింగ్‌ జరిగింది. 
11, ఏప్రిల్ 2019, గురువారం

ప్రభుత్వం మేల్కొనకపోతే మంచినీటికి ముప్పు ...

నూరేండ్ల క్రితం హైదరాబాద్‌ చెరువులతో సుందరంగా ఉండేది. హైకోర్టు సైతం మూసీ నదీ ప్రవాహపు ఒడ్డున ఉండేది. ఇప్పుడు చెరువులు మాయమయ్యాయి. మూసీ మురికి కూపంగా మారిపోయింది. ప్రభుత్వం మేల్కొనకపోతే మంచినీటికి ముప్పు ఏర్పడే ప్రమాదమున్నది. ఇప్పటికే బెంగళూరు నగరం, రాజస్థాన్‌ రాష్ట్రంలో నీటి కోసం జనం అల్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే కాకుండా ప్రజలు సైతం మూసీ నదిని కాపాడేందుకు, చెరువుల్ని రక్షించేందుకు చిత్తశుద్ధితో నడుం బిగించాలి..' అని హైకోర్టు అభిప్రాయపడింది.


9, ఏప్రిల్ 2019, మంగళవారం

ఒక్కటి కాదు.. ఐదు లెక్కించాల్సిందే... సుప్రీంకోర్టు

2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని యాభై శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలన్న విపక్షాల అభ్యర్థనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్‌ స్లిప్పులను, లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 35 వీవీప్యాట్లను ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లతో సరిపోల్చాలని ఈసీని ఆదేశించింది. ప్రతిపక్షాలు కోరినట్టుగా 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
8, ఏప్రిల్ 2019, సోమవారం

హ్యాట్రిక్ వీరులు...

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలలో హ్యాట్రిక్ వీరులు...
ఇప్పటివరకు కేవలం 13 మంది సాధించారు....
ఎన్నికలలో రోజురోజుకు పోటీ చేసే వారి సంఖ్య పెరుగుతున్నది28, మార్చి 2019, గురువారం

ఒక్కొక్క ఓటరుపై 46.40 రూపాయలు ఖర్చు ...

మనదేశంలో ఓటరు ఓటు వేసే వరకు ఓటు ఉందో లేదో లేదు... 
ఓటరు కార్డు ఉన్న, ఓటు నమోదు చేసుకున్న , పోలింగ్ రోజు లిస్టులో పేరు ఉంటుందో ఉండదో తెలియదు....

మొదటి  లోక్ సభ ఎన్నికలలో ఒక్కొక్క ఓటరుపై ప్రభుత్వం 60 పైసలు ఖర్చు పెట్టింది. గత లోక్ సభ 2014 ఎన్నికలలో చూస్తే ఒక్కొక్క ఓటర్లపై 46 రూపాయల 40 పైసలు  ఖర్చు పెట్టింది.  ఎన్నికలలో 83 కోట్ల 41 లక్షల ఓటర్లకు , 3870 కోట్ల 34లక్షలు రూపాయలను ఖర్చు పెట్టింది. మొదటి లోక్ సభ  నుండి గత లోక్ సభ వరకు ఓటర్ల పై ప్రభుత్వము పెట్టిన ఖర్చుల వివరాలు...
27, మార్చి 2019, బుధవారం

భూతాపం పెరుగుతున్నది... పెను శాపంగా మారనుంది....

భూతాపం పెరుగుతున్నది.
వ్యవసాయానికి పెను శాపంగా మారనుంది.
ప్రకృతిలో వైపరీత్యాలు పెరుగుతాయి. సాధారణమార్పులు రానున్నాయి...
భూతాప నిరోధానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. లేకపోతే ఇబ్బందులు అనివార్యం. పర్యావరణ సమతుల్యతను విస్మరించి, ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టిన వ్యవసాయానికి ముప్పు తప్పదు....


23, మార్చి 2019, శనివారం

భగత్‌సింగ్‌ ఒక గొప్ప వీరుడు...

భగత్‌సింగ్‌ 23 ఏళ్ళకే దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంభం ఎక్కిన త్యాగశీలురు. భగత్‌సింగ్‌ ఒక గొప్ప వీరుడుగా, సాహసిగా, ధైర్యవంతుడుగా బాగా సుపరిచితుడయ్యారు. 'ఇంక్విలాబ్‌-జిందాబాద్‌' అని వారు ఇచ్చిన నినాదం యావత్‌ జాతికి స్ఫూర్తిదాయకంగా మారి సామ్రాజ్యవాదులను గడగడ లాడించాయి. 
వారి స్ఫూర్తితో సార్వభౌమాధికారం, జాతీయ సమైక్యత,  మానవత్వం, మత సామరస్యం కోసం పాటుపడాలనే చైతన్యాన్ని యువతలో పెంపొందించాలి.


సర్వీసు 27 ఏళ్లు, బదిలీలు 52...

నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం...అరుదైన ఐఏఎస్
ఆయన వయసు 53 సంవత్సరాలు
సర్వీసు 27 ఏళ్లు, బదిలీలు 52...ఒకే సంవత్సరంలో నాలుగు బదిలీలు....
మనదేశంలో నిజాయితీ గల ఐఏఎస్ ల పై రాజకీయ నాయకుల తీరు......


22, మార్చి 2019, శుక్రవారం

తడారుతున్న గొంతులు...

- నేడు అంతర్జాతీయ జల దినోత్సవం మార్చి 22వ తేదీన) 
- 250 కోట్ల మందికి అందని రక్షిత నీరు
- జాగ్రత్తగా వాడుకోకపోతే భవిష్యత్‌ కష్టమే
- ప్రపంచంలో మనదేశ జనాభా 17 శాతం... నీటి వనరులు నాలుగుశాతమే!
- 'మన వెనుక ఎవరూ లేరు' అనే నినాదంతో ఐరాస ముందుకు...
- ప్రతి రోజూ ప్రపంచ వ్యాప్తంగా ఐదేండ్ల లోపు ఉన్న 700 మంది చిన్నారులు డయేరియా, దాని సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారు.
- రక్షిత తాగునీటిని తీసుకోకపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 800 మంది గర్భీణీలు చనిపోతున్నారు.
- 68.5 కోట్ల మంది ప్రజలు తాగునీటి వనరులు దొరక్క వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
- 159 కోట్ల మంది ప్రజలు చెరువులు, కాలువులు, కుంటల ద్వారా తెచ్చుకున్న నీటిని తాగుతున్నారు.
                ప్రతి ఒక్కరూ నీటి నిల్వల సంరక్షణ కోసం కంకణం కట్టుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరులను కాపాడుకునేందుకు ప్రతిఏటా మార్చి 22వ తేదీన అంతర్జాతీయ జల దినోత్సవం జరుపుకోవాలని, భవిష్యత్‌ తరాలకు నీటి వనరులను అందించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ఈ ఏడాది 'మన వెనుక ఎవరూ లేరు' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నది. 19, మార్చి 2019, మంగళవారం

LIC నవజీవన్ సరికొత్త పాలసీ...

LIC నవజీవన్- 853 అనే సరికొత్త పాలసీని ప్రవేశ పెడుతోంది.
ప్లాన్ నెంబర్ =853. ఇది సింగల్ ప్రీమియం, నాన్ సింగల్ ప్రీమియం కలయికతో రూపొందిన వినూత్న పథకం
ఇది NON LINKED, WITH PROFIT ENDOWMENT PLAN.
అంటే ఇది ULIP కాదు.
సింగల్ ప్రీమియం లో options గురించి ...
సింగల్ ప్రీమియం లో సింగల్ ప్రీమియం కు 10 రెట్లు Risk Cover లేక SUM ASSURED రెండిటిలో యేది యెక్కువైతే అది వుంటుంది.  కనీస బీమా మొత్తం 100000
గరిష్ఠ బీమా మొత్తం పరిమితి లేదు . కనీస ప్రవేశ వయస్సు  90 రోజులు
గరిష్ఠ ప్రవేశ వయస్సు 44 సంవత్సరాలు, కనీస మెచూరిటీ వయస్సు  18  సంవత్సరాలు
గరిష్ఠ మెచూరిటీ వయస్సు 62  సంవత్సరాలు
పాలసీ కనీసం 5 సంవత్సరాలు అమలు లో వుంటే కార్పోరేషన్ అనుభవం ప్రకారం loyalty*addition చెల్లిస్తారు.

ఇప్పుడు రెగ్యులర్ ప్రీమియం గురించి ....
రెగ్యులర్ ప్రీమియం లో రెండు options వున్నాయి.
1. సంవత్సర ప్రీమియం కు 10 రెట్లు Risk Cover
2. సంవత్సర ప్రీమియం కు  7 రెట్లు Risk Cover
ఒక వేళ పాలసీదారుడు 45 సంవత్సరాలు లోపు వుంటే అతనికి option 1
వర్తిస్తుంది. అంటే వార్షిక ప్రీమియం కు 10 రెట్లు Risk Cover
పాలసీదారుడు ప్రపోజల్ లో నే option యివ్వాలి. ఒకసారి ఇచ్చిన తరువాత మార్చడం సాధ్యం కాదు.
ప్రీమియం 5 సంవత్సరాలు చెల్లించాలి.
*Option 1

కనీస ప్రవేశ వయస్సు  90 రోజులు.
గరిష్ఠ ప్రవేశ వయస్సు 60 సంవత్సరాలు
కనీస మెచూరిటీ వయస్సు 18 సంవత్సరాలు
గరిష్ఠ మెచూరిటీ వయస్సు 75  సంవత్సరాలు

Option =2

కనీస ప్రవేశ వయస్సు 45 సంవత్సరాలు
గరిష్ఠ ప్రవేశ వయస్సు 65 సంవత్సరాలు
కనీస మెచూరిటీ వయస్సు 18 సంవత్సరాలు
గరిష్ఠ మెచూరిటీ వయస్సు 80 సంవత్సరాలు
పాలసీ కాల పరిమితి 10 నుండి 18 సంవత్సరాలు
8 సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు వున్న వారికి పాలసీ తీసుకున్న
2 సంవత్సరాల తర్వాత risk cover ప్రారంభం అవుతుంది.
8 సంవత్సరాలు వారికి పాలసీ తీసుకున్న వెంటనే risk cover ప్రారంభ మౌతుంది.
యాక్సిడెంట్ బెనిఫిట్ వుంది
Loan
సింగల్ ప్రీమియం అయితే పాలసీ తీసుకున్న 3 నెలల తరువాత తీసుకోవచ్చు.
సరెండర్ వాల్యూ లో 80 శాతం యిస్తారు. ప్రీమియం పాలసీలకు రెండు సంవత్సరాలు తర్వాత Loan యిస్తారు.
సరెండర్ వాల్యూ
సింగల్ ప్రీమియం చెల్లించిన వారు పాలసీ టెర్మ్ లోపు యెప్పుడైనా సరెండర్ చేసుకోవచ్చు.
రెగ్యులర్ ప్రీమియం చెల్లించిన వారు కనీసం రెండు సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి.
ఇవి కొత్త పాలసీ లోని విషయాలు క్లుప్తంగా.
అనువైన విషయాలు.
1. ప్రీమియం కట్టేది
     5 సంవత్సరాలు కాబట్టి ప్రీమియం కట్టే బాద్యత 5 సంవత్సరాల్లో పూర్తవుతుంది.
    65 సంవత్సరాలు వారు కూడా పాలసీ తీసుకునే అవకాశం...
    80 సంవత్సరాలు వరకు బీమా రక్షణ...

13, మార్చి 2019, బుధవారం

మరో గొలుసుకట్టు మోసం...రోజురోజుకు పెరుగుతున్న మోసాలు

1000 కోట్ల వరకు వసూలు...
7 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకున్న ఈ సంస్థ...
ఈజీగా కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి...
అది కూడా లక్షల్లో , కోట్లలో వస్తాయని నమ్మిస్తారు . లక్షల్లో డబ్బులు ఎలా సాధ్యం అవుతుందో ఆలోచించండి..
తొందరపడి డబ్బులు పెట్టి మోసపోకండి.
                         సైబరాబాద్‌ పరిధిలో మరో గొలుసు కట్టు మోసం బయటపడింది. ఈ-బిజ్‌ సంస్థ పేరిట సుమారు వెయ్యి కోట్ల వరకు వసూలు చేసిన నిర్వాహకున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని ఖాతాల్లోని సుమారు రూ.70 లక్షలను పోలీసులు స్తంభింపజేశారు. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మంగళవారం మీడియాకు వివరించారు.
                నోయిడా కేంద్రంగా 2001లో ఈ-బిజ్‌ సంస్థను స్థాపించారు. దేశవిదేశాల నుంచి దాదాపు ఏడు లక్షల మందిని సభ్యులుగా చేర్చుకున్న ఈ సంస్థ ద్వారా దాదాపు రూ.వెయ్యి కోట్లు వసూలు చేశారు. నిర్వాహకులుగా పవన్‌ మలాన్‌, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. గొలుసుకట్టు మాదిరిగా సభ్యులను చేర్పిస్తే కమీషన్‌ ఇస్తామని నమ్మించిన నిందితులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించొచ్చని చెప్పి మోసానికి పాల్పడ్డారు. ఈ సంస్థ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. సంస్థలో రూ.16వేలు కట్టి సభ్యులుగా చేరితే 10 వేల పాయింట్లు వస్తాయని, సభ్యులుగా చేరిన ప్రతి సభ్యుడు కమీషన్‌ పొందాలంటే మరో ఇద్దరిని చేర్పించాలనే నిబంధన పెట్టారు. అంతేకాకుండా రూ.30వేలతో మరో ముగ్గురిని చేర్పిస్తే హాలిడే ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. యువతను ఆకట్టుకునేందుకు ఈ లెర్నింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టారు. కంప్యూటర్‌ కోర్సులతోపాటు 58 రకాల ఇతర కోర్సులు నేర్పిస్తామని చెప్పారు. రెండు నెలల తర్వాత క్విజ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి కోర్సు పూర్తయ్యాక 50 శాతం మార్కులు వస్తే సర్టిఫికెట్‌ ఇస్తామన్నారు. ఈ లెర్నింగ్‌ కోర్సుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆమోదమూ లేదు. ఆదిలాబాద్‌, వరంగల్‌తోపాటు చెన్నై, బెంగళూర్‌ తదితర ప్రాంతాల్లో సంస్థ నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు ఏడు లక్షల మంది బాధితులు ఉన్నారనీ, ఇప్పుడిప్పుడే ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారని సీపీ తెలిపారు.
11, మార్చి 2019, సోమవారం

మోగిన ఎన్నికల నగారా...

- ఏప్రిల్‌ 11న తొలి దశలోనే తెలంగాణ, ఏపీ ఎన్నికలు
- దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్‌
- ఏప్రిల్‌ 11న షురూ... మే 19కి పూర్తి
- 23న ఓట్ల లెక్కింపు... ఫలితాలు వెల్లడి
- ఆదివారం నుంచే కోడ్‌ అమలు
- జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ వాయిదా, పార్లమెంట్‌ ఎన్నికలు మాత్రమే
- దేశంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకూ ఉప ఎన్నికలు
              రోజుల తరబడి ఎదురుచూస్తున్న ఎన్నికల సైరన్‌ మోగింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం విజ్ఞాన భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్లు అశోక్‌ లావాస, సునీల్‌ చంద్రతో కలిసి ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగుతాయన్నారు. ఏప్రిల్‌ 11న తొలి దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో దశ ఏప్రిల్‌ 18, మూడో దశ ఏప్రిల్‌ 23, నాలుగో దశ ఏప్రిల్‌ 29, ఐదో దశ మే 6, ఆరో దశ మే 12, ఏడో దశ మే19న జరగనున్నాయి. మే 23న ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలు వెల్లడి జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 175, ఒరిస్సాలో 147, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు వివరించారు. 

9, మార్చి 2019, శనివారం

చంద్ర బోస్ గారికి అత్యంత ఇస్టమైన పాట...

ఫ్రెండ్స్
గుడ్ ఈవెనింగ్...
700 సినిమాలలో, దాదాపుగా మూడు వేల పాటలు వ్రాసిన
ప్రముఖ సినీ రచయిత చంద్ర బోస్ గారి జీవిత అనుభవాలను, 
వారికి అత్యంత ఇస్టమైన పాట, వారి మాటలలో ఒక్కసారి విందాం...


8, మార్చి 2019, శుక్రవారం

ఆయువు తీస్తున్న వాయువు...

తెలంగాణలో పెరిగిన వాయు కాలుష్యం...
ఏటేటా పెరుగుతున్న కాలుష్యం...
తెలంగాణలో మొదటి స్థానం హైదరాబాదు, రెండో స్థానం కొత్తూరు, మూడో స్థానం మహబూబ్ నగర్, మెదక్...
7, మార్చి 2019, గురువారం

కాలుష్య కోరల్లో చిక్కుకున్న భారత్‌...

- ప్రపంచంలోనే 20 అత్యంత కాలుష్య నగరాల్లో భారత్‌లోనే 15...
- ప్రపంచంలోనే అత్యంత కాలుష్యనగరంగా మొదటి స్థానంలో గుర్గావ్‌, 
అలాగే ప్రపంచంలోని అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ నిలిచింది.
భారత్‌లో కాలుష్యం రోజురోజుకూ తీవ్రతరమవు తున్నది. గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణించిపోవడం అనేది దక్షిణాసియాకు ఒక పెద్ద సమస్య అధ్యయనం హెచ్చరించింది. 


ప్రపంచంలో రోజురోజుకు తీవ్ర సమస్యగా పరిణమిస్తున్న గాలి కాలుష్యం భవిష్యత్తులో మానవజాతిపై చెడు ప్రభావాలనే చూపనున్నది. గాలి కాలుష్యం కారణంగా వచ్చే ఏడాది ప్రపంచంలో దాదాపు 70 లక్షల మంది మరణాలు సంభవించే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. దాదాపు రూ. 15.88 లక్షల కోట్ల ఆర్థికభారం ప్రపంచంపై పడే అవకాశం ఉన్నదని, 'కాలుష్యం అనేది ప్రత్యక్షంగా ఆరోగ్యంపై, పరోక్షంగా వైద్యరూపంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని తెలిపారు.
13, ఫిబ్రవరి 2019, బుధవారం

బస్తీ బీమార్...

ప్రపంచంలోనే మందుల ఉత్పత్తిలో భారత్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.ప్రపంచంలో అనేక దేశాలకు మందులను ఎగుమతి చేస్తున్నది. కానీ మనదేశంలో కోట్లాది మంది ప్రజలు రోగాల బారినపడి మందులు కొనలేక చనిపోతున్నారు... మరణాలలో జీవనశైలి వ్యాధుల బారిన పడి 63 శాతం , గుండెపోటు కారణంగా 27 శాతం మంది చనిపోతున్నారు...