25, నవంబర్ 2019, సోమవారం

చెట్లు నరికివేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని...

నగరంలో చెట్ల నరికివేతను వెంటనే ఆపాలని , 
చెట్లు నరికివేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని,
'' హైదరాబాద్‌ జిందాబాద్‌ ''గా డిమాండ్‌ చేస్తు నేడు (25.11.2019)
 '' ప్రజావాణి '' జిహెచ్‌ఎంసి, హెడ్‌ ఆఫీసు లో వినతి పత్రం సమర్పించడం జరిగింది.
 వెంటనే చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు.



బాగ్‌లింగంపల్లి హౌజింగ్‌ బోర్డ్‌ కాలనీ ఎంఐజి-2, బ్లాక్‌ 18 వద్ద మరియు నల్లకుంట కూరగాయాల మార్కెట్‌ రోడ్‌లో చెట్లు నరికివేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, నగరంలో చెట్ల నరికివేతను వెంటనే ఆపాలని 
'' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' గా డిమాండ్‌ చేస్తున్నాము. 
''హైదరాబాద్‌ జిందాబాద్‌'' ప్రతినిథి బృందం గత నెల 29న జిహెచ్‌ఎంసి అడిషనల్‌ కమిషనర్‌ వి. కృష్ణ గారిని కలిసి పుట్‌పాత్‌పై వున్న చెట్లను కొట్టివేశారని, ఇది అక్రమమని విన్నవించారు. చెట్ల కొట్టివేత అనుమతి రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మిగిలిన చెట్లను కాపాడుతామని, మూడవ చెట్టు అయిన వేప చెట్టును కొట్టి వేతను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. ఇపుడు ఉన్న స్థితిని కొనసాగిస్తూ, భవిష్యత్‌లో ఉన్న చెట్లకు ఒక చిన్న కొమ్మ తెగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ మరల 23.11.2019న అర్థరాత్రి ఒక చెట్టు మొదలు కూడా కొట్టినారు.
బాగ్‌లింగంపల్లి హౌజింగ్‌ బోర్డ్‌ కాలనీ ఎంఐజి-2, బ్లాక్‌ 18, ప్లాట్‌ 3 వద్ద తేది. 28.10.2019న 35 సం||ల వయస్సు కలిగిన రెండు చెట్లను నరికివేశారు. మూడవది వేప చెట్టును కూడా కొటివేయడం ప్రారంభించడంతో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' సంస్థగా మేము మరియు స్థానిక కాలనీ వాసులు అడ్డుకోవడంతో ఆగిపోయింది. 
నల్లకుంట కూరగాయాల మార్కెట్‌ రోడ్‌లోని క్షత్రియ టవర్స్‌ ప్రక్కల దాదాపు 30 సంవత్సరాల చెట్టును జిహెచ్‌ఎంసి అధికారులు నెల రోజుల క్రితం నరికివేశారు. ఇది షాప్‌కు దాదాపు 10 అడుగుల దూరంలో రోడ్డు ప్రక్కన ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్టు. షాప్‌ కనపడటం లేదని, భవనానికి కొమ్మలు తగులుతున్నాయని చెప్పి భారీ చెట్టును కొట్టివేసినారు. 
పుట్‌పాత్‌లను ఆక్రమించుకుంటున్న , సెట్‌బ్యాక్‌లను ఆక్రమించుకుంటున్న సందర్భలలో అరికట్టావలసిన ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంటి యాజమానులు చెప్పే సమస్యలను చూపుతూ రోడ్డుపై ఉన్న 30-35 సంవత్సరాల చెట్లను ప్రభుత్వ అధికారులే నరికివేయడం చాల దారుణమైన చర్య. 
''హరితహారం'' పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది మొక్కలను నాటుతూ చెట్లు పెంచాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతుంటే మరొక వైపు పుట్‌పాత్‌ పై వున్న చెట్లను ప్రభుత్వ అధికారులే ఏలా కొట్టివేస్తారు? 35 సం||ల పెద్ద చెట్ల నరికి వేతకు జిహెచ్‌ఎంసి, అటవి శాఖ వారు ఏలా పర్మిషన్‌ ఇచ్చారు? మొక్కలు నాటి, వాటిని కాపాడవలసిన ప్రభుత్వ అధికారులే చెట్లను నరికివేయటం ఎంత అన్యాయం. ఎంత దారుణం.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ జిందాబాద్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ రావు గారు, సహయ కార్యదర్శి విజరుకుమార్‌, ఉపాధ్యక్షులు వీరయ్య, రమణ, నాయకులు శ్రీనివాస్‌్‌, రాములు తదితరులు పాల్గొంన్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి