- కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం...
- గాలి శుద్ధి టవర్ల ఏర్పాటుపై 10రోజుల్లో ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశం...
దేశ రాజధానిలో వాతావరణ కాలుష్యం, తాగునీటి నాణ్యతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 'పరిస్థితులు దారుణంగా ఉంటే... కాలుష్యానికి కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఢిల్లీలో పరిస్థితి నరకం కంటే భయంకరంగా ఉన్నది. వారిని బలవంతంగా గ్యాస్ ఛాంబర్‌లో ఎందుకు ఉంచాలనుకుంటున్నారు? మనుషుల ప్రాణాలకు మీరిచ్చే విలువ ఇదేనా? అంతకంటే ఓ 15 బ్యాగుల పేలుడు పదార్థాలు తెచ్చి అందర్నీ ఒకేసారి చంపేయండి...' అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు తమ మధ్య వున్న విభేదాలను పక్కనబెట్టి కాలుష్య నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. గాలి శుద్ధి టవర్ల ఏర్పాటుపై 10రోజుల్లోగా ప్రణాళికలను రూపొందంచాలని స్పష్టం చేసింది. ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి