మట్టి గణేష్ విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని, ప్రతి ఒక్కరూ ఇళ్ళలో మట్టి విగ్రహాలను పూజించాలని డా|| జయసూర్య గారు పిలుపునిచ్చారు. నేడు (30.08.2019) పాత నల్లకుంటలో హైదరాబాద్ జిందాబాద్ - హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో '' మట్టి గణేష్‌ల విగ్రహాల ఉచిత పంపిణి '' కార్యక్రమాన్ని డా|| జయసూర్య గారు ప్రారంభించారు.
హైదరాబాద్ జిందాబాద్ ఉపాధ్యక్షులు కె. వీరయ్య మాట్లాడుతూ ప్రపంచంలో ఇప్పుడు కాలుష్య సమస్యనే ప్రధాన సమస్యగా మారుతున్నదని అన్నారు. ప్రపంచంలో సంవత్సరానికి దాదాపు 92 లక్షల మంది కాలుష్యం వల్ల చనిపోతున్నారాని, దానిలో మన దేశంలోనే అధికంగా 25 లక్షల వరకు చనిపోతున్నరాని అన్నారు. అందువల్ల వినాయక చవితి సందర్భంగా మరింత కాలుష్యం పెరగకుండా పర్యావరణానికి హాని చెయ్యని మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సిటిజన్స్ ఫోరం నల్లకుంట అధ్యక్షులు మోహన్ రావు, రిటైర్డ్ ఇఇ డి.రామకృష్ణరావు గారు, డిఆర్‌డిఎల్ ఆఫీసర్ వివి సుబ్రమణ్యం గారు, కృష్ణబాబు, సంజీవ్, రమణరావు, ప్రసాద్ హైదరాబాద్ జిందాబాద్ ఉపాధ్యక్షులు కె. వీరయ్య, నాయకులు పి. శ్రీనివాస్, డి.మోహన్, రమణ, సునీల్ , సోమేష్, సంతోష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
డా|| జయసూర్య గారు మాట్లాడుతూ సమాజ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని '' పర్యావరణానికి హాని చెయ్యని మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని'' అందుకు మన అందరం పాటిద్దాం అని అన్నారు. వినాయక విగ్రహాలలో అత్యధికం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో, అనేక రకాల రసాయనిక రంగులతో తయారవుతున్నాయని, ఈ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లోను, నగరంలోని వివిధ చెరువులలో నిమజ్జనం చెయ్యటం జరుగుచున్నదని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ కాగితాలు, పాదరసం, సీసం, క్రోమియం వంటి అనేక విష రసాయనాలు వుంటున్నాయని, ఈ విషరసాయనాలు కలపటం వలన హుస్సేన్ సాగర్ మరియు చెరువులన్నీ కాలుష్య భరితమై, దుర్గంధంతో తయారౌతున్నాయని అన్నారు. పివోపి కాలుష్యం వల్ల నీటిలోని జీవరాశులు అన్ని చనిపోతున్నాయాని, మనుషులకు క్యాన్సర్, చర్మవ్యాధులు వస్తున్నయాని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి గణేష్‌లను మాత్రమే పూజించాలని ప్రతిజ్ఞ చేయించారు.
హైదరాబాద్ జిందాబాద్ ఉపాధ్యక్షులు కె. వీరయ్య మాట్లాడుతూ ప్రపంచంలో ఇప్పుడు కాలుష్య సమస్యనే ప్రధాన సమస్యగా మారుతున్నదని అన్నారు. ప్రపంచంలో సంవత్సరానికి దాదాపు 92 లక్షల మంది కాలుష్యం వల్ల చనిపోతున్నారాని, దానిలో మన దేశంలోనే అధికంగా 25 లక్షల వరకు చనిపోతున్నరాని అన్నారు. అందువల్ల వినాయక చవితి సందర్భంగా మరింత కాలుష్యం పెరగకుండా పర్యావరణానికి హాని చెయ్యని మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సిటిజన్స్ ఫోరం నల్లకుంట అధ్యక్షులు మోహన్ రావు, రిటైర్డ్ ఇఇ డి.రామకృష్ణరావు గారు, డిఆర్‌డిఎల్ ఆఫీసర్ వివి సుబ్రమణ్యం గారు, కృష్ణబాబు, సంజీవ్, రమణరావు, ప్రసాద్ హైదరాబాద్ జిందాబాద్ ఉపాధ్యక్షులు కె. వీరయ్య, నాయకులు పి. శ్రీనివాస్, డి.మోహన్, రమణ, సునీల్ , సోమేష్, సంతోష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి