28, డిసెంబర్ 2013, శనివారం

రైల్లో ఘోర అగ్ని ప్రమాదం...

   నాందేడ్-బెంగళూర్ ఎక్స్ ప్రెస్ లో 28.12.2013(శనివారం) తెల్లవారుజామున 3.10 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 23 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. ప్రమాదంలో బి-1 ఏసీ బోగీ పూర్తిగా దగ్ధమైంది. మరో బోగీ పాక్షికంగా దగ్ధమైంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా కొత్తచెరువు, పుట్టపర్తి రైల్వే స్టేషన్ల మధ్య రైల్లో మంటలు వ్యాపించాయి. రైల్లోని ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏసీ బోగీ బి వన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ బోగీలోని వారందరూ మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.

         ఈ విషయాన్ని గమనించిన అధికారులు రైలును పుట్టపర్తి రైల్వే స్టేషన్ లో ఆపివేసి ఏసీ బోగీల లింక్ ను తొలగించారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా మంటలు రెండో బోగీకి వ్యాపించాయి. ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది. రెండు బోగీల్లో 72 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన 15 మంది మృత దేహాలను వెలుపలికి తీశారు.
రైలు ప్రమాద హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లు- బెంగళూరు: 080-22354108, 22251271, 22156554, 22156553
పుట్టపర్తి ప్రశాంతి నిలయం : 08555-280125


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి