16, నవంబర్ 2013, శనివారం

సచిన్ కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న...

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం దక్కింది. సచిన్ కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ కార్యాలయం శనివారం (16.11.13) ప్రకటించింది. ఇదే రోజు కెరీర్ కు వీడ్కోలు పలికిన మాస్టర్ కు అత్యున్నత పురస్కారం ప్రకటించడం విశేషం.

భారత క్రీడా చరిత్రలో అత్యున్నత పౌరపురస్కారం అందుకోనున్న తొలి క్రీడాకారుడిగా సచిన్ ఘనత సాధించనున్నాడు. భారత క్రికెట్ కు విశేష సేవలు అందించినందుకుగాను ఈ అవార్డును బహూకరించనున్నారు. మాస్టర్ కు భారతరత్న ఇవ్వాలని పలువురు రాజకీయ నాయకులు, వివిధ రంగాల వ్యక్తులు రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ రోజునే సచిన్ కు అవార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించడంతో అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

 వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ 126 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో 43 /3 పరుగుల ఓవర్ నైట్ తో ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు 187 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

2 కామెంట్‌లు:

  1. ఈ దేశపు ప్రభుత్వం ఇచ్చే పద్మాదిపౌరపురస్కారాలు అన్నీ రాజ్ఖకీయనాయకుల నిర్ణయాల మీద ఆధారపడటం చాలా విచారకరం.
    ఈ కారణంగా వీటి యొక్క విలువ ఇప్పటికే చాలావరకు పలుచన కావటం జరిగింది.

    కళాసంస్కృతికరంగాల్లోనూ, విజ్ఞానరంగంలోను విశేషకృషి చేసిన మహానుభావులు ఈ‌ ఘనతవహించిన ప్రభుత్వాలకు కంటికి నలుసంతగా కూడా కనిపించరు! సినిమాలు, క్రికెట్టు ఐతే ఈ ప్రభుత్వం దృష్టిలో దేశానికి చాలా ముఖ్యమైన గౌరవం తెచ్చే రంగాలు మరి. సంతోషం.

    అత్యున్నతమైన భారతరత్న ఒక గొప్ప క్రీడాకారుడికి ఇస్తున్నారని అనుకుందాం. సరే. మరి అటువంటప్పుడు ధ్యాన్‌చంద్‌ను ఎలా మరచిపోయింది ఈ గుడ్డి ప్రభుత్వం? భారత క్రీడారంగపు అచ్చమైన రత్నం ధ్యాచ్‌చంద్‌కు ఇంతవరకూ భారతరత్న ఇవ్వకపోవటం ఆయనను అగౌరవించటమే.
    ఇప్పుడు మరొక క్రీడాకరుడికి భారతరత్న ఇచ్చి, ధ్యాన్‌చంద్‌కు కనీసం ఇప్పుడైనా ఆ పురస్కారం ఇవ్వకపోవటం ఆయనకు శాశ్వతమైన అవమానం చేయటమే. దీనిని ఈ‌ పిచ్చి ప్రభుత్వం‌ చచ్చినా దిద్దుకోలేదు.

    ధ్యాన్‌చంద్ క్రికెట్టు ఎందుకు ఆడలేదు? అది ఆయన తప్పే! మిగతా క్రీడారంగాల వీరులూ‌ మీరిది బాగా గ్రహించుకోవాలి. మీ రెంత గొప్ప కీర్తి సంపాదించినా క్రికెట్టిలో‌ కొన్ని సెంచరీలు కొట్టిన వాళ్ళతో చచ్చినా సమానం కూడా కాలేరు!

    అన్నట్లు మర్చిపోయాను. విశ్వనాథన్ ఆనంద్‌కు 2007లో పద్మవిభూషణ్ ఇచ్చారు. చాలా ఆనందించ వలసిన సంగతి. కాని ఆయన మరొక పది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు సంపాదించినా ప్రభుత్వం వారు తమంతట తాము భారతరత్న మటుకి ఇస్తారని ఆశించలేం. తమిళియన్ కాబట్టి తమిళులు పట్టుబట్టి ఆ పద్మవిభూషణ్ ఇచ్చేలా చూసి ఉండవచ్చు - లేక పోతే అదీ ఆయనకు వచ్చేది కాదేమో. ఆయనకు భారతరత్న కోసం తమిళులే మళ్ళీ పట్టూబట్టాలి. చూదాం.

    ధ్యాన్‌చంద్ అభిమానులకు నా సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. "...ధ్యాన్‌చంద్ క్రికెట్టు ఎందుకు ఆడలేదు? అది ఆయన తప్పే! మిగతా క్రీడారంగాల వీరులూ‌ మీరిది బాగా గ్రహించుకోవాలి. మీ రెంత గొప్ప కీర్తి సంపాదించినా క్రికెట్టిలో‌ కొన్ని సెంచరీలు కొట్టిన వాళ్ళతో చచ్చినా సమానం కూడా కాలేరు!..."

    నిజం

    రిప్లయితొలగించండి