ఆధునిక సమాజంలో ఈ అనాగరిక చేష్టలు ఏంటని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీవ్రంగా స్పందించడానికి కారణమైన కుల దురహంకార హత్యలె. మన రాష్ట్రంలో కూడా ( ఆంధ్రప్రదేశ్‌లోనూ) అక్కడక్కడ ఈ పాశవిక సంఘటనలు జరుగుతున్నాయి.
తక్కువ కులం వ్యక్తిని (దళితున్ని) పెళ్లి చేసుకున్న కారణంగా కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా, పాశవికంగా దాడి చేసి, హత్య చేశారు. దూరంగా ఖాలీ ప్రాంతానికి తీసుకెళ్లిన ఆమె తల్లి, మానమేమలు... రాళ్లతో కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. అటు మానవత్వానికి, ఇటు మాతృత్వానికి మచ్చ తెచ్చిన ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో బాలానగర్ మండలం రాజాపూర్ (జాతీయ రహదారి పక్కనున్న గ్రామం)లో చోటుచేసుకుంది. గొర్రెల పెంపకందారుల సామాజిక తరగతికి చెందిన మాధవి(18), కేశంపేట మండలం కాకునూరు గ్రామానికి చెందిన దళితుడు లింగం గత ఏడాది నవంబర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దళితున్ని పెళ్లి చేసుకోవడం మింగుడు పడని మాధవి తల్లి శంకరమ్మ తన బిడ్డకు మైనార్టీ తీరలేదని, లింగం కిడ్నాప్ చేశాడనే ఆరోపణతో బాలానగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు లింగంను రిమాండ్‌కు పంపి మాధవిని స్టేట్ హోమ్‌లో ఉంచారు. అనంతరం రెండు నెలల్లోనే జడ్చర్ల మున్సిఫ్ మెజిస్ట్రేట్, మాధవి మైనార్టీ తీరిందని చెప్పి హోమ్ నుండి తీసుకొచ్చారు. అక్కడి నుండి నేరుగా భర్త లింగం దగ్గరకు మాధవి వెళ్లింది. మాధవి అక్కడికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేని తల్లి, మేనమామలు గురువారం కసాయిమూకల ఘోరకలి సంఘటన జరిగింది
ఇదిలావుండగా మరొ సంఘటన, దళతున్ని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతుర్ని దారుణంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు ఒక తండ్రి.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం రట్టిణికి చెందిన లలిత్ కుంటియా, గొల్లపు కుంటియా వారి కుమార్తె లల్లి కుంటియా (19). ఒడిషాలోని ఒడ్రు కులానికి చెందిన ఆమె దళిత కులానికి చెందిన అలజండి మోహనరావును ప్రేమించింది. ఈ నెల 20న టిటిడి ఆధ్వర్యాన నిర్వహించనున్న కల్యాణమస్తులో వివాహం చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి లలిత్ కుంటియా బుధవారం రాత్రి గొడవపడి, పీక నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని గురువారం గ్రామస్తులకు చెప్పాడు.
ఈ సంఘటనలకు బాద్యులయిన నిందితులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కొరుకుంద్దాం. ఈ సంఘటనలు మల్లి జరుగకుండా ప్రభుత్యం తగు చర్యలు తిసుకొవలని కొరుకుంద్దాం.
''వ్యవసాయకార్మికులు, పేదరైతుల మీద జరుగుతున్న దాడులు, సాంఘిక ఇబ్బందులు, అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా పోరాడాలి'' అని సుందరయ్య గారు ఆనాడు పిలుపునిచ్చారు. ఊరుమ్మడి బావుల్లో దళితుల్ని నీరు తోడుకోనివ్వకపోవడం, అంటరానితనం, కూలీ వివక్ష, అగౌరవపర్చడం, ఆడవారితో నీచంగా మాట్లాడటం వంటి అనాగరిక పద్ధతుల్ని ఆయన ఈసడించుకున్నారు. విద్యార్థిగా స్వగ్రామం అలగానిపాడులో సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం ప్రారంబించినారు.

అంబేద్కర్ ఆలోచనలు ఈనాడు ఎంతగా వ్యాపించినా, బలపడినా- దేశంలో ఇంకా దళితులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి, అవమానాలకు గురిఅవుతున్నాయి. దేశంలో మారుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా వారి సామాజిక, ఆర్థిక హోదా దిగజారుతున్నది.
అంటరానితనం, కుల, మత ఛాందసత్వాలకు వ్యతిరేకంగా సంఘాలు, ప్రజాతంత్ర వాదులంతా ముందుకు రావాలని కొరుకుంద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి