దోపిడీ రహిత సమాజానికై .....మనిషిని మనిషి దోచుకోని ప్రపంచం కోసం పోరాటం జరుగు తుంది.
నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా, కార్మిక వర్గం తమ హక్కుల పరిరక్షణ కోసం, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న పోరాటాలకు మే డే సందర్భంగా సంఘీభావాన్ని తెలుపుద్దాం . ప్రభుత్యం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా , సమైక్య పోరాటాలను నిర్మించాలని కార్మిక వర్గాన్ని కొరుద్దాం.
టెలికాం కుంభకోణం, ఖనిజాల తవ్వకం, కామన్వెల్త్ గేమ్స్‌లో అవకతవకలు, అనేక హౌసింగ్, భూ కుంభకోణాలు ఇటీవలి కాలంలో వెలుగుచూశాయి. ఈ కుంభకోణాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు లక్షలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. బడా పారిశ్రామిక సంస్థలు బాగా లబ్ధి పొందాయి. నయా ఉదారవాద ఆర్ధిక విధానాలు అవినీతిని పెంచి పోషిస్తున్నాయి. ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి ఫలితంగా ధరల పెరుగుదల, ఆహార ద్రవ్యోల్బణం నింగిని చూడటం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చెయ్యడం జరుగుతునెవుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్న తీవ్ర సంక్షోభం నేపథ్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కోల్పోతున్న తరుణం ( లేఆఫ్‌లు, మూసివేతలు, వేతనాల కోత ). తమ హక్కులపై, జీవనశైలిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాటాలను ఉధృతం చేస్తున్న తరుణంలో మే దినోత్సవాలు జరుగుతున్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి