ఎన్నికలు ముగియగానే ప్రజలపై పెట్రో ధరల బాంబు పడింది. పెట్రోలు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఈసారి లీటరుకు ఐదు రూపాయలు ధర పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్‌లో పెట్రోలు లీటరు ధర కాస్త అటు ఇటుగా 72 రూపాయలు. గత తొమ్మిది నెలలలో పెట్రోలు ధరలు పెరగడం ఇది తొమ్మిదోసారి. పెరిగిన ధరలు ఈరోజు అర్థరాత్రినుంచే అమలుకానున్నాయి. త్వరలో మరోసారి పెట్రోలు ధర పెంచే అవకాశం ఉందని చమురు సంస్థలు సూచనప్రాయంగా తెలిపాయి.
పెట్రోలు ధరను ఇంత పెద్ద ఎత్తున పెంచేయడం ఇదే మొదటిసారి. పశ్చిమబెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశంలో వామపక్ష రాజకీయాల ప్రాధాన్యత తగ్గడంతొ ఎవరు అడ్డు ఈక లేరని కేంద్రం ,మిగత పాలక పార్టిలు బావిసుతున్నాయి. రానున్న కాలంలో ప్రపంచబ్యాంకు, అమెరికా ఒత్తిళ్లు మరింతగా పెరుగు తాయి. పాలకులు మరింతగా పేట్రేగిపోయి ప్రజల హక్కులను కాలరాచే ప్రమాదముంది.
సంవత్సరంన్నర క్రితం హైదరాబాద్‌లో పెట్రోలు లీటరు ధర రూ. 47 కాగా, ఇప్పుడు ఆ ధర రూ. 71 కావడంతో వినియోగదారుల నడ్డి విరిచినట్టయ్యింది. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో పెట్రోలు కంపెనీలు ధరలను విపరీతంగా పెంచేస్తున్నాయి. బహుశ త్వరలోనే మరో నాలుగు రూపాయలు పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే పెట్రోలు ధర లీటరుకు 100 రూపాయలు అయ్యే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజానికి సామాన్య, మాద్యతగతి ప్రజలు ఈ ధరలతో ఈవిధంగా పెంచుతూ వుంట్టె బ్రతుకగలుగుతారా... పెట్రోలు ధరలను ఇలా పెంచేస్తే ఇక వాహనాలు వినియోగించడం ఎలా అని వినియోగదారులు నిప్పులు కురిపిస్తున్నారు.
( పత్రికల సహకారంతో ...)
( పత్రికల సహకారంతో ...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి