15, మే 2011, ఆదివారం

ఒక్కరూ చావకూడదు...

                      "గోదాముల నిండా ఆహార ధాన్యాలు ఉండగా.. దేశంలో ఆకలి చావులు చోటు చేసుకోవడమా? మరో 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను దేశంలోని నిరుపేదలకు సరసమైన ధరలకు తక్షణం పంపిణీ చేయండి. తద్వారా ఒక్క ఆకలి చావు కూడా చోటు చేసుకోకుండా వ్యవహరించండి. మన దేశంలో ఇంతకంటే ముఖ్యమైన అంశం మరొకటి ఉండదు'' అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలోని 150 పేద జిల్లాల్లో దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారందరికీ ఈ ఆహార ధాన్యాలను అందజేయాలని సుప్రీం న్యాయమూర్తులు దల్వీర్ భండారీ, దీపక్ వర్మలు.. కేంద్రానికి శనివారం ఆదేశాలు జారీ చేశారు.

                 అయినప్పటికీ.. సుప్రీం న్యాయమూర్తులు ఈ అంశంపై విచారణ జరిపి.. కేంద్రానికి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. "గోదాముల్లో మూలుగుతున్న ఆహార ధాన్యాలను పేదలకు సరసమైన ధరలకు అందజేయాలంటూ మీకు మేం పదేపదే విజ్ఞప్తి చేస్తునే ఉన్నాం. ఆహార ధాన్యాలను ఎంతో ఎక్కువ ధరకు మీరు కొనుగోలు చేసి.. గోదాముల్లో దాస్తున్నారు. పంటలు బాగా పండినప్పుడు.. గోదాముల సామర్థ్యం సరిపోకపోవడంతో.. పాత ధాన్యాలను పారవేస్తున్నారు.


                   కానీ.. దేశంలో పౌష్ఠికాహార లోపం వల్ల రోజుకు 3వేల మంది మరణిస్తున్నారు. మన లాంటి దేశంలో రోజుకు మూడు ఆకలి చావులు కూడా తీవ్రమైనవే. కాబట్టి.. గోదాముల్లో నిల్వ ఉన్న ఆహార ధాన్యాన్ని సబ్సిడీ ధరలకు పేదలకు అందజేయండి!'' అని కేంద్రాన్ని న్యాయమూర్తులు కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీలో.. జరుగుతున్న అక్రమాలను ఎత్తిచూపుతూ.. 'పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్' (పీయూసీఎల్) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై.. కోర్టు ఈ కేసును విచారిస్తోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి