శాసనసభ ఎన్నికల ఓటమి నేపథ్యంలో ప్రజలతో మరింతంగా మమేకమవ్వడంపై దృష్టి కేంద్రీకరిస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరత్ పేర్కొన్నారు. బెంగాల్ ఎన్నికల ఓటమిపై లోతుగా చర్చించి, తగిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల అనంతరం బెంగాల్లో సిపిఎం శ్రేణులపై జరుగుతోన్న దాడులపై ఆయన తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. సోమవారము డిల్లిలో జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలపై సమావేశంలో ప్రాథమికంగా చర్చించినట్లు చెప్పారు. జూన్‌లో హైద్రాబాద్‌లో జరిగే పార్టీ కేంద్ర కమిటీ సమవేశాల్లో ఎన్నికల ఫలితాలను సమగ్రంగా సమీక్షిస్తామన్నారు. ఈలోపు ఆయా రాష్ట్ర కమిటీలు ఫలితాలపై సవివరమైన నివేదికలను తయారు చేస్తాయన్నారు.
34 సంవత్సరాల అవిచ్ఛిన్న పాలన అనంతరం బెంగాల్లో వామపక్షాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందన్నారు. తన పాలనలో బెంగాల్ వామపక్ష ప్రభుత్వం చారిత్రాత్మక ప్రజానుకూల చర్యలను చేపట్టిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పు నినాదానికి అనూకులంగా నిర్ణయాత్మకంగా ఓటు చేశారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలను లోతుగా సమీక్షించి, పార్టీ మరింతగా ప్రజలకు చేరువయ్యేందుకు తగిన చర్యలు చేపట్టాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించినట్లు చెప్పారు. ' ఫలితాల నేపథ్యంలో దేశంలో వామపక్షాలు కనుమరుగవుతాయని కొందరు భావిస్తు న్నారు. ఇవి కేవలం భ్రమలుగానే మిగిలిపోతాయి. వారి అభి ప్రాయం తప్పని భవిష్యత్తు నిరూపిస్తుందని చెప్పారు.
మళ్ళీ అధికారంలొకి వచ్చి ఏం చెస్తారు 34 ఎళ్ళు వుండి ఏంచెసెరు? మీపార్టి పక్కన దయచెసి మార్కిజం పెరు తీసెయండి ఎందుకంటె మార్కిస్టు కామ్యునిస్టు అంటె మీ పార్టీలను చూసి మార్కిజం అంటె ఇదేనెమొ అనె బ్రమలొ వున్నారు ప్రజలు
రిప్లయితొలగించండి1977లో ఎమర్జన్సీ తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణ వాతావరణం బెంగాల్‌లో జ్యోతిబాసు ప్రభుత్వ స్థాపనకు దారి తీసింది. ఆ తర్వాత కాలంలో దేశంలో 12 మంది ప్రధానులు మారారు, రాష్ట్రాల్లో లెక్కలేనన్ని మార్పులు కలిగాయి. బెంగాల్ వామపక్ష ప్రభుత్వం మాత్రం అప్రతిహతంగా కొనసాగిందంటే దాని ప్రజానుకూల విధానాలే ప్రధాన కారణం.
రిప్లయితొలగించండిభూసంస్కరణలు, కౌలుదార్లనమోదు, శ్రమజీవులకు మద్దతు, పంచాయతీల ద్వారా వికేంద్రీకరణ, ప్రజాస్వామ్య లౌకిక విలువల పరిరక్షణ, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన ఇలా ఆ ప్రభుత్వం అనేక విశిష్టతలు మూటకట్టుకున్నందునే వరుస విజయాలతో మున్ముందుకు సాగింది. ఇప్పుడు ఓటమికి దారి తీసిన లోపాలు ఏమైనప్పటికీ ఈ విలక్షణ చరిత్రను విస్మరించలేము. కమ్యూనిస్టు ఉద్యమం ఎన్నికల ఓటములకు గాని, పాలకుల నిర్బంధాలకు గాని చెదిరిపోయేది గాదని చరిత్ర అనేక సార్లు నిరూపించిన సత్యం.