10, మే 2011, మంగళవారం

మరణ శిక్ష విధించాలి...

                        దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కుల దురహంకార హత్యలు మన జాతికే మాయని మచ్చని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కుల దురహంకార హత్యలను 'అత్యంత అరుదైన'విగా (రేర్‌ ఆఫ్‌ది రేరెస్ట్‌) వర్గీకరించి ఈ నేరాలకు పాల్పడేవారికి మరణ శిక్ష విధించాలని సర్వోన్నత న్యాయస్థానం కోర్టులను ఆదేశించింది.        
                  'కారణం ఏదైనా మా అభిప్రాయంలో కుల దురహంకార హత్యను అత్యంత అరుదైన కేసుగానే పరిగణించాల్సి వుంటుంది. దీనికి మరణశిక్షే తగినది. మన జాతికే మాయని మచ్చగా మారుతున్న ఇటువంటి దారుణమైన ఫ్యూడల్‌ ఆచారాలను తుడిచి పెట్టాల్సిన అవసరం వుంది' అని సుప్రీం కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. ఇటువంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు తమ కోసం వధ్యశిల ఎదురు చూస్తుంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలని న్యాయమూర్తులు మార్కండేయ కట్జు, జ్ఞాన్‌ సుధా మిశ్రాతోకూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
                అటువంటి అనాగరిక, సిగ్గుమాలిన పనులను అడ్డుకునేందుకు ఇది తప్పనిసరి. తమ కోసం ఉరితాళ్లు ఎదురు చూస్తున్నాయన్న విషయం ఇప్పటికీ పరువు హత్యలకు పాల్పడాలని కుట్రలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ తెలియాలి'' అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. పెళ్లయినప్పటికీ, భర్తను వదిలేసిన తన కుమార్తె సీమ వావి వరుసలు మరచి వరుసకు సోదరుడి (కజిన్)తో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో ఢిల్లీకి చెందిన భగవాన్ దాస్ హత్య చేశారు.  ఈ కేసును విచారించిన ఢిల్లీ సెషన్స్ కోర్టు దాస్‌కు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసును విచారించిన సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ మార్కండేయ కట్జు, జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రాలు భగవాన్‌దాస్ పిటిషన్‌ను కొట్టివేశారు. దీనిపై తమ తీర్పును వెలువరిస్తూ పరువు హత్యలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
   
                ఎందుకంటే, తమ ఆకాంక్షలకు విరుద్ధంగా వారు పెళ్లి చేసుకోవడమో.. మరెవరితోనో సంబంధం (అఫైర్) కొనసాగించడమో చేసినప్పుడు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. వారిని చంపడమో.. భౌతికంగా దాడి చేయడమో.. వేధింపులకు గురి చేయడమో చేస్తారు. అయితే, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరికీ లేదు. తన కుమార్తె లేదా బంధువు లేదా తన కులానికి చెందిన మరో వ్యక్తి ప్రవర్తన నచ్చకపోతే.. అతడు లేదా ఆమెతో సామాజిక సంబంధాలను తెగతెంపులు చేసుకోవడమే అతను చేయగలడు.'' అని వ్యాఖ్యానించింది.
                   'పరువు' హత్యల్లో 'పరువు' ఏమాత్రం లేదని, అవి భూస్వామ్య మనస్తత్వం, మూర్ఖపు పట్టుదలతో చేస్తున్న ఆటవిక, దారుణ హత్యలని తాము ఇప్పటికే స్పష్టం చేశామని ధర్మాసనం తేల్చి చెప్పింది. పరువు హత్యలకు భవిష్యత్తులో మరణ శిక్షను విధించాలని, ఈ మేరకు ఈ కేసులో తమ తీర్పు కాపీలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని హైకోర్టులు, సెషన్స్ కోర్టులు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలకు పంపించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ( గూగుల్ ఇమేజ్ ల పత్రికల సహకారంతో ...)

1 కామెంట్‌:

  1. పరువు హత్యలు,కుల దురహంకార హత్యలకు పాల్పడేవారికి మరణ శిక్ష విధించాలని సర్వోన్నత న్యాయస్థానం కోర్టులను ఆదేశించింది.
    మూడో సంతానం కూడా ఆడపిల్లే అని స్కానింగ్ లో తెలుసుకొని గర్భంతో ఉన్న భార్యను కొట్టి చంపాడొక దుర్మార్గుడు.ఇలాంటివారికి కూడా మరణ శిక్ష అమలు చెయ్యాలి.అసలు పిల్లల్ని కనే అర్హత ఇలాంటి వారికి లేదు.దేశ శ్రేయస్సు కోసం ఇద్దరు పిల్లలకంటే ఎవరినీ కననివ్వకూడదు.ఆడపిల్లలను మాత్రమే కన్నవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

    రిప్లయితొలగించండి