మరో అవినీతి కుంభకోణాల్లో యుపిఎ కూరుకుపోయిందా...
వరుస కుంభకోణాల్లో ఉకిరిబికిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని మరో అవినీతి కుంభకోణం బొగ్గుగనుల కేటాంపులో భారీ అవినీతి జరిగినట్లు తెలుసుతున్నది.
వరుస కుంభకోణాల్లో ఉకిరిబికిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని మరో అవినీతి కుంభకోణం బొగ్గుగనుల కేటాంపులో భారీ అవినీతి జరిగినట్లు తెలుసుతున్నది.
అవినీతిని ఎదుర్కొంటామని, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని ప్రజలను ప్రధాని మన్మోహన్‌సింగ్ నమ్మించజూశారు. కేంద్రంలో యుపిఎ-2 ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మన్మోహన్‌సింగ్ తమ హయాంలో జరిగిన స్కాంలన్నీ తూసు అన్నట్లు మాట్లాడారు. అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుపోయి ప్రభుత్వం ఒక వైపు గిలగిల కొట్టుకుంటున్నది. ఐపిఎల్, కామన్వెల్త్, ఆదర్శ్, ఎస్-బ్యాండ్, 2జి స్పెక్ట్రం కుంభకోణాల పరంపరను ఆవిష్కరించింది. ఐపిఎల్ స్కాంలో కేంద్ర మంత్రి శశిథరూర్, ఆదర్శ్ కుంభకోణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పదవీచ్యుతులయ్యారు. అతిపెద్ద కుంభకోణం 2జి స్పెక్ట్రంలో డిఎంకె నేత ఎ రాజా మంత్రి పదవి కోల్పోయి ఊచలు లెక్కిస్తున్నారు. కామన్వెల్త్ స్కాంలో కాంగ్రెస్ ఎంపి సురేష్ కల్మాడీ జైలుకెళ్లారు. రెండేళ్ల సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే యుపిఎ భాగస్వామి డిఎంకె పార్టీ ఎంపి కనిమొళి 2జి స్పెక్ట్రం కేసులో కటకటాల పాలయ్యారు.
అణు ఒప్పందం సమయంలో యుపిఎ-1 ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎంపీలను కొనుగోలు చేసినమాట నిజమేనని ఇటీవల వికీలీక్స్ కుండ బద్దలు కొట్టింది. రెండేళ్లలో లెక్కలేనన్ని సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచి ప్రజల పై భారం మోపారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. రెండేళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆత్మవిమర్శ లేకుండా భవిష్యత్తులో అవినీతిని తుదముట్టిస్తామని చెప్పి ప్రజలను వెర్రి వెంగళప్పలుగా జమ కట్టారు.
( ప్రజాశక్తి, ఇతర పత్రికల సహకారంతో ...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి