భారత దేశంలో అమ్మాయిలను పుట్టకుండా నిరోధించడము న్యాయమా...
భారత దేశంలో ఆడ శిశువులను కడుపులోనే చంపేసే అలవాటు పెరిగిపోతోంది . అదీ బాగా ధనిక కుటుంబాల్లోనూ చదువుకున్న వారే ఇలాంటి ఎంపిక చేసిన గర్భస్రావాలకు పాల్పడుతున్నారట. ముఖ్యంగా కుటుంబంలో మొదటి బిడ్డ ఆడపిల్ల అయితే.. రెండో బిడ్డ మగ పిల్లవాడు అయ్యేలా చూసుకుంటున్నారట.
దేశంలో పుట్టబోయేది ఆడపిల్ల అని తేలితే ఎంపిక చేసి గర్భస్రావాలు(సెలక్టివ్ అబార్షన్స్) చేయించడం పెరిగింది. 1980 నుంచి 2010 మధ్య భాగంలో దాదాపు 1.21 కోట్ల మంది అమ్మాయిలను పుట్టకుండా నిరోధించారు. అమ్మాయి అనే కారణంతో గర్భస్రావం చేయించడం 1990 దశకంలో బాగా పెరిగినట్లు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. ఉత్తర భారత రాష్ట్రాల నుంచి ఈ జాడ్యం తూర్పు రాష్ట్రాల మీదుగా దక్షిణ భారతానికి కూడా పాకిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు చెందిన ప్రభాత్ ఝా చెప్పారు.
0-6 సంవత్సరాల మధ్య ఉన్న బాలుర కంటే 71 లక్షల మంది బాలికలు తక్కువగా ఉన్నట్లు 2011 జనాభా లెక్కలు వెల్లడించాయి. ఈ సంఖ్య 2001 జనాభా లెక్కల్లో 60 లక్షలుగా ఉండగా, 1991 జనాభా లెక్కల్లో 42 లక్షలుగా ఉంది. బాలురతో బాలికల నిష్పత్తి ఈ విధంగా తగ్గడం పేదలు, నిరక్షరాస్యులుగా ఉన్న వారిలో కంటే బాగా చదువుకున్న, ధనికులైన వారి ఇళ్ళలోనే ఎక్కువగా ఉంది.

( పత్రికల సహకారంతో ...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి