20, ఏప్రిల్ 2011, బుధవారం

అణు గుణపాటం కాదా...

జపాన్ అణు ప్రమాదంతొ ప్రజలు యిప్పటికి  బయం తొ అల్లడుతున్నారు. రెడియెషన్ యిప్పటికి వస్తునెంది.
                 మహారాష్ట్రలో జైతపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్థానికులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం పాశవికంగతా వ్యవహరించింది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపించి ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. అనేక మందిని క్షతగాత్రులను చేసింది.
                       జపాన్‌ అణు విషాదం కళ్లెదుట ఉన్నా పూర్తిగా నిరూపణ కాని అణు రియాక్టర్ల కోసం కేంద్రంలోని యుపిఏ-2 ప్రభుత్వం, మహారాష్ట్రలోని కాంగ్రెస్‌-ఎన్‌సిపి సర్కార్‌ ఎందుకింత తహతహలాడుతున్నట్లు? అణు శాస్త్రవేత్తలు, నిపుణులు, వామపక్షాల నేతలు, ఇతర  పార్టిలు, రైతులు, మత్స్యకారులు, విద్యార్థులు ఇలా అన్ని తరగతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నారు  
                రేపు ఏదైనా ప్రమాదం జరిగితే చెర్నోబిల్‌ ప్రమాద సందర్భంగా వెలువడిన అణుధార్మికత (400 హిరోషిమా బాంబులకు సమానం ) కన్నా పది రెట్లు అధికంగా జైతపూర్‌ అణుధూళిని విరజిమ్ముతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెర్నోబిల్‌ ప్రమాదం వల్ల దాదాపు లక్ష చ.కి.మీ వరకు గల సారవంతమైన పొలాలు శాశ్వతంగా బీడుబారిపోయాయి.

            జపాన్‌లో ప్రమాదానికి గురైన రియాక్టర్ల రూపశిల్పి అరెవా కంపెనీయే జైతపూర్‌ కు కూడా ఇప్పుడు రియాక్టర్లను సరఫరా చేస్తున్నది. కొత్త డిజైన్‌ తో కూడిన ఈ రియాక్టర్లు ఇంతవరకు ఎక్కడా పరీక్షించకుండా . మన దేశంలో ప్రయోగం చేస్తున్నది. దిగుమతి చేసుకుంటున్న విదేశీ అణు రియాక్టర్ల వల్ల ఎలాంటి ముప్పు లేదని నిర్ధారణ అయ్యేవరకు విదేశీ అణు రియాక్టర్ల కొనుగోలుపై మారటోరియం విధించాలి. 
        అణు శాస్త్రవేత్తలు, నిపుణుల తో కూడిన స్వతంత్ర బృందం దీనిసై నిష్పాక్షికంగా అధ్యయనం జరిపి వీటి నిగ్గు తేల్చేంత వరకు జైతపూర్‌తో సహా కొత్తగా ప్రతిపాదించిన అణు విద్యుత్‌ ప్రాజెక్టులన్నిటిని నిలిపివేయాలి.
(  పత్రిక ల సహకరం తొ.....)

              

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి