19, ఏప్రిల్ 2011, మంగళవారం

సోషలిజానికి అనుగుణంగానే ఆర్థిక మార్పులు...క్యూబా

          దేశంలోని సోషలిజానికి అనుగుణంగానే ఆర్థిక మార్పులు ఉంటాయని క్యూబా అధ్యక్షుడు రావుల్‌ కాస్ట్రో తెలిపారు.  క్యూబా కమ్యూనిస్టు పార్టీ ఆరవ మహాసభను
ప్రారంభించారు.
         పలు మార్పుల ప్రతిపాదనలను ఈ సందర్భంగా ముందుకు తెచ్చారు. ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఆస్తుల కేంద్రీకరణను అనుమతించేందుకు వచ్చిన పలు సంస్కరణల సూచనలను ఆయన తిరస్కరించారు.  అయితే క్యూబా సోషలిస్టు వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు తెచ్చేందుకు ఆయన గట్టిగా మద్దతిచ్చారు. క్యూబా పలు క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.  అమెరికా దాడుల నుంచి తనను తాను రక్షించుకోవడాన్ని క్యూబా కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. అదే సమయంలో పరస్పర గౌరవం ఆధారంగా ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు తాము సానుకులంగా ఉన్నట్లు రావుల్‌ కాస్ట్రో పునరుద్ఘాటించారు.
            విప్లవాన్ని కొనసాగిస్తామని, పార్టీ, ప్రభుత్వ నాయకత్వాన్ని ఒక క్రమపద్ధతితో పునరుజ్జీవింపజేస్తామని రావుల్‌ మహాసభ ప్రారంభంలో ఉద్ఘాటించారు. మహాసభ ప్రారంభంలో ఆయన కేంద్ర నివేదికను ప్రవేశపెట్టారు. గొప్ప బాధ్యతలను చేపట్టేందుకు సన్నద్ధం కావాల్సిన ఆవశ్యకత ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. యువతకు ప్రధాన బాధ్యతలు అప్పగించనున్నట్లు చెప్పారు.  పిసిసి ఆర్థిక, సామాజిక విధాన మార్గదర్శకాలపై జరిగిన చర్చలో 89,13,000 మంది ప్రజలు పాల్గొన్నట్లు రావుల్‌ తెలిపారు
. ( గూగ్ల్స్ ఇమేజ్స్, పత్రిక ల సహకరం తొ.....)
 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి