క్యూబా ఆరో మహాసభ ముగింపు సమావేశంలో క్యూబా విప్లవ నేత ఫైడల్ కాస్ట్రో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నా ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా వున్నదని నాకు తెలుసు. కాని నేను ప్రశాంతంగానే వున్నాను. విప్లవం పురోగమిస్తూనే వుంది. సోవియట్ యూనియన్ అదృశ్యమైనప్పుడు నా జీవితంలో అది సంక్లిష్టసమయం. 2001 నుండి బుష్ అధికారంలో వున్నప్పుడు కిరాయి మూకలను పంపించి మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూశారు. ఇప్పుడు క్యూబాకి తోడు వెనిజులాలో మరొక విప్లవం జయప్రదమైంది. యాంకీలకు మింగుడు పడటంలేదు. వెనిజులా, క్యూబాల మధ్య స్నేహసం బంధాలు, సహకారం చరిత్రలో విప్లవ శక్తులకు ఒక ఉదాహరణగా నిలుస్తాయి.
ప్రతిరోజూ నేను ప్రపంచ పరిణామాలను శ్రద్ధగా పరిశీలిస్తున్నాను. రాజకీయ పార్టీలు, మానవుల నడవడికల్లో వివేకవంతమైన చర్యలను చూశాను. పొరపాట్లు చూశాను. గత 50 సంవత్సరాల్లో చాలా ఉదాహరణలు వున్నాయి. నేను చెప్పేది సూటిగానే ఉందని అనుకుంటున్నాను. క్యూబా విప్లవకారులు ఒక ప్రాథమిక కర్తవ్యాన్ని గుర్తుంచుకోవాలి. చిన్నదేశం పెద్ద క్లిష్టపరిస్థితుల్లో వుంది. తప్పులను నివారించటం ముఖ్యం అని చెప్పారు.
క్యూబా ప్రజల ఐక్యతను, సోషలిజాన్ని కాపాడాలనే ప్రజల శాశ్వత ఆకాంక్షను నెరవేర్చేందుకు మూల స్థంభాలైన సార్వభౌమత్వం, స్వాతంత్య్రాన్ని విస్మరించరాదని మహాసభ పేర్కొన్నారు. ప్రజాధికార సంస్థల నాయకత్వాన్ని, దేశ ఎన్నికల, రాజకీయ, పాలనా వ్యవస్థలను పరిపూర్ణంగా ఉంచేందుకు సిఫారసులు చేయాల్సిందిగా కేంద్ర కమిటీకి మహాసభ సూచించింది. అందరి సహాయంతో క్యూబా ఆర్థిక నమూనాను నవీకరించడం, క్యూబాలో సోషలిజం కొనసాగింపునకు హామీనివ్వడం తమ ముందున్న అత్యంత ముఖ్యమైన అంశమని రావుల్ కాస్ట్రో తెలిపారు.

( గూగ్ల్స్ ఇమేజ్స్, పత్రిక ల సహకరం తొ.....)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి