21, ఏప్రిల్ 2011, గురువారం

కులం పేరుతో పిలిచినా నేరమే ...సుప్రీంకోర్టు

                   దళితులను అవమానించే ఉద్దేశంతో వారిని కులం పేరుతో పిలవడం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నేరమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తమిళనాడులో ఇద్దరు వ్యక్తులను దోషులుగా నిర్ధారించడం సబబేనని చెప్పింది. ఇప్పటికీ అక్కడ 'రెండు గ్లాసుల' విధానం అమలులో ఉందని, ప్రభుత్వం ఈ జాడ్యాన్ని వదిలించకపోతే సంబంధిత పోలీసు, పౌర అధికారులు ఈ చట్టం కింద విచారణకు గురికావల్సి వస్తుందని జస్టిస్ మార్కండేయ కట్జు, జస్టిస్ జ్ఞానసుధా మిశ్రాలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది.

              ఆధునిక సమాజంలో ఇలాంటి కులవివక్ష ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సంప్రదాయ జల్లికట్టు ఉత్సవ సమయంలో బాధితులను నిందితులు తిట్టారు. ఆధునిక కాలంలో ఏ ఒక్కరి మనసునూ గాయపరచకూడదని, వాళ్ల కులం.. మతం.. తెగ.. భాషల ఆధారంగా తిట్టకూడదని కోర్టు చెప్పింది. అప్పుడు మాత్రమే మన దేశం సమైక్యంగా, బలంగా ఉంటుందని తెలిపింది. ఈ కేసులో నిందితులు అనాగరిక పద్ధతుల్లో ప్రవర్తించారని, అందువల్ల వారు క్షమాభిక్షకు ఏమాత్రం అర్హులు కారని.. అందువల్ల వారి అప్పీలును కొట్టేస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. 
(  పత్రిక ల సహకరం తొ.....)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి