23, ఏప్రిల్ 2011, శనివారం

ధరిత్రీని కాపాడుదాం...

              మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది.  వాతావరణ సమతుల్యం కోల్పోయి ఓజోన్‌పొర దెబ్బతినడం వల్ల పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి .  దీంతో క్యాన్సర్, చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి.  ప్రతి ఒక్కరూ విధిగా ఇంటి ఆవరణలో చెట్లను నాటాలి, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలి, వాహన కాలుష్యం తగ్గించాలి.  పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం  మనందరి మీద ఉంది.
                 దేశంలోని అరుదైన పక్షి జాతులు, వన్యప్రాణులను కాపాడుకోవడానికి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలి.  అడవులను నరికేస్తే భవిష్యత్తులో మనుగడ ప్రశ్నర్ధకం అవుతుంది.

         ఒకరికి ఒకరు  తోడైతే మన పర్యావరణాన్ని ఈ కాలుష్య భూతానికి బలికాకుండా కాపాడగలుగుతాం. మన కాలనీలలో, మనం వుండే గృహ సముదాయాలలో ఈ విషయం పై అవగాహన కల్పించి ఈ సత్కార్యానికి చేయూతనిస్తే మన భూమిని మరుభూమి కాకుండా చూడగలుగుతాం.

         అందుకే రండి.. ఆ ఆనందం లో మనమూ పాలుపంచుకొని, మనవంతు పని మనం చేసి మన తరువాతి తరాలకు పచ్చని పర్యావరణాన్ని శోభాయమానంగా అందిద్దాం..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి