పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు వేలెత్తి చూపకుండా వారిని వేలు పట్టుకుని నడిపించటం ద్వారా సరైన దిశానిర్దేశం చేయాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి పట్టాభిరామ్ సూచిం చారు. పిల్లలు వివిధ అంశాల్లో రాణించినప్పుడు మెచ్చుకోవటం, మంచి పనులు చేసినప్పుడు వారిని ప్రశంసించటం ద్వారా వారి భవిష్యత్తుకు పునాది వేయాలని కోరారు. ఎదుగుతున్న పిల్లల శారీరక, మానసిక సమస్యల్ని అర్థం చేసుకోవటం, పరిష్కార మార్గాల్ని చూపటం ద్వారా వారిలోని మానసిక ఒత్తిడిని దూరం చేయాలన్నారు. 'పిల్లల భవిష్యత్తు- తల్లిదండ్రుల బాధ్యత' అనే అంశంపై హైదరా బాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం శాసనమండలి సభ్యులు చుక్కా రామయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో బివి పట్టాభిరామ్ ప్రధాన వక్తగా ప్రసంగిస్తూ గతంలో సైకియాట్రిస్టుల వద్దకు ప్రేమలో వైఫల్యాలు, భార్యాభర్తల విడాకుల కేసులు, వరకట్న వేధింపుల్లాంటి కేసులు ఎక్కువగా వచ్చేవని, అయితే ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య బాగా తగ్గిందని చెప్పారు. ఇదే సమయంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య మనస్పర్థలు పెరగటం, వారి మధ్య సంబం ధాలు దెబ్బతిని అగాధం పెరిగిపోవటంలాంటి కేసులు 70 శాతం వరకూ వస్తున్నాయని చెప్పారు. అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ పిల్లల్ని సహజంగా పెరగనీయకపోవటం వల్ల వారిలో సున్నితత్వం దెబ్బ తింటోందని పట్టాభిరామ్ ఆందోళన వ్యక్తం చేశారు.
చదువు, ర్యాంకులు, కేరీర్ ధ్యాసలో పడి విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వివరిం చారు. ఈ నేపథ్యంలో నేటి సమాజంలో తల్లిదండ్రులే తమ పిల్లలకు హితులుగా, సన్నిహితులుగా, స్నేహి తులుగా మెలగాల్సిన అవసరముందన్నారు. విలువల గురించి చెప్పటమే కాకుండా వాటిని స్వతహాగా పాటించటం ద్వారా తల్లిదండ్రులు పిల్లలకు మార్గ దర్శకులుగా నిలవాలని చెప్పారు. పిల్లలను సరైన మార్గంలో పెట్టేందుకు ఐదు టిల పద్ధతి (టైమ్- పిల్లలకు సమయాన్ని కేటాయించటం, టాక్-వారితో రోజులో కొద్దిసేపైనా మాట్లాడటం, టచ్-వారిని ప్రేమతో, ఆప్యాయతతో నిమరటం, ట్రస్ట్-వారు చెప్పే మాటల్ని శ్రద్ధగా విని నమ్మటం, టీచ్-విలువల గురించి చెప్పటం)ని పాటించాలని పట్టాభిరామ్ ఈ సందర్భంగా తల్లిదండ్రులకు సూచించారు.
చుక్కా రామయ్య మాట్లాడుతూ గతంలో పిల్లల్ని కనట మనేది సహజ పరిణామంగా భావించేవారని, ప్రస్తు తం పిల్లల్ని కనటమంటే ఒక సామాజిక బాధ్యతకు సిద్ధం కావటమేనని చెప్పారు. పిల్లల పెంపకంలో లోపం జరిగితే అది భవిష్యత్తులో సమాజంలో సంక్షో భాన్ని సృష్టించే ప్రమాదముందని హెచ్చ రించారు. పిల్లలకు ప్రేమ, ఆప్యాయతను పంచటం, వారికి దిశానిర్దేశం చేయటంలో తల్లికి ప్రత్యామ్నాయం లేనేలేదన్నారు. గతంలో పిల్లలు తల్లిండ్రులంటే భయ భక్తులను కలిగి ఉండేవారని, ప్రస్తుతం మారుతున్న సమాజ పరిస్థితులకు అను గుణంగా తల్లిదండ్రులు పిల్లల నుండి భయం, భక్తిని ఆశించటం కంటే వారితో ప్రేమగా మెలగటం ద్వారానే మంచి వ్యక్తు లుగా తీర్చిదిద్దాలని సూచించారు. పిల్ల లతో పరస్పరం అభిప్రాయాలను పంచు కోవటం ద్వారా వారి సమస్యల్ని, ఇబ్బం దుల్ని, సాధకబాధకాల్ని పసిగట్టాలని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ విలువలకు అనుగుణంగా నడుస్తున్న మీడియా కూడా పిల్లలపై విపరీతమైన ప్రభావాన్ని చూపి స్తోందని రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పత్రికలు, ఛానళ్లలో మెటీరియ లిజం, వెండలిజం, వయోలెన్స్‌కే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, వీటన్నింటి నుండి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉందన్నారు. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచటం అవసరమేనని, ఇదే సమయంలో వారు తప్పు చేస్తున్నారనే కారణంతో దండించటం సరికాదని రామయ్య హితవు పలికారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, గ్రేటర్ హైదరాబాద్ రెసిడెంట్స్ ఫోరం, ఎపి మెడికల్ అండ్ సేల్స్ రిప్ర జెంటేటివ్స్ యూనియన్, ఐక్య ఉపాధ్యాయ ఫెడ రేషన్, ప్రజాశక్తి సాహితీ సంస్థ, ఐద్వా, పీపుల్ ఫర్ ఇండియా, ఐలు, జెవివి, ప్రజా నాట్య మండలి ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి.
( ప్రజాశక్తి పత్రిక సౌజన్యం తో... )
( ప్రజాశక్తి పత్రిక సౌజన్యం తో... )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి