15, జులై 2011, శుక్రవారం

నింగిలోకి దోసుకెళ్లినా పీఎస్‌ఎల్‌వీ సీ-17


పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌దావన్‌ అంతరిక్ష ప్రయోగం షార్‌ నుంచి ఈరోజు సాయంత్రం పీఎస్‌ఎల్‌వీ-సీ17 రాకెట్‌ను ప్రయోగించారు. 1410 కిలోల  బరువున్న సమాచార  ఉపగ్రహం జీ శాట్ -12  ఈది   నింగిలొకి  మొసుకెల్లింది.  విజయవంతగా జీ శాట్ -12 కక్ష్యలోకి ప్రవేశించడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు.

                 ఈ రాకెట్‌ 295 టన్నుల బరువు, 44 మీటర్ల ఎత్తు ఉంటుంది. నాలుగు దశల్లో ఈ రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దోసుకెళ్లింది. భూమికి 26వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర మధ్యంతర కక్ష్యలోకి అంతరిక్షంలోకి దూసుకెళుతుంది.  గ్రామీణ సమాచార వ్యవస్థ మరింత పటిష్టతను చేసే జీశాట్‌-12 ఉపగ్రహం నింగిలోకి మోసుకెళ్లింది. 200 కోట్ల రూపాయల వ్యయంతో జీ-12ను రూపొందించారు.  జీశాట్‌-12 ఎనిమిదేళ్లపాటు సేవలు అందించనుంది.  ఇది చారిత్రాక విజయం అని ఇస్రోవర్గాలు అంటున్నాయి. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 19వ ప్రయోగం.  భారత జాతికే ఈ ప్రయోగం గర్వకారణమని శాస్తవేత్తలు  అన్నారు. ఈది  పూర్తిగా  స్వదేసి పరిజఞనంతో  రూపొందించారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి