4, సెప్టెంబర్ 2016, ఆదివారం

మట్టి గణేష్‌ల ఉచిత పంపిణి ...హైదరాబాద్‌ జిందాబాద్‌

బాగ్‌లింగంపల్లిలో ఎల్‌ఐజి గ్రౌండ్‌ వద్ద హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో 03.09.2016న మట్టి గణేష్‌ల ఉచిత పంపిణి కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిధిగా హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు పాశం యాదగిరి గారు పాల్గొని మట్టి గణేష్‌లను పంపిణి చేశారు.ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరంలో వైభవంగా నిర్వహించుకొనే '' వినాయక చవితి'' పండుగ అని అన్నారు. ప్రతి ఇంటిలో కుటుంబ సమేతంగా నిర్వహించుకుంటూ అపార్ట్‌మెంట్స్‌, కాలనీ, బస్తీలలో సామూహికంగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించుకొని పూజించటం ఆనవాయితిగా వస్తున్నది. ఇళ్ళల్లో మరియు సామూహికంగా ప్రతిష్టించే గణేష్‌ విగ్రహాలను పర్యావరణానికి హానికరం కాని మట్టి గణేష్‌లనే ఉపయోగించాలని హైదరాబాద్‌ జిందాబాద్‌ విజ్ఞప్తి చేస్తున్నది.
అందుకే పర్యావరణహితమైన విగ్రహాలను ఐదు అడుగులలోపే బుజ్జి, బుజ్జి వినాయకులను భక్తితో పూజిద్దాం. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రావు, నగర సహాయ కార్యదర్శి వి.విజయకుమార్‌, నగర నాయకులు వెంకటేశ్వర్‌రావు, కె.వీరయ్య, ఎల్‌ఐజి కాలనీ నాయకులు భూపాల్‌, శేఖర్‌, లింగారెడ్డి, స్థానిక నాయకులు 
సి. మల్లయ్య, జి.రాములు తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి