అంబర్‌పేట డిడి కాలనీలోని ఎస్‌బిఐ కాలనీ పార్క్‌లో 04.09.2016 ఉచిత గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాదరావు గారు ప్రారంభిస్తూ ప్రసంగించారు. నగరంలో సాంప్రదాయరీతులలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవటం ఆనవాయితీ అన్నారు. నిమజ్జనం అనంతరం మట్టితో తయారైన విగ్రహం మట్టిలోనే కలుస్తుందని , దీని వలన సమాజానికి ఎలాంటి హాని ఉండదని అన్నారు. కానీ ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తో తయారు అయిన గణపతుల వల్ల కాలుష్యం ఎక్కువగా ప్రబలుతుందని, అది ఎంతో హాని కరమని హెచ్చరించారు.
సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి గారు మాట్లాడుతూ '' వట్టి మాటలు కటిపెట్టి - మట్టి గణపతి పెట్టవోరు '' అంటూ పిలుపునిచ్చారు. మట్టి గణపతులనే వాడాలని - కాలుష్యకారకమైన, విషరసాయక రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాలు వద్దని అన్నారు. ఆర్‌డివో సురేష్ గారు మాట్లాడుతూ కాలుష్య సమస్య అత్యంత తీవ్ర సమస్యగా మన ముందుకు వచ్చిందని, మానవాళి మనుగడకే ప్రమాదంగా మారిందని అన్నారు. అనంతరం ఎస్‌బిఐ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజగోపాల్ రెడ్డి, ఆర్‌వి రాజు గార్లు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిందాబాద్ అంబర్‌పేట అధ్యక్షులు మల్లం రమేష్, నగర నాయకులు జె. కుమారస్వామి, కె. వీరయ్య, విజయ, జెకె శ్రీనివాస్, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాలనీల ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి