ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిహెచ్‌ఎంసి డిప్యూటి కమీషనర్ శ్రీమతి ఉమా ప్రకాష్ గారు పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం (30.11.2018) సుందరయ్య పార్క్‌లో హైదరాబాద్ జిందాబాద్ మరియు వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ఆధ్వర్యంలో ఓటుపై అవగహన సదస్సు జరిగింది. భారత రాజ్యాంగము కల్పించిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ జిందాబాద్ సంస్థ ముందుకు రావడం, వారు చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు. డిసెంబర్ 7న పౌరలందరం ఓటేయాలని కోరారు.
కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ (సుందరయ్య పార్క్) అధ్యక్షులు శ్రీమతి శైలాజ మోహన్ గారు, ఎఎంహెచ్‌వో డా|| హేమలత గారు, హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌రావు గారు, ఉపాధ్యక్షులు కె.వీరయ్య, సహయ కార్యదర్శులు రమణ, వి. విజరుకుమార్, జెకె శ్రీనివాస్, పి. నాగేశ్వర్‌రావు, పి.శ్రీనివాస్, రమేష్, జి.రాములు తదితరులు పాల్గొంన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి