5, డిసెంబర్ 2018, బుధవారం

ప్రధాన పార్టీలలోనే 83 శాతం కోటీశ్వరులు...

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆస్తి అక్షరాల 314కోట్లు. ఆ తరువాత నిజామాబాద్‌ అభ్యర్థి ముత్యాల సునీల్‌కుమార్‌(బీఎస్పీ) 182 కోట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. 
నాగర్‌కర్నూల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన మర్రి జనా ర్దన్‌రెడ్డి తృతీయ స్థానంలో నిలిచారు.

మొత్తం 1,821 మంది అభ్యర్థులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవగా వారిలో 1,777 మంది తమ ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చారు. వీరిలో 438 (25%) మంది కోటీశ్వరులు.
రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి కలిగిన అభ్యర్థులు 192 (11%) మంది ఉన్నారు. 
 120 (7%) మందికి రూ.2 కోట్ల నుంచి 5 కోట్లు, 
275 (15%) మందికి రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్లు, 
453 (26%) మందికి రూ.10 లక్షల నుంచి 50 లక్షలు, 
737 (41%) మంది 10 లక్షల కంటే తక్కువగా ఆస్తి కలిగి ఉన్నారు.

పార్టీల వారీగా చూస్తే టీఆర్‌ఎస్‌ నుంచి 119 అభ్యర్థుల్లో 107 (90%) మంది కోటీశ్వరులు. 
బీజేపీది ద్వితీయ స్థానం. ఆ పార్టీ నుంచి 118 మంది బరిలో ఉంటే వారిలో 86 (73%) మంది కోటీశ్వరులు. 
 ఆతరువాత స్థానాల్లో కాంగ్రెస్‌ 99 మందికి గాను 79 (80%), 
బీఎస్పీ 100 మందికిగాను 26 (26%), 
టీడీపీ నుంచి 13 మంది అభ్యర్థుల్లో 12 (92%) మంది ఉన్నారు. 
119 అభ్యర్థుల్లో 58 మందికి అసలు ఆస్తులు లేవని ప్రకటించారు.
ఈనాడు...04.12.2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి