ఇంట్లో టీవీ, చేతిలో మొబైల్ ! ఎక్కడ చూసినా ఇదే దృశ్యం ! కనబడుతుంది.
'టీవీ' ప్రేక్షకులకు, సెల్లు ప్రియులకు శాస్త్రవేత్తలు మరో హెచ్చరిక చేశారు. టీవీ అతిగా చూస్తే త్వరగా మరణిస్తారని ఒకరు పేర్కొనగా... మొబైల్ ఎక్కువగా వాడితే తమ సహజప్రవర్తన మరచిపోయి మూర్ఖులుగా మారే ప్రమాదముందని మరో అధ్యయనంలో తేలింది. రోజుకు 2 గంటలు టీవీ చూసేవారికి టైప్ 2 ధుమేహం, గుండెజబ్బులు వస్తాయని హార్వ ర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (హెచ్ఎస్‌పీహెచ్) కు చెందిన నిపుణులు తెలిపారు. రోజుకు మూడుగంటలపాటు చూస్తే... 'ముందస్తు మరణం' తథ్యమన్నారు. శారీరక శ్రమను ప్రోత్సహించడంతోపాటు... టీవీ చూడటంలాంటి 'నిశ్చేష్ట' పనులను త్యజించాలని సూచించారు.

ఇక సెల్‌ఫోన్ల వాడకంవల్ల నానారకాల సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి. మొబైల్‌ను అతిగా ఉపయోగించడంవల్ల మన ధోరణిలోనూ మార్పు వస్తుంద ని ఆస్ట్రేలియాకు చెందిన టెల్‌స్ట్రా సంస్థ జరిపిన ఆన్‌లైన్ సర్వేలో తేలింది. కొందరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వారి ప్రవర్తన, ధోరణిల్లో మార్పు కన్పిస్తుందని, కొందరు మూర్ఖంగా తయారవుతారని ఇందులో స్పష్టమైంది.
సమాచార మార్పిడి ఇంత సులభంగా జరుగుతుండటం సంతోషించదగ్గ విషయమే అయినా, ఈ ఎస్‌ఎంఎస్‌ల వెనక అనేక అనర్థాలు పొంచి ఉన్నాయని మరొ సంస్థ జరిపిన సర్వేలో నిపుణులు అంటున్నారు. సెల్ ఫోన్ విచ్చలవిడి వినియోగం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అసోచాం మరో దిగ్భ్రాంతికర విషయం వెల్లడించింది. విపరీతమైన ఎస్‌ఎంఎస్‌ల వినియోగం వల్ల మెదడులో కణితి (బ్రెయిన్ ట్యూమర్) ఏర్పడే ప్రమాదం ఉందని, సంతానం కలగకుండా (ఇన్‌పెర్టిలిటీ) పోయే అవకాశం ఉందని అసోచాం చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు ఉన్న ఇతర అనేక మార్గాలను ఎస్‌ఎంఎస్‌లు అధిగమించాయి. ముఖాముఖి సంభాషణలు, వాయిస్ కాలింగ్, ఇ-మెయిలు...ఇలాంటివి వినియోగించడం కంటే ఎస్‌ఎంఎస్‌ల వినియోగంపైనే యువత అధికంగా ఆధారపడుతోందని అసోచాం పేర్కొంది. ఎస్‌ఎంఎస్‌ల అధిక వినియోగం వల్ల పిల్లల్లో నిద్రలేమి, డిప్రెషన్, తిండి మీద ధ్యాస లేకపోవడం వంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు అంటున్నారు.

ఈ మద్య మా మిత్రుడుకి ఈలాంటి జబ్బు వస్తే 10 రోజులు హాస్పిటల్ లొ వున్నడు. ప్రధన కారణం అతిగా సెల్‌ఫోన్ల వాడకం. సెల్‌ఫోన్ల వాడకంలో అతిగా ఉపయోగించకుండ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
( పత్రికల సహకారంతో ...)
( పత్రికల సహకారంతో ...)
Lot of hype. Not sure how trust-worthy such studies are.
రిప్లయితొలగించండి